Fri. Mar 29th, 2024
smart-phone_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 16,2023: ఒక నివేదిక ప్రకారం.. స్మార్ట్ ఫోన్లపై భారతీయ వినియోగదారులు వెచ్చించే సమయం 50 శాతం పెరిగింది. భారతీయ మహిళల్లో కేవలం 11.3 శాతం మంది మాత్రమే చెల్లింపులు చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ బాబుల్ ఏఐ నివేదిక నుంచి వచ్చిన సమాచారం ప్రకారం. 6.1 శాతం మంది మహిళలు మాత్రమే గేమింగ్ అప్లికేషన్లలో యాక్టివ్‌గా ఉన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫుడ్ యాప్‌లనుఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. 23.5 శాతం మంది మహిళలు ఫుడ్ డెలివరీ యాప్స్ పై ఆధారపడుతున్నారట.

smart-phone_365

మహిళలు ఈ యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. నివేదిక ప్రకారం, వివిధ యాప్‌లను వాడే మహిళల శాతం కూడా మారుతూ ఉంది. 6.1 శాతం మంది మహిళలుగేమింగ్ యాప్‌లలో యాక్టివ్‌గా ఉండగా, 23.5 శాతం మంది ఫుడ్ యాప్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

చెల్లింపు యాప్‌లు- గేమింగ్ యాప్‌ల కంటే కమ్యూనికేషన్ యాప్‌లు (23.3 శాతం) వీడియో యాప్‌లపై(21.7 శాతం) మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.

వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో సెల్ ఫోన్ వినియోగదారులు ఏయే యాప్స్ పై ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి Bobble AI అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార్ట్-యాప్ అధ్యయనం ఆధారంగా ఓ నివేదిక రూపొందించింది. 85 మిలియన్లకుపైగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నఫస్ట్-పార్టీ డేటాను ఆధారంగా అధ్యయనం చేశారు.

భారతీయ వినియోగదారుల కోసం మొబైల్ వినియోగం,ట్రెండ్స్ ,వృద్ధిని విశ్లేషించడానికి 2022-2023 డేటా ఆధారంగా నివేదిక రూపొందించారు.

నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌లపై వెచ్చించే మొత్తం సమయం జనవరి 2022 నుంచి జనవరి 2023 వరకు క్రమంగా పెరిగింది. సగటు నెలవారీ ఫోన్ వినియోగం 2022లో 30 శాతం నుంచి 2023 చివరినాటికి 46 శాతానికి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

వినియోగదారులు వారి మొబైల్ పై రోజుకు సగటున అరగంట కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మొత్తంమీద, 2022 కంటే 2023 ప్రారంభ నెలల్లో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లపై 50 శాతం ఎక్కువ సమయాన్ని వెచ్చించారని గుర్తించారు.

smart-phone_365

కమ్యూనికేషన్ యాప్‌లు, సోషల్ మీడియా యాప్‌లు, వీడియో యాప్‌లపై భారతీయ వినియోగదారులు అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నట్లు నివేదిక పేర్కొంది (మొత్తం 76.68 శాతం), మిగిలిన యాప్‌లు వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లపై వెచ్చించే మొత్తం సమయంలో 23 శాతానికి పైగా ఉన్నాయి.

ఇతర యాప్‌లలో, లైఫ్‌స్టైల్ యాప్‌లు అత్యంత ఆకర్షణీయమైనవిగా మారాయి, వినియోగదారులు ఈ కేటగిరీలలోని యాప్‌లలో 9 శాతం కంటే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు.

ఈ కేటగిరీలు కాకుండా, ఫైనాన్స్, గేమింగ్, మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లలో నిమగ్నమై గడిపిన సమయంలో 1 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఇవి తప్పనిసరిగా చదవండి..

టీఎస్ పీఎస్సీ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫ్రీగా స్టడీ మెటీరియల్


ఇలా చేస్తే ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు..


ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదం పుస్తకాలు ఫ్రీగా మీకోసం..

ఖర్భుజా కొనేటప్పుడు ఇవి చూసి కొనాలి..! లేదంటే మోసపోతారు జాగ్రత్త..!

పాన్ కార్డ్‌లో ఉండే నంబర్లు వేటిని గురించి తెలియజేస్తాయో..తెలుసా..?

ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే లాభాలు,నష్టాలు..

రూ.1కే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్..కేర్ ఆఫ్ జీజీ ఛారిటబుల్ హాస్పిటల్‌..

నీళ్ల పై తేలియాడే పాఠశాల..? ఎక్కడంటే..?

మారుతి సుజుకి నుంచి మార్కెట్‌లోకి రానున్న సరికొత్త కార్లు..

నవభారత లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.. 

మారుతి సుజుకి నుంచి మార్కెట్‌లోకి రానున్న సరికొత్త కార్లు..

నవభారత లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు..

మారుతి సుజుకి నుంచి మార్కెట్‌లోకి రానున్న సరికొత్త కార్లు..