Thu. Mar 28th, 2024
srikrishnadevarayalu_365t

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కర్నూలు,జనవరి 26,2023: దక్షిణ భారత మహారాజు శ్రీ కృష్ణ దేవరాయల జయంతి జనవరి 27 సందర్భంగా నిర్వహించే సభను జయప్రదం చేయాలని రాయలు అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రోపా కన్వీనర్ కోనేటి చంద్రబాబు కోరారు.

బుధవారం స్థానిక కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు ఉన్న రోపా కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలు విజయ నగరాధీశులందరి లో చాలా గొప్పవాడు,

గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగిన గొప్ప చక్రవర్తి అని కొనియాడారు.

దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించి, గొలుసు కట్టు కాలువల నిర్మాణం చెరువుల పూడిక తీత ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన మహోన్నత వ్యక్తి శ్రీ కృష్ణ దేవరాయలు.

srikrishnadevarayalu_365t

రాయలు వారి పరిపాలన కాలంలో రత్నాలు రాశులుగా పోసి అమ్మిన ఘన చరిత్ర ఉంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన బలిజ సంఘీయుడు కావడం మన అదృష్టం.

అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 27 న శుక్రవారం నాడు ఉదయం 9:30 గంటలకు కర్నూలు నగరంలోని కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద నిర్వహించే జయంతి సభలో బలిజ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, బలిజ కాపు యువ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి వెంకటేశ్వర్లు, రోపా అధ్యక్షులు కొట్టే చెన్నయ్య,ప్రధాన కార్యదర్శి గన్నపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.