Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి28,2022: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్, స్మార్ట్‌ టీవీ బ్రాండ్‌ షియామీ ఇండియా, తన కస్టమర్ల ఆఫ్టర్‌ సేల్స్‌ అవసరాలు తీర్చేందుకు ఒకే వేదికగా షియామీ సర్వీస్‌+ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. నిరంతరాయ ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీసు అందించాలన్న షియామీ దీర్ఘకాలిక నిబద్ధతకు షియామీ సర్వీస్‌+ తార్కణంగా నిలుస్తుంది. డివైస్‌ రిపేర్‌, ధరల కొటేషన్‌, లైఫ్ చాట్‌ అసిస్టెన్స్‌, ఇంకా ఇతర ఎన్నో సపోర్టు సేవలు ఇది అందిస్తుంది. కస్టమర్లు ఇంట్లో హాయిగా కూర్చొని కొన్ని క్లిక్స్‌తో ఈ సేవలన్నీపొందవచ్చు. ఒక ఉత్పత్తి కొన్నతర్వాత బ్రాండుతో కస్టమర్‌కు బలమైన అనుబంధం కొనసాగేలా చూసే ఉద్దేశంతో షామీ సర్వీస్‌+ రూపొందించబడింది.  అన్నిషియామీ డివైసుల రిపేర్‌ రిక్వెస్టులు, ఇన్‌స్టాలేషన్‌, డెమోలను ఈ యాప్‌ ద్వారా బుక్‌ చేయవచ్చు.

  అంతే కాదు ఔట్‌రీచ్‌ సర్వీసుల కోసం సమీపంలోని సర్వీస్‌ సెంటరును కూడా దీన్ని ఉపయోగించి కనుగొనవచ్చు. విడిభాగాల ధరల కోసం యూజర్లు కొటేషన్లు కోరవచ్చు అలాగే వారు కొనుగోలు చేసిన డివైసులవారెంటీ సమాచారం కూడా చూడవచ్చు. యాప్‌ ఉపయోగించి తమ సర్వీస్‌రిక్వెస్టు ప్రోగ్రెస్‌, స్టేటస్‌ కూడా చెక్‌ చేయవచ్చు. అంతే కాదు, కస్టమర్లు  ఎఐ బాట్‌తో చాట్‌, ఏజెంట్‌తో లైవ్‌ చాట్‌ వంటి సాయం పొందేలా కూడా షియామీ సర్వీస్‌+ చూస్తుంది.

షియామీ సర్వీస్‌, ఆవిష్కరణ సందర్భంగా షియామీ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ.బి మాట్లాడుతూ, “డివైస్‌ కొనుగోలే కాదు ఆ తర్వాత అనుబంధం
నిర్మించుకునేందుకు షియామీలో మేము కృషి చేస్తాం. ప్రతీ కస్టమరుకు
వేగవంతంగా సమస్యల పరిష్కారం, వేగవంతమైన సొల్యూషన్స్‌తో నిరంతరాయ
ఆఫ్టర్‌ సేల్స్ సర్వీసు అందించాలన్న మా నిబద్ధతకు ప్రతిబింబంగా
నిలుస్తుంది షియామీ సర్వీస్‌+ యాప్‌. హోమ్‌ సర్వీసెస్‌కు పెరుగుతున్న
డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రతీ కస్టమర్‌ సర్వీసు రిక్వెస్టును వారి
ఇంటి నుంచి కొన్ని క్లిక్స్‌తో అందించేందుకు కృషి చేస్తుంది.


షియామీ సర్వీస్‌, రిక్వెస్టులు రెయిజ్‌ చేసేందుకు, రిక్వెస్ట్‌ స్టేటస్‌ ట్రాక్‌
చేసేందుకు, కొనుగోలు చేసిన డివైస్‌ వారెంటీకి సంబంధించిన సమాచారం
అందించడం సహ ఎన్నో ఇతర ఫీచర్ల కోసం ఈ యాప్‌ను ప్రభావవంతంగా
ఉపయోగించుకోవచ్చు. యూజర్లకు ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీస్‌ ఎక్స్‌పీరియన్స్‌
పెంచడంలో షామీ సర్వీస్‌+ ఒక మైలురాయిగా నిలుస్తుంది” అన్నారు.
కేవలం కొన్ని క్లిక్స్‌తో యూజర్స్‌కు కావాల్సిన సమాచారం అందించడం షామీ
సర్వీస్‌+ లక్ష్యం.  దీన్ని గూగుల్‌ ప్లే లేదా గెట్‌ యాప్స్‌ నుంచి
డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 2000కు పైగా సర్వీస్‌ సెంటర్లతో  భారతదేశంలో
అతి పెద్ద నెట్‌వర్క్స్‌లో ఒకటైన షామీ ఇండియా అందిస్తున్న సర్వీసు
రిక్వెస్టులో మొట్టమొదటి టచ్‌ పాయింట్‌.  ఈ సెంటర్లకు ISO 9001,
120001 సర్టిఫికేషన్‌ ఉంది. వీటి టర్న్‌ అరౌండ్‌ టైమ్‌ సక్సెస్‌ రేటు 96% గా
ఉంది.