Thu. Apr 25th, 2024
AVATAR_MOVIE

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, డిసెంబర్ 27, 2022: అవతార్ మూవీ థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ దిశగా దూసుకు పోతోంది.

ఇండియాలో ఈ సినిమా టోటల్ కలెక్షన్ కేవలం 10 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల రూపాయలకు చేరుకుంది. అవతార్.. రాబోయే రోజుల్లో దేశంలో రూ.500 కోట్లపై గా వసూలుచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

దర్శకుడు జేమ్స్ కెమరూన్ చెప్పిన 2 బిలియన్ డాలర్ల మార్కును ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా 2 బిలియన్ డాలర్లకు చేరుకుంటే లాభాలు వస్తాయని ఆయన గతంలో వెల్లడించారు.

AVATAR_MOVIE

SOURCE FROM Twitter

అవతార్ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

ట్రేడ్ రిపోర్టుల ప్రకారం చూస్తే.. అవతార్ డిసెంబర్ 24 తేదీనాటికి భారతదేశంలో రూ. 21 కోట్లు వసూలు చేయగలిగింది. అవతార్ డిసెంబర్ 25 ఆదివారం నాడు రూ. 24-26 కోట్లు రాబట్టింది. మొత్తం కలెక్షన్ ఇప్పుడు దేశంలో రూ. 300 కోట్లుగా ఉంది.

అవతార్ మూవీ ఇప్పటివరకు $850 మిలియన్ల వసూళ్లను దాటింది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా అవతార్ మూవీ కలెక్షన్స్ పై ఇలా ట్వీట్ చేశారు.

SOURCE FROM Twitter

“#AvatarTheWayOfWater అంతర్జాతీయంగా $600 మిలియన్లు అండ్ ఉత్తర అమెరికా బాక్స్ ఆఫీసు వద్ద $250 మిలియన్లు, మొత్తం $850 మిలియన్లు.. (sic).” ఇది దాదాపు రూ.7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

దాదాపు 13 సంవత్సరాల తర్వాత, దాని సీక్వెల్ అవతార్ -2 భారత దేశంలోని ఐదు భాషల్లో విడుదలైంది. అవతార్‌లో సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్, జోయ్ సల్దానా, కేట్ విన్స్‌లెట్ ప్రధాన పాత్రలు పోషించారు.