Wed. May 31st, 2023
The number of people recovering from Kovid is the highest in the world at over 99 lakhs
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్,
జనవరి2,2021:దేశంలో రోజువారీ కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 2.5 లక్షలకు తగ్గి ప్రస్తుతం 2,50,183  కు చేరింది. మొత్తం కేసుల్లో ఇంకా చికిత్సపొందుతూ ఉన్నవారి శాతం 2.5 కు దిగువన 2.43% గా నమోదైంది.  దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 19,079 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు రాగా, 22,926 మంది కోలుకున్నారు. దీనివల్ల నికరంగా  4,071 మంది చికిత్సలో ఉన్నవారు తగ్గారు.

WhatsApp Image 2021-01-02 at 9.34.12 AM.jpeg

మొత్తం చికిత్సలో ఉన్నవారిలో 62% మంది కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్ అనే ఐదు రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. 

WhatsApp Image 2021-01-02 at 9.46.08 AM.jpeg

ప్రతి పది లక్షల జనాభాలో కొత్త కేసుల సంఖ్య దృష్ట్యా ప్రపంచంలో అతి తక్కువగా భారత్ లోనే ఉంది. గత వారం రోజులుగా ది 101 మాత్రమే నమోదైంది. బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ లలో ఇంతకంటే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి.

The number of people recovering from Kovid is the highest in the world at over 99 lakhs
The number of people recovering from Kovid is the highest in the world at over 99 lakhs
WhatsApp Image 2021-01-02 at 9.53.28 AM.jpeg

భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య కోటికి దగ్గరవుతూ ఉంది. ఈ రోజుకు అది 99,06,387 దగ్గరకు చేరింది. శాతం పరంగా చూస్తే నేటి వరకు 96.12% మంది కోలుకున్నారు.  కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా ప్రస్తుతం 96,56,204 కు చేరింది. కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 78.64%  మంది కేవలం 10 రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యారు. కేరళలో నిన్న అత్యధికంగా 5,111 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, ఆతరువాత స్థానాల్లో మహారాష్ట్ర  (4,279),  పశ్చిమ బెంగాల్ (1,496)  ఉన్నాయి.

WhatsApp Image 2021-01-02 at 9.32.38 AM.jpeg

గత 24 గంటలలో కొత్తగా నిర్థారణ జరిగిన కేసులలో 80.56% కేవలం పది రాష్ట్రాల్లో నమోదు కాగా, కేరళలో అత్యధికంగా 4992 కేసులు రాగా మహారాష్ట్రలో 3,524 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 1,153 కేసులు నమోదయ్యాయి.

The number of people recovering from Kovid is the highest in the world at over 99 lakhs
The number of people recovering from Kovid is the highest in the world at over 99 lakhs
WhatsApp Image 2021-01-02 at 9.29.08 AM.jpeg

గత 24 గంటలలో 224 మంది కోవిడ్ బాధితులు మరణించగా వారిలో 75.45% మంది 10 రాష్ట్రాలకు చెమ్దినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా  59 మంది, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో 26, కేరళలో 23 మరణాలు నమోదయ్యాయి. 

WhatsApp Image 2021-01-02 at 9.31.23 AM.jpeg