Sat. Apr 20th, 2024
ttd-trust

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమ‌ల‌, జూన్ 7,2022 : TTD టీటీడీ చ‌రిత్ర‌లో రికార్డు స్థాయిలో ఒకే రోజు వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి టీటీడీలోని ట్రస్ట్‌లకు రూ.10 కోట్లు విరాళంగా అందాయి. తమిళనాడు లోని తిరునెల్వేలికి చెందిన గోపాల్ బాల కృష్ణన్ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, బ‌ర్డ్ ట్ర‌స్ట్‌, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్, ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్ట్ ,శ్రీ వేంకటేశ్వర భక్తి ఛాన‌ల్‌కు ఒక్కొక్క‌దానికి కోటి చొప్పున ఏడు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. TTD received Rs.10Cr as a donation to various trusts from different individuals

ttd-trust

అదేవిధంగా తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన ఎ-స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్‌స్పెక్ష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు కోటి రూపాయలు, బాలకృష్ణ ఇంధన కేంద్రం సంస్థవారు శ్రీవేంక టేశ్వర ఆలయ నిర్మాణం TTD ట్రస్ట్‌కు రూ.కోటి, సీ-హబ్ ఇన్‌స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డికి దాతలు సంబంధిత డీడీలను అంద జేశారు. ఈ కార్య‌ క్ర‌మంలో డిప్యూటీ ఈవో (డోనర్ సెల్) పద్మావతి తదితరులు పాల్గొన్నారు.