Fri. Apr 19th, 2024
CBN VIARAL PIC

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 17,2022: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన పనికి అందరూ నివ్వెరబోతున్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సినీ నటుడు కృష్ణ పార్దీవ దేహానికి నివాళులర్పించేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు ఫొటోలో ఏముంది.? ఆయనతో పాటు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, నటులు అల్లుఅర్జున్, సుధీర్ బాబు అందరూ ఉన్నారు. అయితే కృష్ణ పార్థీవదేహానికి పక్కనే షూస్ వేసుకుని కూర్చొవడమే ఆయన ఫొటో వైరల్ కావడానికి ప్రధాన కారణం.

CBN VIARAL PIC

‘చనిపోయినవాళ్ళు దేవుళ్ళతో సమానం..అలాంటి మహనీయులకు నివాళులర్పించే టప్పుడు, కాళ్లకు బూట్లు తొలగించాలన్న కనీస జ్ఞానం లేదా.? అంటూ చంద్రబాబుపై సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు. మాట్లాడితే నలభై ఏళ్ల అనుభవం అంటావ్ ఇదేనా నీ అనుభవం అంటూ విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్స్.