365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కాకినాడ,ఫిబ్రవరి 14,2021:ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కాకినాడలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన చీరల ప్రదర్శన తో పాటు అమ్మకాలు కూడా నిర్వహిస్తున్నట్లు తనైరా బ్రాండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేశ్వరి శ్రీనివాసన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక దేవాలయం వీధిలో గల తనిష్క్ షోరూమ్ లో ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనకు వచ్చే సందర్శకులు తనైరా ప్రత్యేకమైన కలెక్షన్లను వీక్షించవచ్చన్నారు. వీటిలో చదేరి, మహేశ్వరి, బెంగాల్, భగల్పూర్, కాంజీవరం తదితర భారతదేశంలోని పలు ప్రాంతాలలో చేతితో రూపొందించిన 1500 పైగా చీరల కలెక్షన్లను వీక్షించవచ్చు అన్నారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 30 శాతం వరకు రాయితీని కూడా అందించడం జరుగుతుందన్నారు.ఈ ఎగ్జిబిషన్ లో లినెన్ విలాసవంతమైన కలెక్షన్ ప్లోరెల్లి సైతం ప్రదర్శిస్తారన్నారు. వీటితో పాటు పెస్టల్ టోన్స్ డ్రీమీ సిల్ హ్యూటిలతో సిల్క్ సారీ లు సైతం ప్రదర్శిస్తారన్నారు.

బ్రైడల్ వెడ్డింగ్ కలెక్షన్లు, బనారస్, కాంచీపురం నుంచి అతి సున్నితమైన సిల్క్ తో తీర్చిదిద్దినవి కూడా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. వీటితో పాటుగా తనైరా యొక్క రెడీ టు వేర్ శ్రేణి లినెన్స్, టన్సర్స్, సాప్ట్ సిల్కు తో తయారుచేసిన ఆకర్షణీయమైన కుర్తా సెట్స్, ఐరా, డ్రెస్ మెటీరియల్స్, రెడీ టు వేర్ బ్లౌజులు, మాస్కులు, స్తోల్స్, దుప్పట్లను సైతం ప్రదర్శిస్తారన్నారు. ఈ ప్రదర్శనలకు కాకినాడ నగర ప్రజలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు విచ్చేసి సందర్శించాలని ఈ సందర్భంగా రాజేశ్వరి శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు.