గెలాక్సీ S22 అల్ట్రాతో శామ్‌సంగ్ ఇండియా రికార్డును సృష్టిస్తోంది, మార్చ్ నెలలో 74% మార్కెట్ వాటాతో ఆధిపత్యం వహిస్తోంది

Business Electrical news Featured Posts Life Style National Technology Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మే 10,2022: కౌంటర్‌పా యింట్ రీసర్చ్ ప్రకారము శామ్‌సంగ్,అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ – గెలాక్సీ S22 అల్ట్రా,మార్చి 2022 లో రు. 100,000+ కేటగరీలో 74% వాల్యూమ్ మార్కెట్ వాటాతో అత్యున్నత స్థానానికి దూసుకువెళ్ళింది. మార్చి 2022 లో రు. 100,000+ కేటగరీలో శామ్‌సంగ్,మొత్తమ్మీద మార్కెట్ వాటా 81% గా ఉండింది, ఇండియాలో గెలాక్సీ S22 అల్ట్రా , భారీ ప్రజాదరణ, విజయం పట్ల ధన్యవాదాలు.

“గెలాక్సీ S22 సీరీస్ ఇండియాలో గొప్పగా ప్రారంభమయింది, ప్రత్యేకించి గెలాక్సీ S22 అల్ట్రా కోసం అది S-సీరీస్ తో నోట్ ఫీచర్లను కలుపుకొని ముందుకు వచ్చింది. దీని ఫలితంగా, మునుపటి S సీరీస్ వినియోగదారుల,ధృఢమైన వ్యవస్థాపిత పునాదిచే మాత్రమే కాకుండా నోట్ వినియోగదారుల నుండి కూడా డిమాండ్ ఎంతో ఎక్కువగా పెరిగింది. రెండవ త్రైమాసికంలో కూడా ఘనమైన డిమాండు ఉండబోతుందని మా ఛానల్ పరిశీలనలు సూచిస్తున్నాయి కాబట్టి శామ్‌సంగ్ ఇప్పుడు ప్రీమియం విభాగములో ఒక ఊపును అందుకుంటోంది,” అన్నారు కౌంటర్‌పాయింట్ రీసర్చ్
,రీసర్చ్ డైరెక్టర్ శ్రీ తరుణ్ పాఠక్ గారు.“మా చారిత్రాత్మక గెలాక్సీ S22 అల్ట్రాతో 100K విభాగం కంటే పెద్దదైన 74% వాల్యూమ్ మార్కెట్ వాటా,రికార్డు మైలురాయిని మేము అందుకున్నాము. భారతీయ వినియోగదారుల హృదయాలను గెలుచుకోవడానికి గాను -విస్తరణ (Expansion), అనుభవం (Experience) ,గ్రహింపు (Extraction) పై దృష్టి సారించిన మా ‘3E వ్యూహము’ వల్ల మా విజయం సుసాధ్యమయింది.

వినియోగదారులు మా ఉపకరణాలను మెట్రో నగరాలలో మాత్రమే కాకుండా టయర్ 1,చిన్న పట్టణాలలో కూడా అనుభవించడానికి వీలుగా మేము మా ఫ్లాగ్‌షిప్ రిటైల్
పాదముద్రను పెంచుకున్నాము. ఇంతకు మునుపు ఎప్పుడూ లేని రీతిలో వినియోగ దారులు కొనడానికి వీలుగా మేము శామ్‌సంగ్ అప్‌గ్రేడ్,శామ్‌సంగ్ ఫైనాన్స్+ తో మా వేదికలను సృష్టించాము, అవి మెట్రో నగరాలలో మా ఎదుగుదలను పెంచగా మెట్రో-యేతర నగరాలలో అంతకంటే ఎక్కువ పెంచాయి,” అన్నారు శామ్‌సంగ్ ఇండియా
మొబైల్ బిజినెస్,సీనియర్ డైరెక్టర్,ప్రోడక్ట్ మార్కెటింగ్ అధిపతి శ్రీ ఆదిత్య బబ్బర్ గారు.కౌంటర్‌పాయింట్ రీసర్చ్ ప్రకారము గెలాక్సీ S22 సీరీస్,విజయం, శామ్‌సంగ్ ఇండియా 2022 మార్చి నెలలో ప్రీమియం విభాగము(రు. 30,000+) లో 38% వాల్యూ ము మార్కెట్ వాటాతో నంబర్ 1 స్మార్ట్ ఫోన్ తయారీదారుగా ఉద్భవించడానికి కూడా సహాయపడింది. 2022 మార్చి నెలలో 22% వాల్యూము మార్కెట్ వాటాతో,27%
వాల్యూ మార్కెట్ వాటాతో శామ్‌సంగ్, ఇండియా,నంబర్ 1 స్మార్ట్ ఫోన్ కంపెనీగా ఉంది, అని కౌంటర్‌పాయింట్ రీసర్చ్ వారు జోడించారు.

మార్చి నెలలో శామ్‌సంగ్ తన సమస్త మొబైల్ బిజినెస్ నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడం మాత్రమే కాక,ఇండియాలో స్మార్ట్ వాచ్,టాబ్లెట్ వ్యాపారాలకు కూడా నాయకత్వం వహించింది. సమీకృతపరచబడిన డేటా ప్రకారము, 2022 మార్చి నెలలో శామ్‌సంగ్, స్మార్ట్ వాచ్ మార్కెట్ లో 73% వాల్యూమ్ మార్కెట్ వాటాను
టాబ్లెట్ బిజినెస్ లో 47% వాల్యూమ్ మార్కెట్ వాటాను కలిగి ఉంది.