Fri. Mar 29th, 2024
transport-vehicles

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు,నవంబర్ 4,2022: కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ – ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరి చేశారు. ‘ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించేందుకు’ కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ చర్య హైవేలపై భద్రతకు గణనీయంగా దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే జీపీఎస్ పరికరాలు అతివేగంగా వాహనాలు నడిపే అధికారులను అప్రమత్తం చేస్తాయి. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు పరిధిలోకి 6.8 లక్షల వాహనాలు వస్తాయని తెలిపారు.

transport-vehicles

“60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది, మిగిలిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది” అని మధుస్వామి వివరించారు. మహిళలపై నేరాలను అరికట్టడం కోసం చేపట్టిన లక్ష్యాలలో ఈ ప్రాజెక్టు ఒకటి . ప్రాజెక్టు అమలయ్యాక వాహనాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. దీనివల్ల పన్ను ఎగవేతదారులను, రవాణా అనుమతుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు.