Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 3,2021:తిరుపతి లోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. డిసెంబ‌రు 4న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది.