Thu. Apr 25th, 2024
jobs-governent

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి4, 2023: సౌత్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022.. యువతకు కొత్త సంవత్సర కానుకగా ఇస్తూ భారతీయ రైల్వే బంపర్ రిక్రూట్‌మెంట్‌ను చేపట్టింది.

10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ రైల్వేశాఖ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈ పనిని చేపట్టింది.

సౌత్ ఈస్టర్న్ రైల్వే వర్క్‌షాప్, ఇతర సంస్థల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrcser.co.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి ,అర్హత గల అభ్యర్థులు జనవరి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

jobs-governent

సౌత్ ఈస్టర్న్ రైల్వే జారీ చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, ఫిబ్రవరి 2, 2023 వరకు దరఖాస్తులు తీసుకుంటారు.

సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ ట్రేడ్‌లలో 1785 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సెంట్రల్ సిల్క్ బోర్డ్ రిక్రూట్‌మెంట్.. భారత ప్రభుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ (CSB), వివిధ గ్రూప్ A, గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత ,ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి సెంట్రల్ సిల్క్ బోర్డ్ csb.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి16.

jobs-governent

కొత్త సంవత్సరం 2023లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువత కోసం జనవరిలో వెలువడిన రిక్రూట్‌మెంట్ ఇన్ఫర్మేష్ న్ ను సేకరించింది 365తెలుగు డాట్ కామ్.

ఈ సమాచారం ద్వారా యువత దరఖాస్తు చేసుకొని మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అవేంటో తెలుసుకుందాం..

రాజస్థాన్ అసిస్టెంట్ రేడియోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2022: అసిస్టెంట్ రేడియోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2022 వివరణాత్మక అధికారిక నోటిఫికేషన్ రాజస్థాన్‌లో విడుదల చేశారు.

1015 పోస్టుల భర్తీకి రాజస్థాన్ రేడియోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ నిర్వహించను న్నారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును పూరించవచ్చు.

రాజస్థాన్ రేడియోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2022

కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 29.

jobs-governent

అభ్యర్థులు రాజస్థాన్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్, రాజస్థాన్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ rajswasthya.nic.inలో ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

OCS పరీక్ష 2022..

ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) ఒడిషా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 17, 2023 నుండి కమిషన్ అధికారిక వెబ్‌సైట్ opsc.gov.inలో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఢిల్లీ యూనివర్సిటీలోని శ్యామ్‌లాల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 106, కిరోరి మాల్ కాలేజీలో నాన్ టీచింగ్ పోస్టులు 68, కాళింది కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 142, సత్యవతి కాలేజీలో 72, జీసస్ అండ్ మేరీ కాలేజీలో 74 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు కళాశాలల అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

NIELIT NTRO రిక్రూట్‌మెంట్ 2023..

jobs-governent

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

దీని కోసం, దరఖాస్తు ప్రక్రియ 2022లో డిసెంబర్ 31నుంచి ప్రారంభమైంది. ఏవియేటర్ -II ,టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఈ నియామకాలు జరుగుతాయి.

దరఖాస్తుకు చివరి తేదీ 21 జనవరి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీ చేయనున్నారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిక్రూట్‌మెంట్ 2023… బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మొత్తం 567 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

ఆసక్తి అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో రేడియో మెకానిక్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఎంఎస్‌డబ్ల్యూ వంటి వివిధ రకాల ఖాళీలు ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు.