Fri. Mar 29th, 2024
Yoga guru Baba Ramdev

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,నవంబర్ 26,2022: ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలేను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే గ్రూపునకు చెందిన అబ్దుల్ సత్తార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతుండగా.. తాజాగా రామ్‌దేవ్ బాబా కొత్త వివాదానికి తెరతీశారు. నిత్యం తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Yoga guru Baba Ramdev

మహిళల దుస్తుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలు ఏమీ ధరించకపోయినా అందంగా కనిపిస్తారు’ అంటూ ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. థానేలో యోగా కార్యక్రమంలో మాట్లాడుతున్న రామ్‌దేవ్ బాబా టంగ్ స్లిప్ అయ్యారు. ‘మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు, సల్వార్ సూట్‌లో అందంగా కనిపిస్తారు, నా దృష్టిలో వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగానే కనిపిస్తారు’ అని బాబా రామ్‌దేవ్ అన్నారు.

ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద రచ్చే జరుగుతోంది.

మహిళలు యోగా కోసం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు చీరలు తీసుకొచ్చారు. అయితే ఉదయం మహిళలకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆ వెంటనే మహిళా మహాసభ ప్రారంభమైంది. దీంతో మహిళలకు చీర కట్టుకోవడానికి సమయం దొరకడం లేదు. దీనిపై బాబా రామ్‌దేవ్ ఓ ప్రకటన చేస్తూ.. చీర కట్టుకోవడానికి మీకు సమయం లేకపోయినా ఇబ్బంది లేదని, ఇప్పుడు ఇంటికి వెళ్లి చీర కట్టుకోండి అని అన్నారు.

Yoga guru Baba Ramdev

“మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు, మహిళలు సల్వార్ సూట్‌లలో కూడా అందంగా కనిపిస్తారు, ,నా దృష్టిలో వారు ఏమీ ధరించకపోయినా అందంగా కనిపిస్తారు.” అని రాందేవ్ బాబా అన్నారు. పతంజలి యోగా పీఠ్ , ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం థానేలోని హైలాండ్ ప్రాంతంలో యోగా సైన్స్ శిబిరంతోపాటు మహిళల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే లు పాల్గొన్నారు. ఇదే సమయంలో బాబా రామ్‌దేవ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.