దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జూలై 4,2022: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం జరిగింది. జర్నలిస్ట్ దయ్యాల అశోక్ , దొడ్డి కొమురయ్య మనవడు దొడ్డి చంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు నేతలు, రక్తదాతలు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 31 మంది పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది.
Continue Reading