Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 24,2022:తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నతశ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు జెరాక్స్‌ కాపీలను తీసుకుని ఉదయం 9.30 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనంలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఆయుర్వేద సంహిత‌, సిద్ధాంత (యుజి) విభాగంలో ప్రొఫెసర్‌ -1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-1, కౌమారభృత్య(యుజి) విభాగంలో ప్రొఫెసర్‌ -1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-1 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.