Fri. Mar 29th, 2024
Delhi Municipal corporation

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,జనవరి 6,2023:ఢిల్లీ మినీ ప్రభుత్వానికి ఈరోజు కొత్త బాస్ రానున్నారు. సమీకృత మున్సిపల్ కార్పొరేషన్ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నారు.

పూర్తి మెజారిటీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ షైలీ ఒబెరాయ్‌ను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టగా, రేఖా గుప్తా బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. అదే సమయంలో ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ ఎఫ్)భారత ప్రభుత్వం నిషేధించింది.

Delhi Municipal corporation

టిఆర్‌ఎఫ్ అనేది పాకిస్తాన్ ఆధారిత నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ముఠాకు చెందింది. ఇది జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాలల్లో పాల్గొంది.

టెర్రరిస్ట్ గ్రూప్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పై నిషేధం..

ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే ఉగ్రవాద సంస్థను భారత ప్రభుత్వం నిషేధించింది. టిఆర్‌ఎఫ్ అనేది పాకిస్తాన్ ఆధారిత నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన గ్రూప్. ఇది జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అనేక నేరాల్లో పాల్గొంది.

టిఆర్‌ఎఫ్‌ని నిషేధిస్తూ హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 ప్రకారం TRF కమాండర్ షేక్ సజ్జాద్ గుల్‌ను ఉగ్రవాదిగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది