Thu. Jun 1st, 2023
TANISHQ LAUNCHES ITS GRAND FESTIVE COLLECTION- ‘EKATVAM’
Spread the News

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,05 అక్టోబర్‌ 2020: భారతదేశంలో అతిపెద్ద,ఎక్కువ మంది అభిమానించే ఆభరణాల బ్రాండ్‌ తనిష్క్‌, ఈపండుగ సీజన్‌ కోసం తమ నూతన కలెక్షన్‌–ఏకత్వంను విడుదల చేసింది. ఈ కలెక్షన్‌ను ఏకత్వ నేపథ్యంతో తీర్చిదిద్దారు. భారతదేశపు మహోన్నత కళారూపాల సమ్మేళనంగా ఇది ఉండటమే కాదు, ఒక్కటిగా ఉండటంలోని అద్భుతాన్ని ఈ కలెక్షన్‌ చక్కగా మన కళ్లముందుంచుతుంది.భారతదేశపు నైపుణ్యవంతులైన కళాకారుల పనితనానికి నివాళిగా ఏకత్వం నిలుస్తుంది. భారతదేశంలో విభిన్నమైన 15
కళారూపాలను అద్భుతంగా ఈ కలెక్షన్‌లో మిళితం చేయడం వల్ల ప్రతి ఆభరణమూ తన ప్రత్యేకతను చాటే రీతిలో ఉంటుంది.ఈ అతి సున్నితమైన కలెక్షన్‌లో అద్భుతమైన డిజైన్లు ఉన్నాయి. వీటిలో వినూత్నమైన పనితనాన్ని చూపే నకషి,రావా వర్క్‌ , కిట్‌–కిటా వర్క్‌, చందక్‌ లేయరింగ్‌ వంటివి సైతం కనిపిస్తాయి.
ఈ ఏకత్వం కలెక్షన్‌ గురించి శ్రీమతి రేవతి కాంత్‌, చీఫ్‌ డిజైన్‌ ఆఫీసర్‌, టైటాన్‌ కంపెనీ లిమిటెడ్‌ మాట్లాడుతూ
‘‘ఇటీవలి కాలంలో, భౌతిక దూరం అనుసరిస్తున్నప్పటికీ మనసుల పరంగా మాత్రం అందరమూ కలిసే ఉన్నాము.తనిష్క్‌ వద్ద మేము సమైఖ్యత అందాన్ని విశ్వసిస్తుంటాం. మా తాజా పండుగ కలెక్షన్‌ ఏకత్వపు స్ఫూర్తితో రూపుదిద్దుకుంది.మేము మా వినియోగదారులు, కారిగార్లును ఏకం చేయాలనుకున్నాం. మా ఆభరణాలు ఈ సంక్షోభ సమయంలో మానవత్వపు సంగమానికి ప్రతీకలుగా ఉంటాయి.

TANISHQ LAUNCHES ITS GRAND FESTIVE COLLECTION- ‘EKATVAM’
TANISHQ LAUNCHES ITS GRAND FESTIVE COLLECTION- ‘EKATVAM’

మా పండుగ కలెక్షన్‌ మా వినియోగదారుల పండుగ వేడుకలకు కొత్తందాలను జోడిస్తాయని నమ్ముతున్నాం’’ అని అన్నారు.అరుణ్‌ నారాయణ్‌, వీపీ కేటగిరీ, మార్కెటింగ్‌ అండ్‌ రిటైల్‌, తనిష్క్‌, టైటాన్‌ కంపెనీ లిమిటెడ్‌ మాట్లాడుతూ
‘‘ఏకత్వం అనేది మానవత్వాన్ని పరిమళిస్తుంది. ఈ ఆలోచనను మేము ఏకత్వం కలెక్షన్‌ ద్వారా వేడుక చేస్తున్నాం. ఈ నూతన, ఉత్సాహపూరితమైన కలెక్షన్‌, భారతదేశంలోని విభిన్న ప్రాంతాల కళారూపాల సమ్మేళనంగా ఉంటుంది.మరీముఖ్యంగా, ఈ కలెక్షన్‌తో మా ఆభరణాల నిపుణుల జీవితాల నుపునర్నిర్మించుకో
వడంలో సహాయపటంతో పాటుగా ఈ దీపావళివేళ వారి ఇళ్లనుసైతం కాంతివంతం చేయగలమనినమ్ముతున్నాం ’’ అని అన్నారు.తనిష్క్‌ ఏకత్వం కలెక్షన్‌ 40వేల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ కలెక్షన్‌ అన్ని తనిష్క్‌ స్టోర్లతో పాటుగాఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌ http://www.tanishq.co.in వద్ద కూడా లభ్యమవుతుంది.

TANISHQ LAUNCHES ITS GRAND FESTIVE COLLECTION- ‘EKATVAM’
TANISHQ LAUNCHES ITS GRAND FESTIVE COLLECTION- ‘EKATVAM’