Thu. Mar 28th, 2024
Supreme-_Court_365telugu

365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ,జనవరి18,2023: వికీపీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్వసించలేమని భారత అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

న్యాయవాదులు మరింత విశ్వసనీయమైన, ప్రామాణికమైన వనరులపై ఆధారపడేలా న్యాయస్థానాలు ,న్యాయ అధికారులను ఒప్పించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

వికీపీడియా వంటి ఆన్‌లైన్ మూలాలు నమ్మదగినవి కాదని సుప్రీంకోర్టు బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. వికీపీడియా క్రౌడ్‌సోర్స్డ్ , యూజర్ జనరేట్ ఎడిటింగ్ మోడల్‌పై ఆధారపడి ఉందని, అలాంటప్పుడు తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవచ్చని కోర్టు పేర్కొంది.

Supreme-_Court_365telugu

న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం, ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని ఉచితంగా అందించే అటువంటి మూలాల ఉపయోగాన్ని విస్మరించలేము, అయితే అటువంటి ప్లాట్‌ఫారమ్‌లను చట్టపరమైన వివాదాల పరిష్కారానికి ఉపయోగించలేమని కోర్టు పేర్కొంది.

న్యాయవాదులు మరింత ప్రామాణికమైన మూలాలను ఉపయోగిస్తారు. న్యాయ వాదులు మరింత విశ్వసనీయమైన, ప్రామాణికమైన వనరులపై ఆధారపడేలా న్యాయస్థానాలు,న్యాయ అధికారులను ఒప్పించాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.

సాధారణ వ్యక్తి ఎవరైనా వికీపీడియాలో సమాచారాన్ని ఉంచవచ్చని, ఆ సమాచారాన్ని ఎవరైనా సవరించవచ్చని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితిలో, వికీపీడియాలోని కంటెంట్‌ను విశ్వసించలేమన్నారు.

సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ కింద డౌన్లోడ్ చేసుకున్న ‘ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ డెస్క్‌టాప్ కంప్యూటర్స్’ సరైన వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు పరిశీలన వచ్చింది.

కంపెనీ కొన్ని ఇతర టారిఫ్‌ల నుంచి కంప్యూటర్‌ను అంచనా వేసింది. కస్టమ్స్ విచారణలో సుంకం భిన్నంగా ఉన్నట్లు కనుగొన్నారు.

ఆ తర్వాత, కస్టమ్స్ కమిషనర్ (అప్పీల్స్) తన పరిశోధనలకు మద్దతుగా వికీపీడియా వంటి ఆన్‌లైన్ మూలాలను గురించి ప్రస్తావించారు.