Sat. Apr 20th, 2024
srishailam-temple

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, కర్నూలు, నవంబర్18,2022: కార్తీకమాసం కావడంతో శ్రీశైలంలో భక్తులరద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఈ రోజు నుంచి నవంబర్23 వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేయనున్నారు.

కార్తీకమాసం కావడంతో రోజురోజుకీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ దృష్ట్యా స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేసినట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులందరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆర్జితసేవ, స్పర్శదర్శనాలు నిలివేస్తున్నట్లు వెల్లడించారు.

srishailam-temple

ముందస్తుగా ఆన్లైన్లో టికెట్ తీసుకున్న భక్తులకు రేపు స్పర్శదర్శనం, గర్భాలయ అభిషేకాలు యధాతథంగా జరగనున్నాయి. ఇప్పటికే గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు దేవస్థానం నిలివేసింది.

భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీస్ లు. కార్తీకమాసం ముగిసే వరకు భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీశైలం ఈవో లవన్న పేర్కొన్నారు.