Thu. Mar 28th, 2024
facts about srikalahasti temple,

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 25,2022: గ్రహణం సమయంలో సంభవించే అన్ని దుష్ప్రభావాల నుంచి దేవతలను రక్షించడానికి. ఆలయాలలోని సానుకూల శక్తిని తటస్థీకరించకుండా ప్రతికూల శక్తి నిరోధించడానికి ప్రధాన దేవత ఉన్న ఆలయాల గర్భగుడి మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తరువాత, ఆలయాన్ని కడిగి, శుభ్రం చేసి, భక్తులసేవ కోసం తెరుస్తారు.

facts about srikalahasti temple,

ఆలయాన్ని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంచే ముందు కొన్ని ఆచారాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో అన్ని ఆలయాలు మూసివేసినా ఒక్క దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అదే కాళహస్తీశ్వర ఆలయం . ఈ టెంపుల్ ఎందుకు తెరిచి ఉంటుందో తెలుసా..?

ఈ ఆలయం ప్రధానంగా రాహు-కేతువులకు సంబంధించిన పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ శ్రీకాళహస్తి ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదు. దక్షిణ భారతదేశంలోని కైలాసంగా శ్రీకాళహస్తి ని భావిస్తారు. గ్రహణం రోజున రాహు -కేతువులకు పూజలు కొనసాగించే ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధి.