నియో QLED 8K & నియో QLED టీవీ రేంజ్‌ను ఆవిష్కరించిన సాంసంగ్‌

Business Electrical news Featured Posts Life Style National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, ఏప్రిల్ 20,2022:భారతదేశపు నెంబర్ 1 టీవీ బ్రాండ్ సాంసంగ్‌ నేడు అల్ట్రా-ప్రీమియం 2022 నియో QLED 8K నియో QLED టీవీలను విడుదల చేసింది. TVలను ప్రారంభించింది. ఇది మీ లివింగ్‌ స్పేస్‌ను సంపూర్ణంగా మార్చి మీకు మైమరపింపజేసే పిక్చర్‌ క్వాలిటీ, అద్భుతమైన సౌండ్‌ అందిస్తుంది.కొత్త నియో QLED టీవీ శ్రేణి టీవీ కంటే చాలా అదికంగా ఉండేలా రూపొందించబడింది. ఇది గేమ్ కన్సోల్, వర్చువల్ ప్లేగ్రౌండ్‌, మీ ఇంటిని నియం త్రించే స్మార్ట్ హబ్‌గా నిలవడమే కాదు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ మీకు పరిపూర్ణ
భాగస్వామిగా నిలుస్తుంది.

కొత్త నియో QLED లైనప్ క్వాంటమ్ మినీ LED ఆదారిత క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో శక్తితో వస్తుంది. ఇవి సాధారణ LEDల కంటే 40 రెట్లు చిన్నవి. ఇది డిస్‌ప్లే కాంతిని మరింత కచ్చితంగా నియంత్రిస్తూ మెరుగైన కాంతి స్థాయిని అందిస్తుంది. షేప్ అడాప్టివ్ లైట్ కంట్రోల్ చిత్రంలో వివిధ వస్తువులను సంపూర్ణంగా విశ్లేషించి అవసరానికి అనుగుణంగా లైట్లను నియంత్రిస్తుంది.నియో QLED 8K రియల్ డెప్త్ ఎన్‌హాన్సర్‌తో కూడిన న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8K శక్తి కలిగి ఉంటుంది.

ఇది ఏఐ ఆధారిత లోతైన అభ్యాసం సాయంతో త్రీ-డైమెన్షనల్ డెప్త్‌ని సృష్టించడానికి వస్తువులను నిర్థారించి మెరుగుపరుస్తుంది.మెరుగైన వీక్షణ అనుభూతి కోసం నియో QLED ఐ కంఫర్ట్ మోడ్‌ కలిగి ఉంది, ఇది అంతర్నిర్మిత సెన్సార్‌ల ఆధారంగా స్క్రీన్ కాంతి, టోన్‌ను ఆటోమ్యాటిక్‌గా అడ్జస్ట్‌ చేస్తుంది. పరిసర కాంతి మారినప్పుడు స్క్రీన్ క్రమంగా కాంతి పరిమాణాన్ని తగ్గించి హాయిగొలిపే టోన్‌ అందిస్తూ తదనుగుణంగా నీలి కాంతి స్థాయిని అడ్జస్ట్ చేస్తుంది.అత్యాధునిక నియో QLED 8K లైనప్ 65 అంగుళాల నుంచి 85-అంగుళాల వరకు స్క్రీన్ పరిమాణాలతో మూడు సిరీస్‌ల్లో వస్తుంది. నియో QLED TV 50-అంగుళాల నుంచి 85-అంగుళాల వరకు భారీ స్క్రీన్ పరిమాణాలతో మూడు సిరీస్‌లలో అందుబాటులో ఉంటుంది. సరికొత్త శ్రేణి నియో QLED టీవీలు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అలాగే సాంసంగ్‌ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ సాంసంగ్‌ షాప్‌లో అందుబాటులో ఉంటాయి.

పరిమిత వ్యవధి ఆఫర్‌గా, ఏప్రిల్ 19-30, 2022 మధ్య కాలంలో కొనుగోలు చేసే నియో QLED 8K టీవీలపై వినియోగదారులు రూ.1,49,900 విలువైన సాంసంగ్‌ సౌండ్‌ బార్‌ (HW-Q990B), రూ. 8,900 విలువైన స్లిమ్‌ఫిట్‌ క్యామ్‌ ఉచితంగా అందుకుంటారు. నియో QLED టీవీలు కొనుగోలు చేసే వినియోగదారులకు కొనుగోలుపై రూ. 8,900 విలువైన స్లిమ్ఫిట్‌ క్యామ్‌ పొందుతారు. నియో QLED 8K నియో QLED టీవీలను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వినియోగదారులు వరుసగా రూ.10,000, రూ. 5,000 విలువైన తగ్గింపు పొందవచ్చు.“సాంసంగ్‌లో మేము మా వినియోగదారుల మారుతున్న జీవనశైలికి తగిన రీతిలో ఉండేలా టెలివిజన్ల రూపొందించే బాధ్యతను స్థిరకంగా తీసుకుంటున్నాం. అద్భుతమైన 2022 నియో QLED టీవీ సిరీస్ ఉత్కంఠభరితమైన చిత్రంతో పాటు నాణ్యమైన సౌండ్‌ అందిస్తుంది. అంతే కాదు ఇది కంటెంట్‌ని చూడటానికి, పనులు చేసుకోవడానికి, ఆడుకోవడానికి, ఇతర పరికరాలు నియంత్రిం చడానికి, మీ ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి వీలుగా వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని కూడా అందిస్తుంది.

అల్ట్రా-లార్జ్ స్క్రీన్‌లు, 8K రిజల్యూషన్ నెక్ట్స్‌-లెవల్ ఇమేజ్, సౌండ్ క్వాలిటీ కలిగి ఉండటం వలన నియో QLED టీవీలు భారతదేశంలోని ప్రీమియం టీవీ మార్కెట్‌లో మా నాయకత్వాన్ని బలోపేతం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాము, ”అన్నారు సాంసంగ్‌ ఇండియా కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్. సరికొత్త శ్రేణి నియో QLED టీవీలు అంతర్నిర్మిత IoT హబ్‌ కలిగి ఉన్నాయి. దీని ద్వారా వినియోగదారులు తమ ఇంటిని టీవీ ద్వారా స్మార్ట్‌గా నియంత్రించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇది మీ హోమ్ డివైస్‌లతో పాటు థర్డ్‌ పార్టీ డివైసులను కూడా చెక్‌ చేసుకునేలా చూస్తుంది. టీవీ డిజైన్‌ లేదా వీక్షణ అనుభూతికి ఏ మాత్రం భంగం కలగకుండా సులభంగా ఉపయోగించగలిగే స్లిమ్‌ఫిట్‌ క్యామ్‌ (టీవీ వెబ్‌క్యామ్‌) ద్వారా పెద్ద టీవీ స్క్రీన్‌పై మీరు వీడియో కాలింగ్‌ లేదా వెబ్‌ కాన్ఫరెన్సులను ఆస్వాదించవచ్చు. స్మార్ట్ హబ్ ఫీచర్ సరికొత్త యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ ను అందిస్తుంది.

ఇది స్మార్ట్ అనుభవంలోని ప్రతి అంశాన్ని సులభమైన నావిగేట్ చేసి హోమ్ స్క్రీన్‌లోకి తీసుకువచ్చేలా చేస్తుంది. సాంసంగ్‌ టీవీ ప్లస్‌లో భాగంగా అద్భుతమైన కంటెంట్‌ వీక్షణ అనుబూతి, వ్యక్తిగతమైన సిఫార్సులు మాత్రమే కాదు ఉచితంగా ఇండియన్‌ & గ్లోబల్‌ టీవీ ఛానెల్స్ 45+ ఛానెల్స్‌ కూడా పొందవచ్చు. కాబట్టే వినియో గదారుల అత్యుత్తమ ఎంపికగా నియో QLED టీవీ రేంజ్‌ నిలుస్తోంది. సాంసంగ్‌ సిగ్నేచర్ ఇన్ఫినిటీ వన్ డిజైన్ సన్నగా, సొగసైన రూపంతో టీవీ నేలపైన తేలుతున్న ట్లుగా అనిపిస్తుంది.2022 సాంసంగ్‌ నియో QLED 8K కూడా 90W 6.2.4 ఛానల్ ఆడియో సిస్టమ్‌తో రూపొందించబడింది. డాల్బీ అట్మోస్ సపోర్టుతో Q-సింఫనీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్రో (OTS ప్రో)తో పాటు అద్భుతమైన 3D సరౌండ్ సౌండ్ హోమ్
థియేటర్ అనుభూతి అందిస్తుంది.2022 నియో QLED టీవీ లైనప్ గేమర్స్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి మృదుమైన మైమరపింపజేసే ఆల్ట్రా వైడ్‌, ల్యాగ్‌ ఫ్రీ గేమింగ్‌ అనుభూతి అందించేందుకు మోషన్ ఎక్స్‌సిలరేట్‌ టర్బో ప్రోతో (HDMI 2.1 పోర్ట్‌లతో 144Hz VRR వరకు) డిజైన్ చేయబడింది.

సరికొత్త టీవీ లైనప్‌లో కొత్త గేమ్ బార్‌ కూడా ఉంది. ఇది గేమ్ సెట్టింగ్‌లను సులభంగా
ఆప్టిమైజ్ చేసుకునే వెసులుబాటు గేమర్స్‌కు కల్పిస్తుంది. దాని జూమ్-ఇన్ మోడ్ అల్ట్రా వైడ్ వ్యూ (32:9) ఒక్క బ్లైండ్ స్పాట్‌ను కూడా వదిలేయదు.వాతావరణాన్ని సంరక్షించేందుకు, వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు తన ఉత్పత్తులు, ఎకో-ప్యాకేజింగ్‌ చర్యల ద్వారా సాంసంగ్‌ ఎంతో కృషి చేస్తోంది. సరికొత్త సోలార్‌సెల్‌ రిమోట్‌ పూర్తిగా బ్యాటరీరహితం, ఇది ఇంట్లోని వెలుతురుతోనే ఛార్జ్‌ అవుతుంది.
ధర & లభ్యత నియో QLED 8K టీవీలు QN900B (85-అంగుళాలు), QN800B (65- 75-అంగుళాలు), QN700B (65-అంగుళాలు) మోడల్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.3,24,990 నుంచి ప్రారంభమవుతుంది. నియో QLED టీవీలు QN95B (55-, 65-అంగుళాలు), QN90Bలో నియో QLED టీవీలు (85- 75- 65- 55- 50 అంగుళా ల), QN85B (55- 65-అంగుళాల) మోడల్స్‌లో రూ. 1,14,990 ప్రారంభ ధరతో అందు బాటులో ఉన్నాయి.

ఈ టీవీలు సాంసంగ్‌ రిటెయిల్‌ స్టోర్స్‌, ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టోర్స్‌, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ సహ సాంసంగ్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌ సాంసంగ్‌ షాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వారంటీ నియో QLED టీవీలు కొనుగోలు చేసే వినియోగ దారులకు 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ లభిస్తుంది.సాంసంగ్‌ నియో QLED టెలివిజన్లు 2022 లైనప్‌తో డిజైన్‌, ప్రీమియం ఫీచర్లతో చక్కని సమ్మేళ నంతో కూడిన అద్భుతమైన వీక్షణ అనుభూతిని అందించేందుకు సాంసంగ్‌ నియో QLED టెలివిజన్లను పరిచయం చేసింది. నియో QLED అత్యాధునికమైన క్వాంటం
మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రోతో శక్తివంతమైన న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8K రియల్ డెప్త్ ఎన్‌హాన్సర్‌తో కూడి ఉంటాయి. సాంసంగ్‌ 2022 నియో QLED టీవీల్లోని అమర్చిన స్మార్టర్ ఇంటెలిజెంట్ ఫీచర్స్‌, యూజర్ ఇంటర్‌ఫేస్‌ కంటెంట్‌ని చూడటానికి, పరికరాలను నియంత్రించడానికి, గేమ్స్‌ ఆడటానికి, పని చేయడానికి మరిన్నింటికి సెంట్రల్‌ హబ్‌గా నిలుస్తుంది.

స్మార్ట్, స్మార్టర్‌, స్మార్టెస్ట్‌: ఈ ఉపమానాలు 2022 నియో QLED కు సరిపోవు స్మార్ట్ హబ్
అపరిమిత వినోదానికి అద్భుతమైన గమ్యస్థానం సాంసంగ్‌ 2022 నియో QLED టీవీ. ఈ సరికొత్త శ్రేణి టెలివిజన్లలోని రెన్యూడ్‌ హోమ్ స్క్రీన్‌ ఒకే స్క్రీన్‌లో కంటెంట్, స్మార్ట్ ఫీచర్‌లు సెట్టింగ్స్‌ కలిగి ఉంది. సాంసంగ్‌ టీవీ ప్లస్‌ ఫీచర్ సబ్‌స్క్రిప్షన్‌ చికాకు ల నుంచి వినియోగదారులకు విముక్తి కల్పిస్తూ రోజువారీ వినోదం, వార్తలు, క్రీడలు మరిన్నింటి కోసం 45+ ఉచిత లోకల్ & గ్లోబల్ టీవీ ఛానెల్స్‌తో కూడి ఉంటుంది.
గేమర్స్ స్వర్గం సాంసంగ్‌ నియో QLED టెలివిజన్ల శ్రేణి టెలివిజన్ కంటే ఎక్కువ; ఇది ప్రతి గేమర్ కల. 2022 నియో QLED శ్రేణి ప్లేయర్స్‌కు క్షణకాలం కూడా ల్యాగింగ్‌ లేకుండా స్మూత్‌, ఫ్లోయింగ్‌ మోషన్స్‌ అందిస్తుంది. గేమింగ్ స్టేటస్‌ను ప్లేయర్స్‌ చూసేందుకు సహకరిస్తుంది గేమ్ బార్‌. గేమ్ సెట్టింగ్‌లను సులభంగా ఆప్టిమైజ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అలాగే, జూమ్-ఇన్ మోడ్ అల్ట్రా-వైడ్ వ్యూతో ఇకపై బ్లైండ్ స్పాట్‌లు ఉండవు. మోషన్ ఎక్స్‌సిలరేటర్ టర్బో ప్రో ఇవన్నీ సుసాద్యం చేస్తుంది. గేమర్లు తప్పనిసరిగా కలిగి ఉండేలా నియో QLEDను నిలుపుతుంది.

నియో QLEDతో ఇతర పరికరాల నియంత్రణ 2022 సాంసంగ్‌ నియో QLED బిల్ట్ –ఇన్‌ హోమ్‌లోని IoT వంటి స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది టీవీతో మీ ఇంటిని
నియంత్రించడానికి మీకు సహకరిస్తుంది. స్లిమ్ ఫిట్ క్యామ్‌తో వీడియో కాలింగ్, మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్, ఒకే సమయంలో టీవీ స్మార్ట్‌ఫోన్ కంటెంట్ రెండింటినీ ఆస్వాదించడానికి మల్టీ-వ్యూ వంటి కొన్ని ఇతర ఫీచర్లు దీన్ని స్మార్టెస్ట్ టీవీగా నిలబెడతాయి. డిజైన్: స్మార్ట్ డిజైన్ కోసం మినిమలిస్ట్ విధానం సాంసంగ్‌ 2022 నియో QLED ఇన్ఫినిటీ స్క్రీన్, ఇన్ఫినిటీ వన్ డిజైన్, అటాచబుల్ స్లిమ్ వన్ కనెక్ట్‌ అమర్చబడి ఉంది. ఈ స్మార్ట్ ఫీచర్లు టెలివిజన్‌కు కేబుల్ కట్టర్ లేకుండా స్లిమ్, సొగసైన డిజైన్‌ అందిస్తాయి. దీనితో పాటుగా,ఇంజినీర్లు నియో QLED కోసం మినిమలిస్టిక్ డిజైన్‌ పొందుపరిచి మీ స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా
చూసేందుకు బ్ల్యాక్‌ బెజిల్‌ మార్చకుండా స్వచ్ఛమైన చిత్రం అందించడంపై అధిక దృష్టి సారించారు.

గది లైటింగ్‌తో ఛార్జ్‌ అయ్యే పర్యావరణ అనుకూల సోలార్ సెల్ రిమోట్‌ను తయారీ దారులు రూపొందించారు. సులభంగా ఒక్క చేత్తో ఆపరేట్‌ చేసేలా ఈ రిమోట్‌లో అతి తక్కువ కీస్‌ ఉన్నాయి. అంతే కాదు ఇందులో వాయిస్ కంట్రోల్ కమాండ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సాంసంగ్‌ టీవీ ప్లస్, డిస్నీ+ హాట్‌స్టార్ కోసం ప్రత్యేక కీస్‌ ఉన్నాయి.
స్వచ్ఛమైన చిత్ర నాణ్యతతో మెరుగైన వీక్షణ అనుభూతి క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో సరికొత్త శ్రేణి నియో QLED టీవీలు క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో (క్వాంటమ్ మినీ LED తో) మెరుగైన కాంట్రాస్ట్‌,సునిశిత వివరాలతో షేప్ అడాప్టివ్ లైట్ కంట్రోల్‌ కలిగి ఉన్నాయి. సాధారణ LEDతో పోల్చితే 1/40వ పరిమాణంలో
ఉండే క్వాంటం మినీ LED రంగులు & లోతైన నలుపుతో చక్కని కాంతిని అందించి పిక్చర్‌లో బ్లూమింగ్‌ను క్షీణింపజేస్తుంది. షేప్ అడాప్టివ్ లైట్ కంట్రోల్ చిత్రంలో వివిధ అంశాలను కచ్చితంగా విశ్లేషించి లైట్లను నియంత్రిస్తూ తదనుగుణంగా నిరంతారయమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

రియల్ డెప్త్ ఎన్‌హాన్సర్‌తో న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8K అత్యంత అధునాతన ప్రాసెసర్‌ కంటెంట్‌ను 8K, 4K నాణ్యతకు పెంచగల సామర్థ్యంతో రూపొందించబ డింది, 2022నియో QLED శ్రేణి AI ఆధారిత లోతైన అభ్యాసంతో మీరు చూసే ప్రతిదా నిలో స్పష్టతను అందిస్తుంది. ఐ కంఫర్ట్ మోడ్ మెరుగైన వీక్షణ అనుభూతికి వినియోగ దారులకు అందించేందుకు తయారీదారులు నియో QLEDలో ‘ఆహ్లాదకరమైన’వీక్షణ అనుభూతిపై దృష్టి సారించారు. కంటికి సౌకర్యాన్ని పెంచేందుకు ఇందులో న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ చిత్రాన్ని ఆప్టిమైజ్ చేసి కాంతిని, రంగు ఉష్ణోగ్రతను ట్యూన్ చేసి ఆటోమ్యాటిక్‌గా నీలం కాంతి తగ్గించి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

డాల్బీ అట్మాస్ వినియోగదారులకు సినిమా చూసే అనుభూతి అందించేందుకు తయారీదారులు సాంసంగ్‌ నియో సౌండ్ సిస్టమ్‌అమర్చారు. అది నిజంగా మైమరపింపజేసే వాస్తవిక ఆడియో అనుభూతిని అందిస్తుంది. వినియోగదారులు
ఇప్పుడు అసమానమైన 3D సరౌండ్ సౌండ్‌తో అద్భుతమైన డాల్బీ అట్మాస్ అనుభూతి ఆస్వాదించవచ్చు.