Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 2,2023: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం మే 2 ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నారు. వర్షాకాలం కోసం విమానాశ్రయంలో మరమ్మత్తులు చేయనున్నారు. దీని కారణంగా విమానాశ్రయం మూసివేస్తారు.

ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి విమానాశ్రయంలో ప్రతి సంవత్సరం మరమత్తులు నిర్వహిస్తారు. ఇంజనీర్లు, ఎయిర్‌సైడ్ బృందాలు ఎయిర్‌స్ట్రిప్‌లో ఏదైనా లోపం ఉందా అని తనిఖీ చేస్తారు. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సరిచేస్తారు.

ప్రయాణీకుల సౌలభ్యం, భద్రత ఈ సమయంలో విమానాశ్రయం లోని రెండు రన్‌వేలు (09/27 అండ్ 14/32) మరమ్మతుల కోసం దాదాపు 6 గంటలపాటు మూసి వేయనున్నారు.

భద్రత దృష్ట్యా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కార్యకలాపాలు పునరుద్ధరిస్తామని ఎయిర్‌పోర్టు తెలిపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండవ సింగిల్ రన్‌వే విమానాశ్రయం.

ప్రతిరోజూ దాదాపు 900 విమానాలను నిర్వహిస్తోంది. విమానాశ్రయాన్ని 6 గంటలు పాటు తాత్కాలికంగా మూసి వేయనున్నారు. ఇది ఎటువంటి సమస్య లేకుండా విమాన కార్యకలాపాలను కొనసాగించడంలో సహాయపడుతుంది.

మెయింటెనెన్స్..

విమానాశ్రయ నిర్వహణ కోసం, నిపుణులు మైక్రోటెక్చర్ అండ్ మాక్రోటెక్చర్ వేర్ అండ్ టియర్ కోసం రన్‌వే ఉపరితలాన్ని తనిఖీ చేసి లోపాలను గుర్తిస్తారు. సమాచారం ప్రకారం, ముంబై ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌లైన్స్, ఏవియేషన్ అధికారులు అనేక మంది వాటాదారుల సహాయంతో మరమ్మతు, నిర్వహణ ప్రణాళికను రూపొందించింది. రన్‌వేను వర్షాకాలానికి ముందే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది, తద్వారా విమాన నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదు.

ఇవి కూడా చదవండి..

SBIలో ఉద్యోగ అవకాశాలు..నెలకు 1 లక్ష జీతం

నకిలీ సర్టిఫికేట్‌తో 36ఏళ్లు ఉద్యోగం, పదవీ విరమణ తర్వాత జైలు శిక్ష, 50 లక్షల జరిమానా..

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..

అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యా సంస్థలు సామాజిక శాపం అన్న సీఎం

డిజిటల్ అవసరాలను తీర్చడానికి వర్క్‌ఫోర్స్‌ను ప్రోత్సహిస్తున్న నెక్స్ట్ వేవ్..

గ్లోబల్ లెవల్ లో హెయిర్ కలర్ మార్కెట్ ఎంత..?

తప్పుదోవ పట్టించే ఫుడ్ కంపెనీలపై కేసులు నమోదు..