శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంటిమిట్ట,ఏప్రిల్ 15,2022: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు 10 గంటల వరకు జరిగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Continue Reading

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 14,2022: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

Continue Reading

నవనీతకృష్ణునిగా శ్రీకోదండరామస్వామి కటాక్షం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్‌ 13: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.

Continue Reading

సింహ వాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంటిమిట్ట‌, ఏప్రిల్ 12,2022: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు సింహ వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చా రు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరుగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Continue Reading