Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆమ్ లైన్ న్యూస్,ఇండియా,మే 5,2022 ః భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ బ్రాండ్‌ లలో ఒకటైన  శాంసంగ్‌,తమ ప్రీమియం, అత్యంత శక్తివంతమైన,సహజసిద్ధమైన శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ శ్రేణిని విడుదల చేసింది. ఇది అత్యుత్తమమైన, సమగ్రమైన హోమ్‌ క్లీనింగ్‌ పరిష్కారాలను భారతదేశంలోని వినియోగదారులకు అందిస్తుంది. వాక్యూమ్ క్లీనర్‌ల లైనప్ Samsung అధికారిక ఆన్‌లైన్ స్టోర్, Samsung షాప్‌లో మే 4, 2022 నుండి,త్వరలో Flipkartలో అందుబాటులో ఉంటుంది..

ఈ ఆవిష్కరణతో శాంసంగ్‌ ఇప్పుడు భారతదేశంలో వాక్యూమ్‌ క్లీనర్‌ విభాగంలో ప్రవేశించినట్లవుతుంది. ఈ శ్రేణి వాక్యూమ్‌ క్లీనర్లు పరిశ్రమలో అత్యుత్తమమైర రీతిలో 200వాట్‌ వరకూ సక్షన్‌ పవర్‌ కలిగి ఉన్నాయి. తేలిగ్గా ఉండటంతో పాటుగా అత్యంత ఆకర్షణీయంగా డిజైన్‌ చేయబడిన, ప్రీమియం శ్రేణి వాక్యూమ్‌ క్లీనర్లు శక్తివంతమైన, సౌకర్యవంతమైన క్లీనింగ్‌ అనుభవాల కోసం వినియోగదారులకు ఏకీకృత పరిష్కారంగా నిలుస్తుంది.

ఈ శ్రేణి జెట్‌ సైక్లోన్‌ సిస్టమ్‌తో వస్తుంది. దీనిలో 9 సైక్లోన్స్‌ 27 ఎయిర్‌ ఇన్‌లెట్స్‌తో వస్తుంది. ఇది అత్యంత సురక్షితంగా ఫైన్‌ డస్ట్‌ పార్టికల్స్‌ను వాక్యూమ్‌ క్లీనర్‌లోకి  సక్షన్‌ శక్తి ఏ మాత్రం రాజీపడకుండా  గుంజుకుంటుంది. శాంసంగ్‌ జెట్‌  కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్లు  స్వచ్ఛమైన గాలిని మల్టీ లేయర్డ్‌ ఫిలే్ట్రషన్‌ వ్యవస్ధతో విడుదల చేస్తుంది.  ఇది 99.999% ఫైన్‌ డస్ట్‌ పార్టికల్స్‌,అలెర్జీన్స్‌ను ఒడిసిపడుతుంది. దీనిని బ్రిటీష్‌ అలెర్జీ ఫౌండేషన్‌,ఎస్‌ఎల్‌జీ  ఫ్రుఫ్ , జెట్రిఫిజియురంగ్స్‌ ధృవీకరించాయి.

విస్తృత స్థాయి డిజిటల్‌ ఇన్వర్టర్‌ మోటార్‌ పై నడుపబడే ఈ వాక్యూమ్‌ క్లీనర్లు, గాలి ప్రవాహాన్ని తమ అలా్ట్రసోనిక్‌ వెల్డెడ్‌ ఎయిర్‌ ఫాయిల్‌ బ్లేడ్స్‌తో అత్యున్నత శక్తి సామర్ధ్యం కోసం ఆప్టిమైజ్‌ చేస్తుంది. శాంసంగ్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ జెట్‌ 70,  జెట్‌ 75  ,జెట్‌ 90– లు అత్యున్నత వేగం మరియు మెరుగైన క్లీనింగ్‌ను వినియోగదారులకు అందిస్తామనే వాగ్ధానంతో అందిస్తుంది.

‘‘మహమ్మారి అనంతర ప్రపంచంలో భద్రత,  ఆరోగ్యం, పరిశుభ్రతపై అధికంగా దృష్టి సారించిన వినియోగదారులు చురుకైన, సమర్థవంతమైన క్లీనింగ్‌ పరిష్కారాల కోసం చూస్తున్నారు. మా పూర్తి నూతన శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ సాటిలేని సౌకర్యాన్ని మా వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి ఫీచర్లతో సౌకర్యవంతమైన క్లీనింగ్‌ అనుభవాలను అందిస్తాయి. విప్లవాత్మక సాంకేతికతలు అయినటువంటి మల్టీ లేయర్డ్‌ ఫిలే్ట్రషన్‌ వ్యవస్థ కలిగిన  ఈ వాక్యూమ్‌ క్లీనర్లు   99.999% డస్ట్‌,అలెర్జిన్స్‌ను ఒడిసిపట్టడంతో పాటుగా శక్తివంతమైన,పరిశుభ్రత క్లీనింగ్‌ ను అందిస్తాయి. శాంసంగ్‌ జెట్‌ యొక్క ప్రతిష్టాత్మక  శక్తివంతమైన సక్షన్‌ సామర్ధ్యాలు కలిగినప్పటికీ దీని  బాడీ ను అతి తేలికగా ఉండేలా తీర్చిదిద్దారు. ఇది మా వినియోగదారులు జెట్‌ అతి సులభంగా వినియోగించతగిన ఫీచర్లను మరింత సౌకర్యవంతంగా ఆస్వాదించవచ్చు’’అని మోహన్‌దీప్‌ సింగ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ బిజినెస్‌, శాంసంగ్‌ ఇండియా అన్నారు.

ధర, లభ్యత, ఆఫర్‌, వారెంటీ

పూర్తి సరికొత్త శ్రేణి శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ మూడు మోడల్స్‌ – జెట్‌ 70, జెట్‌ 75, జెట్‌90లో లభ్యమవుతాయి. వీటి ధరలు 36,990 రూపాయల నుంచి 52,990 రూపాయల శ్రేణిలో ఉంటాయి. ఈ మోడల్‌లు Samsung అధికారిక ఆన్‌లైన్ స్టోర్ Samsung షాప్‌లో మే 04, 2022 నుండి, త్వరలో Flipkartలో అందుబాటులో ఉంటాయి.

మే 04 నుంచి మే 09,2022 వరకూ పరిమిత కాలం పాటు వినియోగదారులు శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ కొనుగోలు చేసిన ఎడల 12 నెలల వరకూ నో కాస్ట్‌ ఈఎంఐను 2,799 రూపాయల  ప్రారంభ ధరతో పొందవచ్చు. శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ పై ఒక సంవత్సరం వారెంటీ లభిస్తుంది.

శక్తివంతమైన క్లీనింగ్‌ సొల్యూషన్‌

శాంసంగ్‌ జెట్‌ యొక్క పరిశ్రమలో అగ్రగామి సామర్ధ్యాలు దీని,డిజిటల్‌ ఇన్వర్టర్‌ మోటర్‌ , జెట్‌ సైక్లోన్‌ వ్యవస్ధతో సాధ్యమవుతాయి. ఈ డిజిటల్‌ ఇన్వర్టర్‌ మోటర్‌ ,  అలా్ట్రసోనిక్‌ వెడెడ్‌ కవర్‌ ,డిఫ్యూజర్‌ను కలిగి  ఉంటుంది. ఇది ఎయిర్‌ఫ్లోను ఆప్లిమైజ్‌ చేస్తుంది. ఇది శాంసంగ్‌ జెట్‌ అత్యున్నత స్ధాయి శక్తి సామర్ధ్యంను గణనీయమైన స్ధాయి సక్షన్‌ శక్తితో ఉత్పత్తి చేస్తుంది.

శాంసంగ్‌  జెట్‌ , అత్యున్నత సామర్ధ్యం కలిగిన  బ్యాటరీతో సుదీర్ఘమైన క్లీనింగ్‌ సమయాన్ని వినియోగదారులు ఆస్వాదించవచ్చు. సుదీర్ఘకాలం నిలిచి ఉండే బ్యాటరీ వినియోగదారుల అవసరాలను ఆధారపడతగిన వాక్యూమ్‌ క్లీనర్‌తో తీరుస్తుంది. ఇది ఓ గంట వరకూ సక్షన్‌ను ఏకధాటిగా నిర్వహిస్తుంది. దీని బ్యాటరీని అతి సులభంగా  తొలగించడంతో పాటుగా స్పేర్‌ బ్యాటరీని సులభంగా అమర్చవచ్చు. అవసరమైన పక్షంలో రెండు గంటల పాటు ఏకధాటిగా వినియోగదారులు క్లీనింగ్‌ను అదనపు బ్యాటరీతో చేయవచ్చు.

వైవిధ్యమైన క్లీనింగ్‌ అవకాశాలు

శాంసంగ్‌ జెట్‌ ,   అత్యున్నత సామర్ధ్యం కలిగిన మోటరైజ్డ్‌ బ్రష్‌లతో వస్తాయి. ఇవి పలు క్లీనింగ్‌ పరిష్కారాలను అందించడంతో పాటుగా వైవిధ్యమైన వినియోగదారుల జీవనశైలి, క్లీనింగ్‌ అలవాట్లు , ఫ్లోర్‌ తరహా కు మ్యాచ్‌ అయ్యే శుభ్రతా పరిష్కారాలను అందిస్తుంది.

సాఫ్ట్‌ యాక్షన్‌ బ్రష్‌ , కఠినమైన నేలపై ఫైన్‌ డస్ట్‌ శుభ్రపరిచేందుకు గరిష్ట పరిష్కారాలను అందిస్తుంది. టర్బో యాక్షన్‌ బ్రష్‌, కార్సెట్లను ,రగ్గులను దాదాపు నిమిషానికి 3750 సార్లు రొటేట్‌ కావడం ద్వారా శుభ్రపరుస్తుంది. దీని 180 డిగ్రీ స్వివెల్‌ హెడ్‌ అతి సులభంగా డైరెక్షన్‌ మార్చుకోవడంతో పాటుగా ప్రతి మూలనూ శుభ్రపరుస్తుంది. మినీ టర్బో బ్రష్‌ డస్ట్‌ పార్టికల్స్‌,సోఫాలు, మంచాలు, పరుపుల నుంచి పెట్‌  హెయిర్‌ తొలగించడం చేస్తుంది. స్పిన్నింగ్‌ స్వీపర్‌,డిస్పోజబల్‌ వెట్‌ క్లాత్‌తో  వస్తుంది. ఇది ఏకధాటిగా 80 నిమిషాల పాటు  క్లీన్‌ చేసేందుకు అనుమతిస్తుంది. మల్టీ సైక్లోన్‌ వ్యవస్థతో సహా మొత్తం డస్ట్‌బిన్‌, పూర్తిగా  వాషబల్‌ కావడంతో పాటుగా దీనికి ఆరోగ్యవంతమైన శుభ్రతను అందిస్తుంది.

ఆరోగ్యవంతమైన అలవాట్ల కోసం పరిశుభ్రతా ఫీచర్లు

శాంసంగ్‌ జెట్‌ యొక్క అత్యున్నత శ్రేణి మల్టీ లేయర్డ్‌ ఫిలే్ట్రషన్‌ వ్యవస్ధ, శాంసంగ్‌ యొక్క నిబద్ధతను ప్రతిబింబించడంతో పాటుగా తమ వినియోగదారుల భద్రత మరియు ఆరోగ్యంకు భరోసా అందిస్తుంది. బ్రిటీష్‌ అలెర్జీ ఫౌండేషన్‌ మరియు ఎస్‌ఎల్‌జీ ఫ్రుఫ్‌ అండ్‌ జెట్రిజియురింగ్స్‌ ధృవీకరించాయి. దీనిలోని అత్యున్నత పనితీరు కలిగిన ఫిల్టర్‌  99.999% ఫైన్‌ డస్ట్‌ పార్టికల్స్‌, అలెర్జిన్స్‌ను ఒడిసిపడుతుంది. ఇది సాధారణంగా వాక్యూమ్‌ ఎగ్జాస్ట్‌ ద్వారా గాలిలోకి తిరిగి తప్పించుకుని, శుభ్రమైన ఇండోర్‌ వాతావరణాన్ని అందిస్తుంది.

శాంసంగ్‌ జెట్‌ యొక్క వాషబల్‌ డస్ట్‌బిన్‌,ఒన్‌ కి ్లక్‌ డిటాచబల్‌ డ్రమ్స్‌,  పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన మెయిన్‌టెనెన్స్‌కు ముఖ్య లక్షణాలు. ఎందుకంటే వీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా కడుక్కోవచ్చు. ఈ డస్బ్‌బిన్‌ను సౌకర్యవంతంగా తొలగించవచ్చు. అందువల్ల వినియోగదారులు డస్ట్‌ను బయట పారబోసి, పూర్తిగా శుభ్రపరుచుకోవచ్చు. అంతర్గత రోటేటింగ్‌ డ్రమ్‌, వాక్యూమ్‌ క్లీనర్‌ హెడ్‌పై ఉంది. దీనిని ఒక్క క్లిక్‌తో విడదీయవచ్చు. అంటే దీనర్ధం దీనిని ప్రత్యేకంగా శుభ్రపరచవచ్చు.

అప్రయత్నంగా మరియు అనుకూలమైన డిజైన్‌

శాంసంగ్‌ జెట్‌ లో పలు ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని డిజైన్‌ అంశాలు, క్లీనింగ్‌ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. ఉదాహరణకు, ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ డిస్‌ప్లే మెషీన్‌ ,హోదాను ప్రదర్శిస్తుంది.అంటే పవర్‌లెవల్‌, బ్రష్‌ తరహా ప్రదర్శిస్తుంది. ఒకవేళ బ్రష్‌ బార్‌ సమస్య లేదా బ్లాకేజస్‌ ఉంటే ఇది వినియోగదారులను ఆప్రమప్తం చేస్తుంది.

శాంసంగ్‌ జెట్‌ ,  2 ఇన్‌ 1 చార్జింగ్‌ స్టేషన్‌ను ఎలాంటి ఇంటి జీవనశైలికి అయినా అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఇది వినియోగదారులు తమ వాక్యూమ్‌ క్లీనర్స్‌ను మరింత సౌకర్యవంతంగా నిల్వ చేసుకుని , చార్జ్‌ చేసుకునేందుకు అనుమతిస్తుంది. చార్జింగ్‌ స్టేషన్‌ ఇప్పుడు వాల్‌ మౌంటెడ్‌గా ఉంది. తమ ఇంటిలో స్పేస్‌ను ఆదా చేసుకోవాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. మరింత సౌకర్యవంతమైన స్టోరేజీ కోసం దీనిని స్టాండలోన్‌ చార్జర్‌గా  కూడా వాడవచ్చు. ఈ వాల్‌ మౌంటింగ్‌ యాక్ససరీ రెండు మోడల్స్‌ –జెట్‌ 70 మరియు జెట్‌ 75 లో లభ్యమవుతుంది.

జెట్‌ 90తోవినియోగదారులు స్టాండింగ్‌ చార్జర్‌ జెడ్‌ స్టేషన్‌ పొందవచ్చు. ఇది వినియోగదారులు అతి సులభంగా తమ వాక్యూమ్‌ క్లీనర్‌ను ఉంచేందుకు దోహదపడుతుంది. జెడ్‌ స్టేషన్‌ ఒకేసారి రెండు బ్యాటరీలను కేవలం 3.5 గంటలలో చార్జ్‌ చేస్తుంది. జెట్‌ 90 ఒక గంట పాటు నడుస్తుంది. అత్యంత వేగవంతమైన చార్జింగ్‌, సుదీర్ఘమైన క్లీనింగ్‌ సమయాన్ని అందిస్తుంది.

శాంసంగ్‌ జెట్‌ , లైట్‌ వెయిట్‌ డిజైన్‌ , గరిష్ట వైవిధ్యతక  భరోసా అందిస్తుంది. వినియోగదారుల మణికట్టుపె  భారం వేయనివ్వని ఈ హ్యాండ్‌ హెల్డ్‌ బాడీ జెట్‌ 70 కోసం 1.48కేజీలు, జెట్‌ 75 కోసం1.6 6 కేజీలు, జెట్‌ 90 కోసం 1.89 కేజీలు ఉంటుంది.

పర్యావరణ అనుకూలమైన ప్యాకేజింగ్‌

శాంసంగ్‌ జెట్‌ కార్డ్‌లెస్‌ స్టిక్‌ వాక్యూమ్‌ క్లీనర్లు పూర్తి పర్యావరణ అనుకూలమై న పేపర్‌, బయో బేస్డ్‌ ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌తో వస్తున్నాయి. పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ను ఫారెస్ట్‌ స్టీవార్డ్‌ఫిప్‌ కౌన్సిల్‌ ధృవీకరించింది. ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌లో 25%కు పైగా పర్యావరణ అనుకూల బయోమాస్‌ కలిగి ఉండి కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తుంది.