Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం,మే3, 2023: తెలంగాణరాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం పిలుపు మేరకు కార్యదర్శులు చేస్తున్న సమ్మె బుధవారానికి ఆరవ రోజుకు చేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఏ సమ్మేకూ ప్రభుత్వం చర్చలూ, సమాధానం లేకుండానే వాటంతట అవే ఆగి పోయేలా చేసిన మొండితనాన్ని కార్మిక సంఘాలు చవి చూశాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న పల్లెలను, తండాలనుసైతం గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించింది. నియామక సమయంలో ఒప్పందం చేసుకున్నట్లు మూడు సంవత్సరాలు కాగా, మరో సంవత్సరం ప్రోహిభిషన్ సమయాన్ని పొడిగించారు. ఆతర్వాత నాలుగేళ్లు పూర్తవ్వగానే పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగంతో దిక్కు తోచని యువత అనేక మంది వారు చదివిన చదుకు సంబంధించిన పోస్ట్ కాదని తెలిసినా, ఏదో ఒక ప్రభుత్వ కొలువు కావాలని, వచ్చిన అవకాశాన్ని వినియోగించు కోవాలనుకుని వారంతా కొలువులో చేరారు.

ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన విధులు పారిశుధ్యం,సెగ్రిగేషన్, నర్సరీల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, మొక్కల నాటడం, సంరక్షించడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆ మేరకు తెలంగాణ గ్రామ పంచాయతీలు దేశం లో ఏ రాష్ట్రానికి దక్కని ప్రతిష్టాత్మక అవార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నది.

కాని కార్యదర్శుల ప్రోహిభిషన్ మూడు సంవత్సరాలు ముగిసిన సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా మరో సంవత్సరం కాగానే పర్మినెంట్ చేస్తానని ప్రకటించారు. గత మార్చి నెలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన సంవత్సర కాలం కూడా పూర్తిఅయ్యింది.

అయినా తమను రెగ్యులర్ చేసే ప్రక్రియ ప్రారంభించక పోవటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. ఐతే గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శు రాష్ట్ర సంఘం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా ఏ జిల్లా సంఘాలు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు విజ్ఞాపన పత్రాలు అందజేసింది.

సానుకూల స్పందన రాకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగారు. సమ్మె ప్రారంభమై 6 రోజులు గడిచినా పాలకుల నుంచి ఏ స్థాయిలోనూ స్పందన రావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్స్ తో పనులు చేయించాల్సిన కార్యదర్శులు సమ్మె బాట పట్టడం తో ఆ బాధ్యతలు చిన్నవి,పెద్దవి సర్పంచ్ పై పడ్డాయి. చాలా మంది సర్పంచ్ లు కూడా ఇప్పటి వరకు కార్యదర్శుల పై ఆధార పడిన వారున్నారు.

గ్రామ పంచాయతీల నిర్వహణ లో ముందున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ విషయం లో కూడా ఇచ్చిన హామీ అమలు జరపాలని ముక్త కంఠంతో కోరుతోంది తెలంగాణ రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం.

చింతకానిలో జరుగుతున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మెకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోట రాంబాబు, కిలారు మనోహర్ సంఘీభావం తెలిపారు.

ఇవి కూడా చూడండి..

అసిస్టెంట్ టీచర్ల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేత..

Facts about Telugu actor Sharat Babu

వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు..

What is Media..

TATA IPL Fan Parks a nation-wide hit as massive crowds gather to catch action on JioCinema