Fri. Mar 29th, 2024
TVS-Metro-Plus-110_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, జనవరి 9,2023: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ నూతన బైక్‌ను విపణిలోకి విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్స్ తో 110 సీసీ సెగ్మెంట్లో టీవీఎస్ కంపెనీ మెట్రో ప్లస్ పేరుతో ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది.

ఈ బైక్‌ను ఎక్కడ లాంచ్ చేసారు..? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి..? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా టూ వీలర్, త్రీ వీలర్ లను విక్రయించే భారతీయ కంపెనీ టీవీఎస్ మోటార్ సోమవారం బంగ్లాదేశ్‌లో “టీవీఎస్ మెట్రో ప్లస్110″ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సెగ్మెంట్లోని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బైకులో పలు ప్రత్యేక ఫీచర్లు అందించారు.

కొత్త “టీవీఎస్ మెట్రో ప్లస్ 110” లుక్‌ కోసం చాలా మార్పులు చేశారు. ఇది ప్రీమియం 3D లోగో, కొత్త డ్యూయల్ టోన్ కలర్స్‌తో పాటు స్టైలిష్ డ్యూయల్-టోన్ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, రెడ్ కలర్ లో స్టైలిష్ షాక్ అబ్జార్బర్‌లు, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్, ఎల్ ఈడీ హెడ్‌ల్యాంప్‌లు,యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.

TVS మెట్రో ప్లస్ బంగ్లాదేశ్‌లో మొదటిసారి ప్రారంభించినప్పటి నుంచి 1.2 లక్షల యూనిట్లకు పైగా విక్రయించారు. బైక్110సీసీ ఇంజిన్‌తో, ఇది ఒక లీటర్‌లో సగటున 86 కిలోమీటర్లమైలేజ్ ఇస్తుంది.

TVS-Metro-Plus-110_365

TVS మోటార్ కంపెనీ అన్ని TVS ఉత్పత్తులపై రెండు సంవత్సరాల వారంటీ ,ఆరు ఉచిత సేవలను అందిస్తుంది. కొత్త TVS మెట్రో ప్లస్ 110 బంగ్లాదేశ్‌లోని అన్ని TVS ఆటో షోరూమ్‌లలో అందుబాటులో ఉంది.

టీవీఎస్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ నాయక్ మాట్లాడుతూ, “మా కీలక అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటైన బంగ్లాదేశ్‌లో కొత్త టీవీఎస్ మెట్రో ప్లస్‌ను విడుదల చేయడానికి మేము సంతోషిస్తున్నాము.

ఈ బైక్ మన్నిక ,సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో పెరుగుతున్న మొబిలిటీ అవసరాలను తీరుస్తుంది. మా కస్టమర్‌లకు నాణ్యమైన అనుభవాన్ని అందించడానికి సరికొత్త ఫీచర్‌లను సమకూర్చమని చెప్పారు.

బంగ్లాదేశ్‌లో ఈ మోటార్‌సైకిల్, మా విస్తారమైన సేవా నెట్‌వర్క్‌ను ప్రారంభించడంతో, మేము కస్టమర్ సంతృప్తిలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తామని మేము విశ్వసిస్తున్నామని ఆయన వెల్లడించారు.