Fri. Mar 29th, 2024
Men's-Physique-Championship

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, జనవరి 31, 2023: కర్ణాటకలోని సేడమ్ లో మొట్టమొదటి సారిగా హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఇందులో మన హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు తమ టాలెంట్ చూపించి విజేతలుగా నిలిచారు.

దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల నుంచి ఈ పోటీలో బాడీ బిల్డర్లు పాల్గొనగా, మన హైదరాబాద్ నుంచి పాల్గొన్న హరీష్ కుమార్, మన్సూర్ షా ఇద్దరు కూడా ఓవరాల్ విన్నర్స్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ బీబీ ప్రో అఫ్రోజ్ ఖాన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

Men's-Physique-Championship

ఈ సందర్భంగా ఆర్గనైజర్ షఫీ షమీ మాట్లాడుతూ.. అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కంటే బాడీబిల్డింగ్ కోసం చాలా కష్టపడాలని అన్నారు. బాడీ బిల్డింగ్ కాంపిటేషన్ లోపాల్గొన్న ప్రతిఒక్కక్కరు విన్నరే అని ఆయన చెప్పారు.