Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, డిసెంబర్ 10, 2021: అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మార్కెట్లను, ఎకో సిస్టమ్ ను సృష్టించడం పై ముం దుచూపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ (63 మూన్స్), దాని అనుబంధ సంస్థ టికర్ ప్లాంట్ నేడిక్కడ క్రిప్టో వైర్ – గ్లోబల్ క్రిప్టో సూపర్ యాప్ ను ప్రకటించాయి.

క్రిప్టో ప్రపంచంలో ఉన్న వారికి ఓ సూపర్ యాప్ ద్వారా సాధికారికత కల్పించాలని క్రిప్టో వైర్ కోరుకుంటోంది. అది క్రిప్టో అసెట్స్, బ్లాక్ చైన్ లకు సంబంధించిన రియల్ టైమ్ మార్కెట్ ధరలను, ఇన్ సైట్, న్యూస్, నాలెడ్జ్, రీసెర్చ్, ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్, డేటా ప్లాట్ ఫామ్ ను క్రిప్టో యూనివర్సిటీ, క్రిప్టో టీవీ, క్రిప్టో వైర్ ల ద్వారా అం దిస్తుంది.  

ఈ కంపెనీ పటిష్ఠమైన పాలనా సూత్రాలు కలిగిన నూతన బోర్డ్ చే మార్గదర్శకత్వం పొందుతోంది. దాని సభ్యులు:

బోర్డు సభ్యలుహోదా
 జస్టిస్ దీపక్ వర్మమాజీ న్యాయమూర్తి, సుప్రీం కోర్టుబోర్డ్ చైర్మన్ 
  ప్రొఫెసర్ వైద్యనాథన్రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్, ఐఐఎం బెంగళూరుసభ్యడు – నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు నాన్ –ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
 శ్రీ ముకేశ్ జోషిమాజీ చైర్మన్ – సీబీడీటీమాజీ స్పెషల్ డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాన్ –ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
కెప్టెన్ ఎ.నాగార్జున్,రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ప్రధాన కార్యదర్శి – తమిళనాడు నాన్ –ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
  డాక్టర్ ఆర్ బి బర్మన్,మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – ఆర్బీఐ నాన్ –ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఎం.ఎల్ శర్మ,మాజీ స్పెషల్ డైరెక్టర్ – సీబీఐమాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నాన్ –ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఘన్ శ్యామ్ దాస్,మాజీ కంట్రీ (ఇండియా) హెడ్ – నాస్ డాక్మాజీ ఎండీ – నాస్ డాక్ (ఏషియా పసిఫిక్) నాన్ –ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
న్యాయవాది పిఆర్ రమేశ్,B.Com, ICSI, ICWA, LLBమాజీ జీఎం  & ఈఏ టు సెబీ చైర్మన్, మాజీ చీఫ్ ఆఫ్ కాంప్లియెన్స్ అండ్ లీగల్ – ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్నాన్ –ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
శ్రీ జిగిష్ సొనాగారా,వ్యవస్థాపకులు – బిల్ మార్ట్, ఏఐడీఐఏమాజీ డైరెక్టర్ & హెడ్, ఎక్స్ చేంజ్ టెక్నాలజీ – 63 మూన్స్  ఎండీ & సీఈఓ
శ్రీ రిషభ్ షా,మాజీ హెడ్, న్యూ వెంచర్స్ – 63 మూన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ &  సిఒఒ
శ్రీ నిమిష్ శుక్లా,ప్రెసిడెంట్ – కమ్యూనికేషన్స్ అండ్ కార్పొరెట్ అఫైర్స్, 63 మూన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సిసిఒ

 సాంకేతిక కేంద్రిత, పారదర్శక, ప్రభావపూరిత పరిష్కారాలను కలిగిఉన్న కంపెనీ,  క్రిప్టో వైర్ అనేది క్రిప్టో ఎక్స్ చేంజ్ లేదా క్రిప్టో కరెన్సీ కాదని నొక్కిచెబుతోంది. సమగ్రత, నిష్పాక్షిక సమాచారం, అంతకు మించిన వాటితో ఇది ఇందులో పాల్గొనే వారికి సాధికారికత అందిస్తుంది.  క్రిప్టో వైర్ యూజర్లు వీటిని యాక్సెస్ చేయవచ్చు:

.ప్రపంచపు మొదటి క్రిప్టో యూనివర్సిటీ – అందరి అవసరాలు తీర్చే డిజిటల్ యూనివర్సిటీ : ఏబీసీ నుంచి పీహెచ్ డి దాకా, సూపర్  స్పెషలైజ్డ్ కోర్సులు

.ప్రపంచపు మొదటి క్రిప్టో టీవీ – ప్రత్యేకంగా 24*7  క్రిప్టో,బ్లాక్ చెయిన్ యూట్యూబ్ చానల్,మొబైల్ ఐపీ టీవీ. అంతర్జాతీయ పరిణామాలఇది లోతైన విశ్లేషణలు, అవగాహనను అందిస్తుంది. ట్రెండ్ రిపోర్ట్స్, చర్చలు, అంతర్జాతీయ నిపుణుల మార్గదర్శకత్వం అందిస్తుంది.

.ప్రపంచపు మొదటి క్రిప్టో వైర్ – ఆర్బిట్రేజ్ అపర్చునిటీస్ ఐడెంటిఫికేషన్, వాచ్ లిస్ట్ క్రియేషన్, లెండింగ్ &  బారోయింగ్ రేట్స్ టి టూల్స్ తో వైర్ సర్వీస్

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇది క్రిప్టో, బ్లాక్ చెయిన్, అసెట్ డిజిటైజేషన్, డెవలప్ మెంట్ లలో పూర్తిగా గ్లోబల్ మార్కెట్ అంశాలను అందిస్తుంది.

ఈ సందర్భంగా టికర్ ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ జిగిష్ సొనాగరా మాట్లాడుతూ, ‘‘గౌరవనీయ ప్రధాన మంత్రి ఆశయాన్ని అనుసరిస్తూ,  నాలెడ్జ్, రీసెర్చ్, ట్రైనింగ్, అవేర్ నెస్, ఇన్ఫర్మేషన్, డేటా ఆధారంగా మేం అత్యంత విశ్వసనీయ క్రిప్టో, బ్లాక్ చెయిన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. క్రిప్టో ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు క్రిప్టో వైర్ అనేది అత్యంత విశ్వసనీయ పోర్ట్ గా ఉంటుంది. ఇది బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా విశ్వసనీయతను అందిస్తుంది. పటిష్ఠ సాంకేతికత శక్తితో స్థిరత్వాన్ని అందిస్తుంది. చక్కగా క్యూరేట్ చేయబడిన డేటాను అందిస్తుంది’’ అని అన్నారు.

‘‘క్రిప్టో వైర్ లో మేం ఒక విస్తృత సమాజం కోసం నాలెడ్జ్ ను విస్తరిస్తూ, ఈ రంగంతో ప్రమేయం కలవారందరితో దాన్ని పంచుకుంటాం’’ అని అన్నారు.