Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ఏప్రిల్ 14,2022: భారతదేశంలో అత్యంత ఆరాధించబడే బ్రాండ్ శామ్ సంగ్,భారతదేశంవ్యాప్తంగా తమ కొత్త ఫ్లాగ్ షిప్ అంతర్జాతీయ పౌరసత్వం కార్యక్రమం శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ ని జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్ వీ) పాఠశాలల్లో ఆరంభించింది. ‘రేపటి కోసం కలిసికట్టుగా ప్రజలకు వీలు కల్పించడం’ అనే శామ్ సంగ్ కలలోభాగంగా సీఎస్ఆర్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు డిజిటల్ విద్య, తమ సొంత పరివర్తనా ఆవిష్కరణల ప్రయోజ నాలు అందచేయడం ద్వారా రేపటి యువ నేతల్ని రూపొందించే లక్ష్యాల్ని కలిగి ఉంది. తమ మొదటి సంవత్సరంలో ఈ కార్యక్రమం 10 జేఎన్ వీ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబడుతోంది. వారణాసి, గ్వాలియర్, రాయ్ పూర్, ఉదయ్ పూర్, కాంగ్రా, సంభాల్ పూర్, ఫరీదాబాద్, డెహ్రాడూన్, పాట్నా, ధన్ బాద్ వంటి జేఎన్ వీ పాఠశాలల్లో శామ్ సంగ్ స్మార్ట్ పాఠశాల ఏర్పాటు చేయబడింది.

ఈ పట్టణాల్లోని సుదూరంగా ఉన్న గ్రామీణ జిల్లాల్లో చాలా పాఠశాలలు నెలకొని ఉన్నాయి. కొత్త డిజిటల్ మౌలికసదుపాయంతో ప్రతి శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ కి రెండు స్మార్ట్ తరగతి గదులు ఉన్నాయి. వీటిలో సంప్రదాయబద్ధమైన బ్లాక్ బోర్డ్ స్థానంలో85 అంగుళాల శామ్ సంగ్ ఫ్లిప్ ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్ , లెక్చర్లు, క్విజ్ లు, తరగతి పని, ప్రాజెక్ట్ పని కోసం విద్యార్థులు ఉపయోగించడానికి 55 అంగుళాల శామ్ సంగ్ ఫ్లిప్ , స్వీయ-అధ్యయనం కోసం ఉపయోగించడానికి విద్యార్థులు కోసం 40 శామ్ సంగ్ ట్యాబ్స్ భాగంగా ఉన్నాయి. అదనంగా, తరగతి గదులకు ప్రింటర్, సర్వర్ పీసీ, టాబ్లెట్ ఛార్జింగ స్టేషన్ మరియు పవర్ బ్యాక్ అప్ లు ఉన్నాయి.

శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ కార్యక్రమం ద్వారా, విద్యార్థులు తమ సాధనా సామర్థ్యాల్ని మెరుగుపరుచుకుంటారు,టీచర్లు శిక్షణ పొందిన పరస్పర సంప్రదింపుల డిజిటల్ బోధనా పద్థతులు ద్వారా తరగతి గదులలో కీలకమైన భావనల్ని అర్థ చేసుకుంటారు. 10 జేఎన్ వీ పాఠశాలల్లో ఈ ప్రయోగాత్మక కార్యక్రమం 5,000 మందికి పైగా విద్యార్థు కు
మద్దతు చేస్తుంది. వీరిలో 40% మంది బాలికలు ఉన్నారు ,సుమారు 260 మంది టీచర్లు భాగంగా ఉన్నారు. “డిజిటల్ విద్య కోసం సీఎస్ఆర్ క్రింద మా భాగస్వామిగా శామ్ సంగ్ ని కలిగి ఉన్నందుకు మేము ఆనందిస్తున్నాము. శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ ప్రోగ్రాంలో భాగంగా స్మార్ట్ తరగతిగదులు విద్యార్థి పాల్గొనడం,ప్రమేయాన్ని మెరుగుప రచడంలో సహాయపడతాయి.

ఇటువంటి కార్యక్రమం సమాజంలో ఒక సానుకూలమైన ప్రభావాన్ని తీసుకువస్తుం దని, భవిష్యత్తులో డిజిటల్ విద్య కోసం ప్రామాణికంగా మారుతుందని నేను ఆశిస్తు న్నాను’ అని శ్రీ వినాయక్ గర్గ్, కమిషనర్, నవోదయ విద్యాలయ సమితి అన్నారు.
“మెరుగైన విద్య ,సాధనా అవకాశాలు పొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు శామ్ సంగ్ సహాయపడుతోంది. శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ కార్యక్రమం మా #పవరింగ్డిజిటల్ ఇండియా యొక్క కలకి మా నిబద్ధతని శక్తివంతం చేసింది. ఈ అంతర్జాతీయ పౌరసత్వం చొరవ భారతదేశం యొక్క అభివృద్ధి ఎజెండాతో సన్నిహితంగా సంబంధాన్ని కలిగి ఉంది,బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అందచేసి, ప్రభావితం చేయడాన్ని నిర్థారించడానికి ప్రభుత్వంతో సన్నిహితమైన భాగస్వామంతో అమలుచేసింది” అని శ్రీ పార్ధా ఘోష్, వైస్ నవోదయ స్కూల్స్ లో ‘శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ ‘ ప్రోగ్రాం

ఆరంభించిన శామ్ సంగ్;డిజిటల్ అభ్యాసనతో విద్యార్థులు & టీచర్లకుసాధికారత ప్రెసిడెంట్, కార్పొరేట్ సిటిజన్ షిప్, శామ్ సంగ్ ఇండియా అన్నారు. మౌలిక సదుపాయాల మద్దతుతో పాటు, శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ టీచర్ శిక్షణ వంటి బహుళ
టచ్ పాయింట్స్ ద్వారా ఈ పాఠశాలల్లో విద్యార్థులు కోసం డిజిటల్ సాధనకి వీలు
కల్పిస్తుంది, అర్థవంతమైన,సంబంధిత విద్యా అంశాలు కేటాయిస్తుంది,ఈ
పాఠశాలల్లో ఇంటరేక్టివ్,పాల్గొనడం ద్వారా నేర్చుకోవడానికి పరిష్కారాలతో ఈ పాఠశాలలకు సదుపాయాలు కల్పిస్తుంది.టీచర్లు ఈ తరగతి గదుల్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి,ఇంటరాక్టివ్, లీనమయ్యే సాధనా ప్రక్రియ ద్వారా నేర్చుకోవడంలో విద్యార్థుల్ని మెరుగుపరచడానికి శామ్ సంగ్ అన్ని తరగతులు కోసం సీబీఎస్ఈ పాఠ్యాంశం ప్రకారం గ్రేడ్ 6-12 వరకు డిజిటల్ కంటెంట్ ని కేటాయించింది.


కార్యక్రమంలో భాగంగా, టీచర్స్ నైపుణ్యాల్ని మెరుగుపరచడానికి , డిజిటల్,
ఇంటరాక్టివ్ అభ్యాసన రూపంలో పాఠ్య పుస్తకం కంటెంట్ అందించడానికి మెరుగైన
ప్రణాళికని తయారు చేయడంలో వారికి సహాయపడటానికి క్రమబద్ధమైన టీచర్ శిక్షణ రూపొందించబడింది. శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ కార్యక్రమం,బాధ్యతవహించే ఈ ,,టీచర్స్ విద్యార్థులు కోసం బోధనని వినోదంగా, నిమగ్నమయ్యే విధంగా మరియు పాల్గొనే విధంగా చేస్తున్నారు.శామ్ సంగ్ వారి అంతర్జాతీయ పౌరసత్వం కల “టుగదర్ ఫర్ టుమారో! ఎనేబ్లింగ్ పీపుల్” ద్వారా తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి మరియు సానుకూలమైన సామాజిక మార్పులకు
మార్గదర్శకత్వంవహించడానికి శామ్ సంగ్ ఆధునిక తరానికి సాధికారత కలిగించాలని కోరుకుంటోంది. సమాజాలు సానుకూలంగా పరివర్తన చెందడానికి నవ్యతని ఉపయోగించడాన్ని శామ్ సంగ్ విశ్వసిస్తుంది,తమ పౌరసత్వం చొరవలు ద్వారా ప్రజలు కోసం మెరుగైన జీవితాన్ని సృష్టిస్తుంది.

విద్య ద్వారా యువతకి సాధికారిత కలిగించడం అనేది మనం మన యువత
ధైర్యంగా భవిష్యత్తు ప్రపంచాన్ని ఎదుర్కొనేలా తయారు చేయడానికి ఉత్తమమైన
మార్గాలలో ఒకటి.శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ అంతర్జాతీయంగా మూడు సిటిజన్ షిప్ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది-శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్, శామ్ సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్,సాల్వ్ ఫర్ టుమారో. వీటి ద్వారా రేపటి నాయకులకు సాధికారత కలిగిస్తోంది ,అర్థవంతమైన మార్పుని తెలుసుకోవడానికి వారికి అవసరమైన సాధనాల్ని సమకూరుస్తోంది.