365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 20, 2021 :ఆరవ సీఐఐ ఇండస్ట్రీయల్ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ అవార్డును యుపీఎల్ లిమిటెడ్ గెలుచుకుంది. తమ వ్యాపార,ఆర్ధిక వృద్ధికి తోడ్పడుతూనే ఐపీ సృష్టి,భద్రతను స్వీకరించిన సంస్ధలను గుర్తించి, వేడుక చేసేందుకు ఈ అవార్డులను అందిస్తున్నారు. యుపీఎల్ లిమిటెడ్ ఎల్లప్పుడూ రైతుల అవసరాలకు తొలి ప్రాధాన్యత నివ్వడంతో పాటుగా వారి అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులు,సేవలను అందిస్తుంది.బెస్ట్ పేటెంట్ పోర్ట్‌ఫోలియో, లార్జ్ (లైఫ్‌సైన్సెస్/ఫార్మా) విభాగంలో యుపీఎల్ ఈ అవార్డును గెలుచుకుంది. విప్లవాత్మక ఇంటలెక్చువల్ ప్రోపర్టీ (ఐపీ) పరిశోధన ,ఆవిష్కరణ కోసం అవార్డును అందించారు.యుపీఎల్ ప్రధానమైన పరిశోధన,ఆవిష్కరణలో సస్టెయినబల్ ఉత్పత్తులు అయినటువంటి జెబా,సేవలు అయినటువంటి ఆదర్శ్ ఫార్మ్ సర్వీసెస్ వంటివి ఉన్నాయి. ఇవి ప్రాధమిక స్ధాయి నుంచి విజయవంతమయ్యాయని నిరూపించబడింది.ఈ అవార్డును ఐపీఆర్ అండ్ సీఐఐ ఇండస్ట్రీయల్ ఐపీ అవార్డులపై జరిగిన వర్ట్యువల్ సీఐఐ ఇంటర్నేషనల్ సదస్సులో యుపీఎల్ తరపున డాక్టర్ విశాల్ సోధ ఈ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘యుపీఎల్ వద్ద తమ లక్ష్యమెప్పుడూ కూడా స్ధిరమైన అభివృద్ధిపైనే ఉంటుంది. సహజవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ,వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉత్పత్తులను నిర్మించడంపై అది ఉంటుంది.రైతులకు అందుబాటులో ఉండే రీతిలో మా ఉత్పత్తులు,సేవలను తీసుకురావడంలో మా సామర్థ్యంకు నిదర్శనంగా ఇవి నిలుస్తాయి; ఇవి నూతన తరపు వ్యవసాయం– ఫార్మింగ్ 3.0 కు అంతర్జాతీయంగా తోడ్పాటునందిస్తాయి.

యుపీఎల్ వద్ద, మేము రైతుల అవసరాలకు తొలి ప్రాధాన్యతనందిస్తుంటాము. వారి అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులు,సేవలను సృష్టిస్తుంటాము. ఆవిష్కరణపై మా అవిశ్రాంత దృష్టి కారణంగానే ప్రతి సంవత్సరం మేము నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాము. యుపీఎల్‌కు 1500 కు పైగా పేటెంట్లు ఉండటంతో పాటుగా 2500కు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి విభిన్న ప్రాంతాలలో రైతుల అవసరాలను తీర్చనున్నాయి’’ అని అన్నారు.సీఐఐ–ఐపీ అవార్డుల ప్రధాన లక్ష్యం, ఇంటలెక్చువల్ ప్రోపర్టీ సంస్కృతిని సంస్థలు స్వీకరించేలా ప్రోత్సహించడం , ఆ ఐపీలను వాణిజ్యీకరించడం,ప్రైవేట్ సంస్ధలు సాధించిన విజయాలను పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురావడం, భారతదేశం, అంతర్జాతీయంగా విద్య,పరిశోధనా సంస్థలతో అనుసంధానించడం;ఐపీ చేత నడుపబడే వ్యాపార సంస్థలను గురించి ప్రభుత్వానికి తెలుపడం,విధాన నిర్ణయాల వేళ ఆ తరహా వ్యాపార సంస్థలతో అనుసంధానించడం. నవంబర్ 2020లో,యుపీఎల్ సంస్థ వార్షిక దక్షిణ ,ఆగ్నేయాసియా ఇన్నోవేషన్ అవార్డులను క్లారివేట్ పీఎల్‌సీ వద్ద జరిగిన ఇన్నోవేషన్ ఫోరమ్‌లో అందుకుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రశంసలను సైతం ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ రంగంలో అందుకుంది. ఈ కార్యక్రమాన్ని సోషల్ టాక్స్ నిర్వహించగా, నీతి ఆయోగ్ దర్పన్ గుర్తించింది. పేటెంట్ రంగంలో అందించిన అసాధారణ తోడ్పాటుకుగానూ దీనిని గుర్తించారు. ఈ కంపెనీ సీఐఐ ఇండస్ట్రీయల్ ఐపీ అవార్డును సైతం పేటెంట్, ట్రేడ్‌మార్క్ లార్జ్ ఎంటర్‌ప్రైజ్ విభాగలలో 2019లో అవార్డులను గెలుచుకుంది, గ్లోబల్ బ్రాండ్ సృష్టించినందుకుగానూ అగ్రశ్రేణిభారతీయ కంపెనీగా 2019లో భారతీయ పేటెంట్ ఆఫీస్ చేత గుర్తించబడింది. జెనీవాలోని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ ఆర్గనైజేషన్ ఏత ప్రతిష్టాత్మకమైన విపో యూజర్స్ ట్రోఫీని సైతం యుపీఎల్ గెలుచుకుంది. ఈ గుర్తింపులన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులు,సేవలను సృష్టించడం ద్వారా అంతర్జాతీయంగా రైతులకు మద్దతునందించాలనే యుపీఎల్ లక్ష్యంకు ప్రతీకగా నిలుస్తాయి.

యుపీఎల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, అడ్రియన్ పెర్సీ మాట్లాడుతూ ‘‘మేము స్థిరంగా మా ఫార్ములేషన్స్ ప్రక్రియలను పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాము. ఉదాహరణకు, జెబా. కణిక మట్టిపిండి ఆధారిత సాంకేతికత పరిజ్ఞానాన్ని ఇది వర్తింపజేస్తుంది. ఇది స్పాంజ్ తరహాలో పనిచేస్తుంది. రూటింగ్ జోన్‌లో పంపిణీ చేయడం వల్ల ప్రతి మైక్రో గ్రాన్యూల్ వాస్తవంగా పీల్చుకోతగిన దాని కన్నా అధికంగా నీటిని పీల్చుకుంటుంది, అవసరమైనప్పుడు ఇది మొక్కలకు విడుదల చేస్తుంది. ఈ తరహా నీటి నిర్వహణ , అత్యవసర నీటిలో కరిగేటటువంటి పోషకాలు వంటివి పర్యావరణంలోకి పోషకాలు నష్టపోవడం తగ్గిస్తుంది. తద్వారా పర్యావరణం, మానవ ఆరోగ్యంపై ఋణాత్మక ప్రభావాన్ని తగ్గిస్తుంది’’అని అన్నారు.