Tirupathi | శ్రీనివాసమంగాపురంలో వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం..

Devotional Featured Posts National Top Stories Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి, నవంబర్1, 2021: శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివార్ల‌ను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు.

ఆ త‌రువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం జ‌రిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ నిర్వ‌హించారు.