శామ్‌సంగ్ ఎఐ వాష్ ,మెషీన్ లెర్నింగ్ తో ఎఐ ఈకోబబుల్, అనుసంధానితమైన వాషింగ్ మెషీన్ శ్రేణిని ఆవిష్కరిస్తోంది

Business Electrical news Featured Posts Life Style National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మే 10,2022:భారతదేశం ,అతిపెద్ద మరియు అత్యంత నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండు అయిన శామ్‌సంగ్, తన 2022 శ్రేణి కృత్రిమ మేధ శక్తి పొందిన ద్వి-భాషా ఎఐ ఈకోబబుల్,పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల ఆవిష్కరణను నేడు ప్రకటించింది. వినియోగదారులు తమ ప్రాధాన్యతను పెద్ద వాషింగ్ మెషీన్ల వైపు మళ్ళిస్తున్నారు కాబట్టి ఈ కొత్త శ్రేణి శ్రమ లేని లాండ్రీ అనుభవం కోసం ఎఐ వాష్ ఫీచర్,12 కిలోల వరకూ వెళ్ళే సరికొత్తవైన పెద్ద సామర్థ్యపు మోడల్స్ తో మీ ముందుకు వస్తోంది.

ఈ అత్యంత తాజా శ్రేణి అన్ని రిటైల్ భాగస్వాములు, శామ్‌సంగ్,అధీకృత ఆన్‌లైన్ స్టోర్ అయిన శామ్‌సంగ్ షాప్, అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ అన్నింటి వ్యాప్తంగా 2022 మే 10 నుండి అందుబాటులో ఉంటుంది.ఈ ఆవిష్కరణతో, వినియోగదారులు శామ్‌సంగ్ ఎఐ ఈకోబబుల్ వాషింగ్ మెషీన్లను 7 కెజి, 8 కెజి, 9కేజీల సామర్థ్యములో 25% వరకూ తగ్గింపు పొందే అద్భుతమైన అవకాశముతో కొనుగోలు చేయడానికి శామ్‌సంగ్ ఒక
పరిమిత వ్యవధితో ‘బిగ్ లాండ్రీ ఆఫర్’ ని ప్రవేశపెడుతోంది. వినియోగదారులు 8 కెజి ,9 కేజీల మోడళ్ళపై 17.5% వరకూ,7 కేజీ మోడళ్ళపై 12.5% వరకూ అదనపు క్యాష్‌ బ్యాక్ కూడా పొందుతారు. ఈ ఆఫర్ 2022 జూన్ 10 వరకూ రిటైల్ స్టోర్ల వ్యాప్తంగా చెల్లుబాటులో ఉంటుంది. 40 మోడల్స్ తో ఈ 2022 వాషింగ్ మెషీన్ల శ్రేణి, వినియోగ దారుల లాండ్రీ అనుభవాన్ని అనేక స్థాయిల్లో ఎత్తుకు తీసుకువెళ్ళే ఎఐ వాష్, ఎయిర్ వాష్ టెక్నాలజీ,సూపర్ స్పీడ్ సైకిల్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్లతో మీ ముందుకు వస్తోంది.లాండ్రీ బరువు,మురికి స్థాయిని గ్రహించడానికి గాను ఎఐ వాష్ సెన్సార్లను ఉపయోగిస్తుంది,మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి నీరు, డిటర్జెంట్,పరిమాణము ,ఉతికే సమయాన్ని అనుకూలపరుస్తుంది.

విశిష్టమైన ఎయిర్ వాష్ టెక్నాలజీ మీ దుస్తుల్ని నీటితో ఉతకకుండా వాటిని డియోడ రైజ్ చేసి,శానిటైజ్ చేస్తుంది. అది కేవలం వేడి చేయబడిన గాలిని ఉపయోగించుకొని 99.9% బ్యాక్టీరియాని,అనాహ్లాదకరమైన వాసనల్ని తొలగిస్తుంది, మీ దుస్తులు తాజాగా డ్రై-క్లీన్ చేయబడినట్లుగా భావనను కలిగిస్తాయి. మరొక వైపున సూపర్ స్పీడ్ సైకిల్, వేగమైన పిచికారీని ఉపయోగించుకొని ఉతికే సమయాన్ని కుదిస్తూ లాండ్రీ సమయా న్ని ఎంతగానో తగ్గిస్తుంది,దుస్తుల్ని త్వరగా పిండి-ఆరబెట్టడానికి స్పిన్ వేగాన్ని ఎక్కువ చేస్తుంది.ఎఐ ఈకోబబుల్™ అనేది వినియోగదారు ప్రవర్తనను తెలుసు కునేది,అత్యంత ప్రాధాన్యమైన వాష్-సైకిల్ ని సూచించేది, అనేక ఆప్షన్ల ద్వారా సతమతం అయ్యే అవసరం లేకుండా చేస్తూ సులువైన వాడుకను కలుగజేసేది
అయిన, ఇండియా మొట్టమొదటి వాషింగ్ మెషీన్. వినియోగదారులకు నిరంతరాయ మైన అనుసంధానిత జీవన అనుభవాన్ని ఇవ్వడానికి గాను ఈ చక్కని (స్మార్ట్) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సక్రియమైన వాషింగ్ మెషీన్ శ్రేణిని గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు, శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు,ఫ్యామిలీ హబ్ రెఫ్రిజిరేటర్ల వంటి శామ్‌సంగ్ స్మార్ట్
ఉపకరణాలు అదే విధంగా అలెక్సా,గూగుల్ హోమ్ వంటి వాయిస్ ఉపకరణాలతో కనెక్ట్ చేయవచ్చు.

శామ్‌సంగ్ స్మార్ట్‌థింగ్స్ యాప్ తో కనెక్ట్ చేసినప్పుడు, ఎఐ ఈకోబబుల్,వాషింగ్ మెషీన్లు 2.8 మిలియన్ పెద్ద డేటా పాయింట్ల ఆధారంగా అత్యుత్తమ వాష్ ఆప్షన్లను అందిస్తాయి. లాండ్రీ అనుభవాన్ని మరింత సమర్థవంతంగా,సులువుగా చేయడానికి గాను, వాడుకదారుచే ఇవ్వబడిన రంగు, వస్త్రం రకం,మురికి ,స్థాయి వంటిసమాచారం ఆధారంగా, ఏ విడత బాగుంటుందో అని ఊహించుకునే అవసరాన్ని తప్పిస్తూ అనుకూలమైన ఉతుకు విడతల కోసం లాండ్రీ రిసైప్ ఆటోమేటిక్ సిఫార్సులను ఇస్తుండగా వాడుకదారులు తమ లాండ్రీ, ముగింపు సమయాన్ని షెడ్యూలు చేసుకోవ డానికి లాండ్రీ ప్లానర్ వీలు కలిగిస్తుంది. ముగింపు సమయాన్ని ఆలస్యం చేయడంలో
గోయింగ్ ఔట్ మోడ్ సహాయపడుతుంది,దుస్తుల్ని వాషర్ లో ఎక్కువ సేపు వదిలేయ కుండా నివారిస్తుంది.

అదనంగా, కలుగబోయే సమస్యల గురించి హోమ్ కేర్ విజార్డ్ ముందస్తుగా వాడుకదారుల్ని అప్రమత్తం చేస్తుంది,త్వరిత పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.
“వినియోగదారు సౌకర్యత అనేది మా అధునాతన వ్యూహములో అగ్రభాగాన ఉంటుంది,వారి జీవితాలను సరళతరం చేసే స్మార్ట్ గృహోపకరణాలను వారికి అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎఐ-సక్రియమైన మా కొత్త
ద్వి-భాషా వాషింగ్ మెషీన్ శ్రేణి, వినియోగదారులకు మెషీన్ లెర్నింగ్ లో సులువైన, తెలివైన,వ్యక్తిగత లాండ్రీ పరిష్కారాలను అందించడానికి ఆధునికతలను సమకూర్చుకొని ఉన్న ఒక ఘనమైన నవ్యతా ఆవిష్కరణ. ఈ కొత్త రేంజ్ తదుపరి వినియోగదారుల జీవనశైలిని పెంపొందిస్తుందని,దేశవ్యాప్తంగా బలంగా స్వీకరించబడుతుందని మేము స్థిరంగా విశ్వసిస్తున్నాము,” అన్నారు, శామ్‌సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ గారు.

వాషింగ్ మెషీన్ల 2022 శ్రేణి, శామ్‌సంగ్ , స్వంతమైన ఈకోబబుల్,క్విక్‌డ్రైవ్™ టెక్నాలజీతో వస్తుంది,అది 45% అదనపు వస్త్రసంరక్షణను అందిస్తూ టైమ్, విద్యుత్తును ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది.శుభ్రత,పరిశుభ్రత,ఉన్నత ప్రమాణాలను నిర్ధారిస్తూ, ఈ సరికొత్త మోడళ్ళు, పాతుకుపోయిన మురికి,99.9% బ్యాక్టీరియా,అలర్జెన్లను తొలగించే సామర్థ్యం గల హైజీన్ స్టీమ్ టెక్నాలజీతో వస్తాయి.

ధర, లభ్యత, ఆఫర్లు ,వ్యారెంటీ

వాషింగ్ మెషీన్ల ఈ కొత్త శ్రేణి ఇండియాలోని రిటైల్ భాగస్వాములు అందరి వద్ద, శామ్‌సంగ్ ,అధీకృత ఆన్‌లైన్ స్టోర్ అయిన శామ్‌సంగ్ షాప్, అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ అన్నింటి వ్యాప్తంగా 2022 మే 10 వ తేదీ నుండి ప్రారంభ ధర రు. 41,600 లతో అందుబాటులో ఉంటుంది.

వినియోగదారులు ఎఐ ఈకోబబుల్™ వాషింగ్ మెషీన్లపై 3-సంవత్సరాల వ్యారెంటీని పొందుతారు.

2022 మే 10 వ తేదీ నుండి జూన్ 10 వరకు నడిచే ‘బిగ్ లాండ్రీ ఆఫర్’ క్రింద, 7 కేజీ 8 కెజి,9 కేజీల సామర్థ్యం గల శామ్‌సంగ్ ఎఐ ఈకోబబుల్,వాషింగ్ మెషీన్లను కొనుగోలు చేసే వినియోగదారులు 25% వరకూ తగ్గింపును పొందవచ్చు. వినియోగదారులు 8 కెజి,9 కేజీల మోడళ్ళపై 17.5% వరకూ,7 కేజీ మోడళ్ళపై 12.5% వరకూ అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. కొత్త వాషింగ్ మెషీన్ శ్రేణిని కొనుగోలు చేసే వినియోగ దారులు నో కాస్ట్ ఇఎంఐ,తక్కువంటే తక్కువ కనీసం రు.990 లతో మొదలయ్యే ఇఎంఐ వంటి సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

శామ్‌సంగ్ ,కృత్రిమ మేధ శక్తి పొందిన వాషింగ్ మెషీన్ల ఫీచర్లు

కృత్రిమ మేధ కంట్రోల్

అనుసంధానిత,నిరంతరాయ లాండ్రీ అనుభూతిని నిర్ధారించడానికై, సౌకర్యవం తమైన, తెలివైన కృత్రిమ మేధచే శక్తి పొందిన అధునాతన లాండ్రీ పరిష్కారాలను సృష్టించడం ద్వారా శామ్‌సంగ్, నవ్యతను ఆవిష్కరించడం కొనసాగిస్తుంది. లాండ్రీని సులభంగా,మరింత సమర్థవంతంగా చేసుకునేలా చేయడానికి ఎఐ
కంట్రోల్స్, లాండ్రీ రిసైప్, లాండ్రీ ప్లానింగ్, హోమ్‌కేర్ విజార్డ్ వంటి స్మార్ట్ పరిష్కారాలు, లొకేషన్-ఆధరిత సిఫారసుల్ని అందిస్తాయి.

ఎఐ ప్యాటర్న్ మీ లాండ్రీ అలవాట్లను తెలుసుకుంటుంది, జ్ఞాపకం ఉంచుకుంటుంది ,అత్యంత సముచితమైన విడతలను సలహా ఇస్తుంది. మెరుగైన లాండ్రీ అనుభవాన్ని ఇవ్వడానికి గాను మీ అవసరాలు, జీవనశైలికి తగ్గట్టుగా విడతలు వ్యక్తిగతంగా,అనుకూలంగా ఉండేలా అది చూసుకుంటుంది. సర్వీస్ సెంటరుకు కాల్ చేయాల్సిన లేదా మాన్యువల్ తిరగేయాల్సిన అవసరం లేకుండా లోపాలను సరిదిద్ద డానికి కూడా అది సహాయపడుతుంది. కచ్చితమైన డ్రయ్యింగ్ కోర్సును ఎంపిక చేసుకోవడానికి ఆటో సైకిల్ లింక్ డ్రయ్యరుతో కమ్యూనికేట్ చేసుకుంటుంది.

ఎఐ వాష్

లాండ్రీ,బరువు,మురికి స్థాయిని గ్రహించడానికి గాను ఎఐ వాష్ 4 రకాల సెన్సార్లను ఉపయోగిస్తుంది,నీరు,డిటర్జెంట్,పరిమాణము,ఉతికే సమయాన్ని అనుకూలపరు స్తుంది.

ఎయిర్ వాష్ టెక్నాలజీ

ఎయిర్ వాష్ టెక్నాలజీ నీరు,డిటర్జెంట్ లేకుండా దుస్తుల్ని పరిశుభ్రతతో కూడిన తాజాదనముతో ఉంచుతుంది. ఎయిర్ వాష్ టెక్నాలజీ డియోడరైజ్ చేస్తుంది ,99.9% బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది. కేవలం వేడి గాలిని ఉపయోగించి అనాహ్లాదకరమైన వాసనలు అదేవిధంగా బ్యాక్టీరియా తొలగించబడతాయి.ఇది నీటిని ఉపయోగించుకోని కారణంగా,దుస్తులు ఆరబెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి ఎక్కువ కాలం మన్నుతా యి ,అవి డ్రై-క్లీన్ చేయబడినట్లు కనిపిస్తాయి.

ఎఐ ఈకోబబుల్

శామ్‌సంగ్,ఈకోబబుల్™ టెక్నాలజీ నీటిలోనికి డిటర్జెంటును కరిగించే ఒక బబుల్ జనరేటరును ఉపయోగించుకుంటుంది ఆ తర్వాత గాలిని ఇంజెక్ట్ చేసి, 40 రెట్లు వేగంగా పెనవేసుకుపోయే సమృద్ధమైన సబ్బు నురగ కుషన్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ యాంత్రిక చర్యలు,ఒక బబుల్ కుషన్ తో, ఈ టెక్నాలజీ 45% అదనపు వస్త్ర
సంరక్షణను అందిస్తుంది. మృదువైన,సజావైన బబుల్ చర్య, బయట వేసుకునే దుస్తులు,నీటిని పీల్చుకోనటువంటి సున్నితమైన దుస్తులను సంరక్షిస్తుంది. డిటర్జెంటు సరిగ్గా నీటిలో కరిగిపోయి దుస్తుల లోనికి వేగంగా కలిసిపోయేందుకు దారితీసేలా ఈకోబబుల్, నిర్ధారిస్తుంది. సూపర్ ఈకో వాష్ ప్రోగ్రాము 40°C వాష్
ఫలితముతో కేవలం 30% విద్యుత్తును మాత్రమే ఉపయోగించుకొని దాని ఫలితముగా కేవలం 15°C వద్దనే వాష్ చేస్తుంది.

సూపర్ స్పీడ్ సైకిల్

ఒక ఫుల్ లోడ్ దుస్తుల్ని కేవలం 59 నిముషాల్లోనే వాష్ చేయడానికి సూపర్ స్పీడ్ సైకిల్ ఫీచరుని ఉపయోగించుకోవచ్చు. ఈకోబబుల్, టెక్నాలజీ అనేది వేగవంతమైన పిచికారీని ఉపయోగించుకొని పులిమే సమయాన్ని తగ్గిస్తూనే శక్తివంతమైన శుభ్రతను నిర్ధారిస్తుంది. ఇది దుస్తుల్ని త్వరగా త్రిప్పి-ఆరబెట్టడానికి గాను స్పిన్ వేగాన్ని కూడా వేగవంతం చేస్తుంది.

క్విక్‌డ్రైవ్

వాషింగ్ పనితీరు,సమస్త కొత్త స్థాయిల్ని అందించడానికి ఈ క్విక్‌డ్రైవ్, రూపొందించ బడింది. ఈ టెక్నాలజీ లాండ్రీ విడతల్ని విపరీతంగా వేగవంతం చేయడం మాత్రమే కాకుండా, ఆ ప్రక్రియను మరింత సులభతరంగా,మరింత విద్యుత్-ప్రభావవంతంగా చేస్తుంది. ప్రతిసారీ మీ దుస్తుల్ని త్వరగా ,సమర్థవంతంగా వాష్ చేయడానికి
గాను అధునాతనమైన ఫ్యాబ్రిక్ కేర్ డ్రమ్ము ఒక విశిష్టమైన క్రియాత్మక చర్యను సృష్టించే పల్సులేటరుతో సమృద్ధమై ఉంది. ఇప్పుడు మీరు వాష్ చేయడానికి తక్కువ సమయం,దుస్తులు ధరించడానికి ఎక్కువ సమయం గడపవచ్చు. ఉదాహరణకు, 5 కేజీ లోడ్‌తో సూపర్‌స్పీడ్ సైకిల్ ఉపయోగించి, క్విక్‌డ్రైవ్,టెక్నాలజీ కేవలం 39 నిముషాల్లోనే పూర్తి శుభ్రతను సాధించగలుగుతుంది.

ఆటో డిస్పెన్స్

తక్కువ సమయం, తక్కువ శ్రమతో దుస్తుల్ని పూర్తిగా వాష్ చేయడానికి ఆటో డిస్పెన్స్ మీకు వీలు కలిగిస్తుంది. అది ప్రతి లోడుకూ 26% డిటర్జెంట్,46% సాఫ్టనర్‌ ని ఆదా చేసుకుంటూ తగినంత డిటర్జెంట్,సాఫ్టనర్‌, పరిమాణమును ఆటోమేటిక్ గా విడుదల చేస్తుంది. సులభంగా రీఫిల్ చేయగల డిటాచబుల్ ట్యాంకు సుమారు 1 నెల వరకూ వాషింగ్ కోసం తగినంత డిటర్జెంట్ ని నిలిపి ఉంచుకోగలదు.

ఆడ్‌వాష్

ఆడ్‌వాష్ అనేది, వాష్ విడత ప్రారంభమైన తర్వాత అదనపు వస్తువులు లేదా డిటర్జెంట్ ని జోడించడానికి వాడుకదారుకు వీలు కలిగిస్తుంది. ఒక విడత సందర్భంగా ఏ సమయములోనైనా మీరు మరచిపోయిన వస్తువులు,అదనపు సాఫ్టనర్,పులిమే-మాత్రమే వస్తువుల్ని జోడించవచ్చు.

హైజీన్ స్టీమ్

డ్రమ్ము,అడుగుభాగం నుండి ఆవిరిని విడుదల చేయడం,లాండ్రీని సంపూర్ణంగా సంతృప్తీకరణ చేయడం ద్వారా హైజీన్ స్టీమ్ దుస్తుల్ని లోతంటా శుభ్రం చేస్తుంది. హైజీన్ స్టీమ్ పాతుకుపోయిన మురికిని తొలగిస్తుంది,99.9% బ్యాక్టీరియా , అలర్జెన్లను తొలగిస్తుంది. హైజీన్ స్టీమ్ సైకిల్ లో, మొదట నీళ్ళు,మురికి,డిటర్జెంట్ బయటికి వెళ్ళిపోతాయి. రెండవదిగా, ఆవిరిగా చేయడానికి గాను అది స్వల్ప పరిమాణములో శుభ్రమైన నీటిని తీసుకుంటుంది. ఆ తర్వాత అంతర్నిర్మితమైన హీటర్ నీటిని 20 నిముషాల పాటు మరిగిస్తుంది. ఆవిరి దశ తర్వాత, అది నీటిని బయటికి పంపిస్తుంది ,దుస్తుల్ని పులమడం మొదలుపెడుతుంది,చివరగా విడతను పూర్తి చేయడానికి గాను తర్వాతి వాషింగ్ ప్రక్రియకు ముందుకు వెళుతుంది.

డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ

ప్రశాంతమైన,మరింత శక్తివంతమైన పనితీరు కోసం డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ (DIT) బలమైన అయస్కాంతాలను వినియోగించుకుంటుంది, ఐతే బ్రష్‌తో ఉండే యూనివర్సల్ మోటారుతో పోలిస్తే తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటుంది. అది చిరిగిపోయే బ్రష్షులను ఉపయోగించుకోదు,ఉన్నత-నాణ్యత గల కాంపొనెంట్లు
,అద్భుతమైన మెకానికల్ ఇంజనీరింగ్ ఉపయోగించి నిర్మించబడింది. ఇది మీ వాషింగ్ మెషీన్ కి సుదీర్ఘ జీవితకాల భరోసాను అందించే 10-సంవత్సరాల వ్యారెంటీ ని కలిగి ఉంది.

డ్రమ్ క్లీన్/ డ్రమ్ క్లీన్ +

ఎటువంటి రసాయనాలనూ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మురికి ,బ్యాక్టీరియాను మీ వాషర్ నుండి బయటికి పంపివేయడానికి డ్రమ్ క్లీన్ వీలు కలిగిస్తుంది. అది వాషర్ లోపలి నుండి 99.9% బ్యాక్టీరియాను తొలగిస్తుంది,రబ్బర్ గ్యాస్కెట్ నుండి మురికిని తొలగిస్తుంది. డ్రమ్ క్లీన్ + సైకిల్,ఇంటర్‌టెక్ చేత టెస్టింగ్ పై ఆధారితమైనది. శుభ్రం చేయడం అవసరమైనప్పుడున్ వాషింగ్ మెషీన్ ఆటోమే టిక్ గా ఆ విషయాన్ని వాడుకదారుకు నోటిఫై చేస్తుంది.

స్టే క్లీన్ డ్రాయర్

ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన వాటర్ ఫ్లషింగ్ సిస్టమ్ తో డిటర్జెంట్,ఎక్కువ భాగం వాష్ అయిపోయేలా స్టే క్లీన్ డ్రాయర్ చూసుకుంటుంది. కాబట్టి, మిగిలిపోయిన డిటర్జెంట్ లేదా సాఫ్టనర్ అంతా పూర్తిగా ఉపయోగించుకోబడుతుంది,ట్రే శుభ్రంగా ,మరింత స్వచ్ఛంగా ఉండిపోతుంది.

బబుల్ సోక్

బబుల్ సోక్ ఫంక్షన్ ఒకే ఒక్క టచ్‌తో వివిధ రకాల మరకల్ని సులువుగా, సమర్థవం తంగా తొలగిస్తుంది. ఈ చురుకైన బబుల్ ఫంక్షన్ రక్తం, టీ, వైన్, మేకప్,గడ్డి వంటి వివిధ రకాల మొండి మరకల్ని తొలగించుటలో సహాయపడుతుంది.