Fri. Apr 19th, 2024
Zika-virus-in-karnataka

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,రాయచూర్,13 డిసెంబర్ 2022: ఇప్పటిదాకా ఉత్తరాదిన మాత్రమే నమోదైన జికా వైరస్ కేసులు.. నెమ్మదిగా దక్షిణ భారతదేశం లోనూ పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో జికా వైరస్ మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది.

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు సోమవారం జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 67 ఏళ్ల వ్యక్తికి కూడా పూణే ఆసుపత్రిలో చేరిన తర్వాత పాజిటివ్ గా తేలింది. జూన్-జూలైలో భారతదేశంలో పలు చోట్ల కేసులు పెరిగాయి.

Zika-virus-in-karnataka

దక్షిణాది రాష్ట్రంలో తొలిసారిగా ఈ వ్యాధి సోకిందని కర్ణాటకరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ ధృవీకరించారు. జికా వైరస్ ఆందోళన కలిగించదని, వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, అందుకోసం మార్గదర్శకాలను జారీ చేస్తామని మంత్రి ప్రజలకు భరోసా ఇచ్చారు.

మాండౌస్ తుఫాను ఫలితంగా రాష్ట్రంలో చలి, మేఘావృతమైన వాతావరణం మరియు చిమ్మటలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి, ఎందుకంటే ఈ పరిస్థితులలో వైరస్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ మాట్లాడుతూ, “కర్ణాటకలో ఇది మొదటి ధృవీకరించిన కేసు, సీరం డెంగ్యూ , చికున్‌గున్యా పరీక్షలు చేసినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. సాధారణంగా, అటువంటి నమూనాలలో కొన్ని పరీక్ష కోసం పూణేకు పంపగా పాజిటివ్‌గా వచ్చింది”.

జికా వైరస్ అంటే ఏమిటి?..

Zika-virus-in-karnataka

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జికా వైరస్ ఈడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటివి ఈ దోమల ద్వారా వ్యాపిస్తాయి. జికా వైరస్ రక్త పరీక్ష లేదా ఇతర శరీర ద్రవ పరీక్షలను ఉపయోగించి గుర్తించవచ్చు. ప్రస్తుతం జికా వైరస్‌కు నిర్దిష్ట చికిత్స కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేదు.

జికా వైరస్ లక్షణాలు ఏమిటి?


వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, వ్యాధి సాధారణ లక్షణాలు ఎల్లా ఉంటాయంటే..? దద్దుర్లు, జ్వరం, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, నీరసం, తలనొప్పి వంటివి ఉంటాయి. దాదాపు 80 శాతం కేసులు ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యాధి వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జికా వైరస్ సోకిన మెజారిటీ వ్యక్తులు ఈ లక్షణాలలో పెద్దగా కనిపించలేదట. లక్షణాలు సాధారణంగా 2-7 రోజులు మాత్రమే ఉంటాయట.

గర్భిణీ తల్లి నుంచి కూడా పిండానికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందట, దీని వలన శిశువుల మెదడుపై ప్రభావం చూపుతుందట. తద్వారా శిశువులో పలు లోపాలు తలెత్తవచ్చని అంటున్నారు డాక్టర్లు.

జికా వైరస్‌కు అందుబాటులో ఉన్న చికిత్స ఏమిటి?

Zika-virus-in-karnataka

జికా వైరస్‌ కు నిర్దిష్ట చికిత్స లేదు. విశ్రాంతి తీసుకోవడం, హైడ్రేటెడ్ గా ఉండటం ఈ లక్షణాలను నివారించడంలో సహాయపడుతుంది. టైలెనాల్ బ్రాండ్ పేరుతో ఓవర్-ది-కౌంటర్ (OTC) విక్రయించే ఎసిటమైనోఫెన్ జ్వరం, కీళ్ల నొప్పులకు ఉపయోగిస్తున్నారు. అదికూడా వైద్యుడిని సంప్రదించి మాత్రమే చికిత్స తీసుకోవాలి.

జికా వైరస్‌ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జికా వైరస్ వ్యాధికి టీకా, నిర్దిష్ట చికిత్స లేదు, కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దోమలు వృద్ధి చెందే చోట నిలిచిపోయిన నీటిని తొలగించాలి. పెద్ద ,చిన్నా అనే తేడాల్లేకుండా దోమలు కుట్టకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు సహా ప్రతి ఒక్కరూ దోమల బెడద నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.