తలంబ్రాల తయారీ ప్రారంభం

AP News Devotional Featured Posts Top Stories Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఒంటిమిట్ట,ఏప్రిల్ 10,2022: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తలంబ్రాలను డెప్యూటీ ఈఓ శ్రీ రమణప్రసాద్ కు అందజేశారు.

అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.