Fri. Apr 19th, 2024
virataparvam
“Virataparvam” Movie Review

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, జూన్ 17,2022: ఫస్ట్ హాఫ్ : విరాట పర్వం మొదటి సగం వెన్నెల లవ్ స్టోరీ ,ఆమె రవన్నను ఎలా కలుస్తుంది. నక్సల్ నేపథ్యం, కార్యకలాపాలు ఉన్నాయి. చివరగా, వెన్నెల రవన్నను కలుస్తుంది. విరామం. వెన్నెల రవన్నను కలిసే మార్గం కోసం కష్టపడుతుంది. అందుకోసం వెన్నెల రావన్న కోసం ఇంటి నుంచి అడవికి బయలుదేరుతుంది. ఆమె అతనితో గాఢమైన ప్రేమలో ఉంది. కానీ, వారిద్దరూ అప్పటి వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. వెన్నెల అరణ్య (రాణా) మావోయిస్ట్ కవిత్వం నుంచి ప్రేరణ పొందుతుంది. ఆమె అతనితో ప్రేమలో ఉంది. వెన్నెల (సాయి పల్లవి) కథ ప్రారంభమవుతుంది.

virataparvam

“Virataparvam” Movie Review

“విరాట పర్వం” మంచి ప్రయత్నం ,దానిని తప్పక అభినందించాలి. అయితే, ఇది ప్రధానంగా ఆత్మ లేని ప్రేమకథ. నక్సల్ బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉంది, కానీ హత్తుకునే ముగింపుని చేరుకోకముందే లక్ష్యం లేకుండా అన్ని చోట్లా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. విరాట పర్వం సెకండాఫ్. వెన్నెల తనని తాను కామ్రేడ్ వెన్నెలగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది.

virataparvam

“Virataparvam” Movie Review

ఈ ఏడాది విడుదలైన అత్యుత్తమ తెలుగు చిత్రాల్లో విరాటపర్వం ఒకటి. అని ఖచ్చితంగా చెప్పవచ్చు. నిర్భంధాలని కౌగిలించుకున్న వసంతకాలం మనది..రేపు మనం ఉన్నా లేకపోయినా చరిత్ర ఉంటుంది..మన ప్రేమకథను వినిపిస్తుంది. ఈ డైలాగ్ చాలా సినిమాను నిలబెట్టడానికి ..అది అక్బర్ దర్బార్,ఇష్క్ మే జీనా, ఇష్క్ మే మర్నా…జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా అంటూ.. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ముందు ధైర్యంగా, ఓ ఆస్థాన నర్తకి అదే దర్బార్ లో ఉన్న సలీంపై ,తనకున్నఅపారమైన ప్రేమను వ్యక్తపరుస్తుంది.ఆ ఆస్థాన నర్తకి పేరు అనార్కలి.
“Virataparvam” Movie Review

మొఘల్ ఈ ఆజమ్లో ఈ సన్నివేశం భారత దేశ సినీ చరిత్రలోనే ఒక గొప్ప సన్నివేశం. అనార్కలి పాత్రలో నాడు మధుబాల నటించిన తీరును, ఈ నాటికీ సినీ పండితులు గొప్పగా చెబుతుంటారు. భారతీయ సినీ పరిశ్రమ మరో మధుబాలను ఎన్నటికి చూడలేదని,వారు ఇప్పటికీ అదే మాటపై నిలబడ్డారు. కానీ ఎక్కడి మొఘల్ ఈ ఆజమ్,ఎక్కడి విరాటపర్వం.దేనిని దేనితో ముడిపెడుతున్నారు అనుకోవచ్చు.

కాని మొఘల్ ఈ ఆజమ్ లో మధుబాల పాత్రను మనం ఎంత గొప్పగా చెప్పుకొస్తామో,ఈ నాడు విరాటపర్వంలో వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటనను అంతేస్థాయిలో చెప్పుకోవాలి.నక్సలైట్ రవన్న ప్రేమను పొందడానికి తాను పడే తాపత్రయం, అందుకోసం పోలీసులకు ఎదురెళ్లడం, ఇంట్లో వారికి దూరం కావడం,ప్రాణాలను సైతం లెక్క చేయకపోవడం,కేవలం ప్రేమించిన వ్యక్తి నీడలో బ్రతకాలి అనుకో వడం,ఆ విషయాన్ని అతనికే అర్ధం అయ్యేలా చెప్పలేక పోవడం, మొత్తంగా నాటి సరళ జీవితంలోని సంఘర్షణను ఈనాడు విరాటపర్వం రూపంలో కళ్లకు కట్టింది పల్లవి. ఇకపై విరాటపర్వం లాంటి సినిమాలు చేయను అంటూ,ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు రానా.
“Virataparvam” Movie Review

virataparvam

“Virataparvam” Movie Review

కాని విరాటపర్వం చూసిన తర్వాత రానా నువ్వు ఇలాంటి పాత్రలే చేయి, అభిమానుల కోసం నీ పంథాను మార్చుకోకు అని చెప్పాలని ఉంది. నక్సలైట్ రవన్న పాత్రను రానా అర్ధం చేసుకున్న తీరు, కనిపించిన విధానం అతనిలో మరింత పరిణితి చెందిన నటుడ్నీ ఆవిష్కరింప జేసాయి. నక్సల్ భావజాలంతో ఓ బలమైన సిద్ధాంతంతో పోరాటం చేసే దళనాయకుడి గా రానా నటన అద్భుతం.ముఖ్యంగా తన తల్లిపై రాసిన కవిత నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో,రానా పలికించిన హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఉద్యమమే ఊపిరిగా పని చేస్తున్న ఓ దళనాయకుడి జీవితంలోకి,వెన్నెల అనే అమ్మయి ప్రవేశిస్తుంది. ఈ తరుణంలో అటు ఉద్యమ సిద్ధాంతాలను,ఇటు వ్యక్తిగత ప్రేమకు మధ్య ఆ దళనాయకుడు ఎటువైపు మొగ్గు చూపాడు అనే కథను,చాలా హృద్యంగా, స్ఫూర్తిమంతగా తెరకెక్కించాడు దర్శకుడు వేణు ఊడుగుల.విప్లపకారుల హృదయాల్లో చెలరేగే భావ సంఘర్షణను తెరపై అదే స్థాయిలో ఆవిష్కరించడం చిన్న విషయం కాదు. విరాటపర్వం కథకు తన సంగీతంతో,మరో స్థాయికీ తీసుకెళ్లాడు సురేష్ బొబ్బిలి.తన సినిమాను ఎంతగానో ప్రేమిస్తే తప్పితే,ఇలాంటి నేపథ్య సంగీతం రాదు.కొన్ని సన్నివేశాల్లో బొబ్బిలి సింహంలా మారి , తనదైన నేపథ్య సంగీతంతో గర్జించాడు సురేష్.రానా, సాయిపల్లవి తొలిసారి పోలీస్ ఎనౌకౌంటర్ కు ఎదురు పడిన సందర్భంలో సురేష్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. 
“Virataparvam” Movie Review

నటీనటులు – #రానాదగ్గుబాటి, #సాయిపల్లవి, ప్రియమణి, నివేత పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర రచయిత & దర్శకుడు: వేణు ఊడుగుల నిర్మాత: సుధాకర్ చెరుకూరి బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, SLV సినిమాస్ సమర్పణలో సురేష్ బాబు DOP: డాని సలో, శ్రీ ప్రసాద్ మణి ఎడిటర్: డాని సలో, శ్రీ ప్రసాద్ మణి ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర సంగీతం: సురేష్ బొబ్బిలి స్టంట్స్: పీటర్ హెయిన్, స్టీఫన్ రిక్టర్ కొరియోగ్రఫీ: రాజు సుందరం & ప్రేమ్ రక్షిత్ ట్రైలర్ కట్: రవి.