ఏప్రిల్ 26 నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం

AP News Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 21,2022:తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం ఏప్రిల్ 26 నుంచి మే 5వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంట‌ల‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 5.30నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జ‌రుగ‌నుంది. మే 4న భోగి తేరు, మే 5న సాత్తుమొర జ‌రుగ‌నుంది