Thu. Apr 25th, 2024

Tag: localisation

Reverie's Anuvadak 2.0 enables localisation of the entire user journey across dynamic websites

రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌లలో వినియోగదారు సంపూర్ణ వీక్షణను స్థానికీకరించడానికి వీలు కల్పిస్తుంది

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు,జనవరి 19,2021: రెవరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ జూన్ 2020 తొలినాళ్ళలోనే అనువాదక్ మొదటి వెర్షన్‌ను ఆవిష్కరించింది.అనువాదక్ అనేది బహుభాషా వెబ్‌సైట్ నిర్వహణ వేదిక, ఇది వెబ్‌సైట్‌ను ఏదైనా భాషలో స్థానికీకరించడం,నిర్వహించటం, ప్రచురించడం, ప్రారంభించడం వంటి ప్రక్రియను సులభతరం చేస్తుంది.దీని సహాయంతో వెబ్‌సైట్‌ను స్థానికీకరించేసమయాన్ని40% వరకు తగ్గించవచ్చు,స్థానికీకరణ,వియాంశాల నిర్వహణ ఖర్చులో 60%వరకుఆదా చేయవచ్చు. సాంప్రదాయకంగా, భారతీయ భాషలలో డైనమిక్ వెబ్‌సైట్ స్థానికీ కరణ,విషయాంశాల నిర్వహణలు, ఈ ఆరు ప్రక్రియలను కలిగి ఉంటాయి, ఇవి మ్యాన్యువల్‌గా నిర్వహించబడడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి: మూలంగా ఉన్న ఇంగ్లీష్ వెబ్‌సైట్ నుండి నిశ్చలమైన ఆంగ్ల విషయాంశాలను సంగ్రహించడం. మార్చాల్సిన అన్ని ఆంగ్ల విషయాంశాల స్ప్రెడ్‌షీట్‌ను నిర్వహించడం. ప్రతి భారతీయ భాషలో వేర్వేరు సర్వర్లలోని వెబ్‌సైట్‌లను అమలు చేయడం  నిర్వహించడం. ఒకసారి వెబ్‌సైట్ హోస్ట్ చేయబడిన తర్వాత, స్థానికీకరించిన విషయాంశాలు ప్రతిఒక్క వ్యక్తిగత వెబ్‌సైట్‌లలో నవీకరించబడడం. డేటాబేస్ లేదా బ్యాకెండ్ నుండి సంగ్రహించబడిన విషయాంశాలన్నీ మ్యాన్యువల్‌గా స్థానికీకరించబడడం. ఈ బహుభాషా వెబ్‌సైట్‌లతో లైవ్‌లో అనుసరించడం,ప్రతి వెబ్‌సైట్‌కు విడిగా ఎస్. ఈ. ఓ. ని నిర్వహించడం. మూలంగా ఉన్న ఆంగ్ల వెబ్‌సైట్‌లోని ఏదైనా మార్పులు అదేరకమైన దీర్ఘకాలిక ప్రక్రియ ద్వారా చేయవలసి ఉంటుంది.స్థానికీకరించిన వెబ్‌సైట్‌ల కోసం సంబంధిత విషయాంశాలను అనువదించడం, నిర్వహించడం ప్రమాణీకరించడం వంటివాటిని, అనువాదక్ ఒక వేదికగా ఆటోమేట్ చేస్తుంది. స్థానికీకరించిన విషయాంశాలు, వెబ్‌సైట్, పురోగతిని ట్రాక్ చేయడం సాధారణ యూజర్ డాష్‌బోర్డ్ ద్వారా అవరోధరహితంగా చేయడం. ఇది లైవ్ గా అనుసరించడానికి పట్టే సమయాన్ని తగ్గించడమే కాక, అదే సమయంలో ఖర్చులను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.రెవెరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ సీఈఓ ఆర్‌వింద్ పాణి, ఇలా అన్నారు,”మేము #వోకల్‌ఫర్‌లోకల్ (#VocalForLocal)లో నొక్కి చెప్పినట్లుగా, వ్యాపారాలు, ప్రభుత్వాలు అన్ని భారతదేశానికి చేరుకోవడానికి సరైన సాధనాలతో సాధికారత పొందడం అత్యవసరం. 536 మిలియన్ భారతీయ-భాషా ఇంటర్నెట్ వినియోగదారులను సంభావ్యంగా ఆకర్షించడానికి ఈ అనువాదక్ ఒక ప్రయత్నం. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్న రెవెరీతో, అనువాదక్ ఒక సమగ్ర డిజిటల్ ఇండియాను నిర్మించడంలో పురోగతివైపు దూసుకెళుతుంది.” రెవెరీ వారి అనువాదక్2.0తో, ఇకామర్స్ సైట్స్ వంటి డైనమిక్ వెబ్‌సైట్‌లలో మొత్తం వినియోగదారు వీక్షణను ఇప్పుడు స్థానికీకరించవచ్చు: ఎఐ – ఎనేబుల్డ్ అనువాద నిర్వహణ వేదికలతో కలిసిపోయే అనువాదక్  సామర్థ్యం వెబ్‌సైట్ అనువాద సమయాన్ని భారతీయ భాషలలో సాంప్రదాయకంగా అనువదించడానికి పట్టే సమయంలో మూడవ వంతుకు తగ్గిస్తుంది. రెవెరీ సొంత యాజమాన్య ఇన్-బిల్ట్ ఇండిక్ ఫాంట్లతో – అనువాదక్ ద్వారా పంపిణీ చేయబడిన అనువాదాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త భాషలను ఆవిష్కరించడానికి కోడింగ్ అవసరం లేకుండా ఐ.టి పై ఆధారపడడాన్ని అనువాదక్ తగ్గిస్తుంది. ఇండిక్ లాంగ్వేజ్ ప్లగ్ – ఇన్‌ల ఆన్-డిమాండ్ మాదిరిగా కాకుండా, అనువాదక్, స్థానికీకరించిన వెబ్‌పేజీలకు. ఎస్. ఈ. ఓ.  అనుకూలతను నిర్ధారిస్తుంది, అంటే ఒక సంస్థ యొక్క స్థానికీకరించిన వెబ్‌సైట్ అన్వేషణ ప్రశ్నలను వారి స్వంత భాషలో వేగంగా చూపించడం ప్రారంభిస్తుంది. ఇకామర్స్ సైట్లు, సోషల్ మీడియా ఫీడ్స్, రియల్ టైమ్ న్యూస్ ఫీడ్స్, స్టాక్ నవీకరణల వంటి డైనమిక్ విషయాంశాల స్థానికీకరణ ఇప్పుడు అదే సమయంలో అవరోధరహితంగా సాధ్యమవుతుంది. సైట్ లేదా పేజీ అందించబడుతున్నప్పుడు, దానిలో కొత్తగా కనిపించే విషయాంశాలు కూడా తదనుగుణంగా స్థానికీకరించబడతాయి. సర్వర్ కాల్స్‌పై ఆధారపడకుండా