Fri. Apr 19th, 2024
gaudium

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్13, 2022: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో గౌడియం హైదరాబాద్ స్టేడియం రన్ -2022 నిర్వహించారు. హైదరాబాద్ స్టేడియం రన్ 2వ ఎడిషన్ 10 డిసెంబర్-2022 నుంచి11డిసెంబర్-2022 వరకు 24 గంటల రన్ గా నిర్వహించారు.

ఇందులో గెలుపొందిన రిలే టీమ్ లు, సోలో రన్నర్లను గౌడియం మేనేజ్ మెంట్ అండ్ హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఘనంగా సత్కరించారు. సాక్షి డైరెక్టర్ వై. ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

gaudium

గౌడియం స్పోర్టోపియాలోని అథ్లెటిక్ ట్రాక్లు హైదరాబాద్ స్టేడియం రన్ వేదికగా ఉన్నాయి. ఇది ఈ ఈవెంట్ 2వ ఎడిషన్. గత సంవత్సరం 12 గంటల రన్ గా ఉన్న దీన్ని 24 గంటలు రన్ గా అప్ గ్రేడ్ చేశారు. 2వ ఎడిషన్ కు మొత్తం ప్రైజ్ మనీ రూ.2,64,000 అందించారు.

ఈ ఈవెంట్లో 24 గంటల సోలో అల్ట్రా రన్. 12 గంటల సోలో అల్ట్రా రన్, 12 గంటల టీమ్ రిలే రన్లు ఉన్నాయి. స్టేడియం రన్ డిసెంబర్ 10, శనివారం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమయ్యి, డిసెంబర్ 11, ఆదివారం సాయంత్రం 6 గంటలకు పూర్తయింది.

జంట నగరాలు, వెలుపల ప్రాంతాల నుంచి 500 మందికి పైగా రన్నర్లు రేసులో పాల్గొంటున్నారు. సుమారు 85 జట్లు, ఒక్కో జట్టులో 6 మంది ఉంటూ, ఒక్కొక్క టీం 2 గంటలపాటు రిలే సీక్వెన్స్ రన్లో పాల్గొన్నారు.

gaudium

ఒక జట్టుగా పాల్గొనాలంటే తప్పనిసరిగా పురుషులు స్త్రీలు కలిపి ఉండాలి. రన్నింగ్ ని ఫిట్నెస్ యాక్టివిటీగా, టీం స్పిరిట్, లింగ భేదంలేకుండా ఉండడాన్ని ప్రోత్సహించడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశం

డిసెంబర్ 10వ తేదీ, శనివారం సాయంత్రం 6 గంటలకు గౌడియం చైర్మన్ నిత్యానంద రెడ్డి, వైస్ చైర్మన్, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హైదరాబాద్ రన్నర్స్ ప్రెసిడెంట్ అభిజిత్మద్నూర్కర్ జెండా ఊపి ప్రారంభించారు. కె. కీర్తి రెడ్డి- గొడియం వ్యవస్థాపక డైరెక్టర్ గౌడియం సీఈఓ రామకృష్ణా రెడ్డి కూడా రేసులను ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి హాజరయ్యారు.