Fri. Mar 29th, 2024
nirmala-sitaraman

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్19,2022:చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కేంద్ర ఆర్థిక మంత్రి దర్శించుకున్నారు. స్వయంభు శ్రీవర సిద్ధి వినాయక స్వా మి వారి దర్శనార్థం కాణిపాకం విచ్చేసినకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం ద్రనాధ్ లను ఘనంగా స్వాగతించారు.

బుధవారం సాయం త్రం స్వామి వారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్నకేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఎస్.పి రిషాంత్ రెడ్డి, పూతలపట్టు శాసన సభ్యులు ఎం.ఎస్. బాబు, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్,కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈ ఓ రాణా ప్రతాప్, చిత్తూ రు ఆర్ డి ఓ రేణు కా తదితరులు స్వాగతం పలికారు.

మంగళ వాయిద్యాల నడుమ ఆలయఅధి కారులు పూర్ణ కుంభతో వారిని స్వాగతించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కేంద్రమంత్రి, వేద పండితు ల ఆశీర్వాదంతోపాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

nirmala-sitaraman

చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప,పూతల పట్టు ఎల్ఏ ఆలయ చైర్మన్, ఈఓ స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి చిత్ర పటాన్నికేంద్రమం త్రికి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రుల వెంట తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, తిరుపతి జెసి బాలా జీ, సంబంధిత అధి కారులు, బిజెపి నాయకులు భాను ప్రకాశ్ రెడ్డి,చామంతి శ్రీనివాస్,చిట్టి బాబు దుర్గా రామకృష్ణ, వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు