Sat. Apr 20th, 2024
CORONA
COVID-19 UPDATE

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, ఫిబ్రవరి 19,2022: అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దేశంలో కొత్త‌గా 22,279 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇండియాలో కొత్త‌గా 22,279 మందికి క‌రోనా వైర‌స్ సోకగా..శుక్రవారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య14 శాతం త‌గ్గింది. 60వేల 298 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 325 మంది మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 5,11,230. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 175.03 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు.

COVID-19 UPDATE

తెలంగాణలో జనవరిలో కరోనా వ్యాప్తి పెరిగింది. దీంతో ఓ వైపు ఫీవర్​ సర్వేలు, మరోవైపు వ్యాక్సినేషన్​ వేగవంతం చేసింది తెలంగాణ సర్కారు. దీంతో ఇతర రాష్ట్రాల కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా… 41,042 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 425 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 7,86,021కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదు కాలేదు. కోవిడ్ బారి నుంచి శుక్రవారం1,060 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 6,111 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ అత్యధికంగా 130 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా.. నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 23, నారాయణపేట 2, నిర్మల్ 3, నిజామాబాద్ 15, పెద్దపల్లి 4, సిరిసిల్ల 4, రంగారెడ్డి 29, సిద్దిపేట 19, సంగారెడ్డి 11, సూర్యాపేట8, వికారాబాద్ 4, వనపర్తి 5, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 10, యాదాద్రి భువనగిరిలో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,383 మందికి పరీక్షలు చేయగా.. 495 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనాతో ఒకరు మరణించా రు. మరోవైపు1,543మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

India's Active Caseload (4,21,665) presently constitutes 1.35% of total cases

ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 3 కోట్ల 29 లక్షల 38వేల 630కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కేసులు నమోదు కాగా.. అతి తక్కువగా కర్నూలు జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ఆదేశించింది. సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని సీఎస్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉన్నతాధికారులూ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ విధానం పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమావేశాలకూ భౌతికంగా హాజరుకావాలని పేర్కొన్నారు. సీఎస్‌, మంత్రుల సమీక్షలకూ భౌతికంగానే హాజరుకావాలని కోరారు.