Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్23,2021:హైదరాబాద్ లో మొదటి సారిగా వినూత్నమైన మోడల్ హంట్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మాడల్స్ గా తమ జీవనాన్ని మలచుకోవాలనే యువతీ, యువకులకు అవకాశాన్ని కలిపించేందుకు స్వీకారం చుట్టబడింది. హైదరాబాదులోని ద పార్క్ హోటల్, సొమాజీ గూడలో న్యూ ట్రెండ్ ఫ్యాషన్ వీక్ 2022 పేరుతో నిర్వహించనున్న ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో భాగంగా మోడల్ హంట్ 2022 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మోడలింగ్ కెరీర్ కావాలనుకొనే వారికి అవకాశం కలిపించడమే కాకుండా అందుకు తగినట్లుగా వారికి శిక్షణ అందించి తీర్చిదిద్దేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది.

ఐదు రోజుల పాటూ నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో నిపుణులైన సీనియర్ మాడల్స్ ద్వారా ఎంపిక చేయబడ్డ యువతీ, యువకులకు ఈ గ్లామర్ ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాకుండా వారికి న్యూ ట్రెండ్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై ప్రదర్శించే అవకాశం కూడా కలిపించనుంది. ఇక ఈ మాడల్ హంట్ 2022 లో ఫైనలిస్టులుగా నిలిచే వారికి మిస్టర్ & మిస్ న్యూ ట్రెండ్జ్ గా పురస్కారం పొందుతారు. ఈ గ్రాంఢ్ ఫైనల్ కార్యక్రమం 14 ఫిబ్రవరి 2022 నాడు ది పార్క్ హోటల్ లో నిర్వహించబడుతుంది.

నేడు హోటల్ ది పార్క్, సొమాజి గూడ, హైదరాబాదు లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నిర్వాహకులు, కార్యక్రమ న్యాయ నిర్ణేతలు ఈ మాడల్ హంట్ 2022 కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

ముందుగా తెహసీమ్ సుల్తానా, కార్యక్రమ నిర్వాహకురాలు న్యూ ట్రెండ్జ్ ఎంటర్ ప్రయిజెస్ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ భారత దేశానికి చెందిన అత్యున్నత శ్రేణి డిజైనింగ్ నైపుణ్యాన్ని, డిజైనర్ కలెక్షన్ ను ప్రదర్శించడానికై ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. భారత దేశం నలుమూలల నుండి విచ్చేస్తున్న పలువురు ప్రసిద్ద నూతన యువ డిజైనర్లు తమ తమ దుస్తులను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారని వెల్లడించారు.ఫిబ్రవరి15,16 లలో రెండు రోజుల పాటూ ద పార్క్ హోటల్, సోమాజిగూడ, హైదరాబాదులో నిర్వహించబడే ఈ కార్యక్రమం నూతన, యువ డిజైనర్లకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా రూపొందించబడిందని తెలిపారు.

ద ట్రేడ్ షో కంపెనీ మనోజ్ పట్వర్థన్ పార్టనర్ కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా మాడల్ హంట్ 2022 ను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మాడలింగ్ లో ఆసక్తి ఉన్న యువతీ, యువకులను ఎంపిక చేసి వారికి పరిశ్రమలో నిపుణులైన వారిచే ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకొన్న తర్వాత వారి వారి ప్రతిభను అనుసరించి మొత్తం శిక్షణ పొందిన అభ్యర్థులను రెండు విభాగాలుగా విభజించి మొదటి కేటగిరీ వారిని మోడలింగ్ రంగంలోనూ, రెండవ కేటగిరి వారిని సినిమా, టివీ పరిశ్రమకు పనికి వచ్చేలా శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు. ఇక
మోడలింగ్ లో శిక్షణ పొందిన వారికి న్యూ ట్రెండ్ ఫ్యాషన్ వీక్ 2022 లో ర్యాంప్ వ్యాక్ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ వినూత్నమైన కార్యక్రమంలో పాల్గొనదలచిన యువతీ, యువకులు తమ తమ వివరాలను www.newtrendzentrprises.com వెబ్ సైట్ లో కానీ లేదా tahseen@newtrendzenterprises.com ఈ మెయిల్ కు గాని పంపాల్సి ఉంటుంది. అలానే మరింత సమాచారం కోసం 8103478858 / 7987563700 / 9963790478 ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచే యువకుల కనీస ఎత్తు 6 అడుగులు మరియు యువతిలకు 5.7 అడుగుల ఎత్తు కలిగిన వారే అర్హులు. అంతే గాకుండా తమ ధరఖాస్తుతో పాటూ 1200 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఎంపిక చేయబడ్డ వారికి సమాచారం అందించబడుతుంది.

ఇలా సమాచారం అందుకొన్న వారికి ఐదు రోజుల పాటూ ఇచ్చే శిక్షణా కార్యక్రమ అనంతరం వారిని రెండు విభాగాలుగా విభజించి మొదటి విభాగం వారిని మాడలింగ్ రంగంలో , రెండవ రంగం వారికి టెలివిజన్ , సినిమా రంగంలో అవకాశాలపై శిక్షణ అందిస్తారు. అలానే మాడలింగ్ రంగంలో శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి న్యూ ట్రెండ్జ్ ఫ్యాషన్ వీక్ 2022 లో ర్యాంప్ పై నడిచే అవకాశం లభిస్తుంది. ఇక ఈ మాడల్ హంట్ 2022 లో ఫైనలిస్టులుగా నిలిచే వారికి మిస్టర్ & మిస్ న్యూ ట్రెండ్జ్ గా పురస్కారం పొందుతారు. ఈ గ్రాంఢ్ ఫైనల్ కార్యక్రమం 14 ఫిబ్రవరి 2022 నాడు ది పార్క్ హోటల్ లో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో మాడల్ హంట్ కార్యక్రమంలో శిక్షణ అందించనున్న మమత, కొరియాగ్రాఫర్, నటి కౌషిక్ పెరుగు, సూపర్ మాడల్-షాద్ అహ్మద్, నటుడు, క్రియేటివ్ డైరెక్టర్- దెబరో డోరిస్ ఫెల్, సూపర్ మోడల్ నటి-ఇబా ఖాన్, మాడల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. మోడలింగ్, ఫ్యాషన్ రంగాలలో ఆసక్తి ఉన్న యువతీ, యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాడలింగ్ రంగంలో ముందడుగు వేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.