Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,డిసెంబర్ 13,2021: సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ సంగీత ప్రియులను మరోసారి స్వాగతిస్తుంది. మునపటి సంవత్సరం లో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాల్ని గెలుచుకోవడానికి సిద్ధం అయింది.

ప్రేక్షకుల ఆనందమే తమ సంతోషంగా మార్చుకున్న జీ తెలుగు, ఎప్పుడూ తన అభిమానుల కోసం సరికొత్త షోస్ అందిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటుంది. ఆ బంధాన్ని బలపరుచుకుందామని, స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ మీ ఊరిలోకి తీసుకొస్తున్నారు. మీరు 16 – 35 వయసు వారు అయితే, ఈ డిసెంబర్ 12 విజయనగరం,ఖమ్మం లో ఆడిషన్స్ జరగనున్నాయి. ఎక్కడ అని అనుకుంటారా? క్రింద చూపిన వేదికకు సరైన సమయానికి వచ్చేయండి – ది సింగింగ్ సూపర్ స్టార్ అవడానికి అవకాశం దక్కించుకొండి.

విజయనగరం:హోటల్ వైట్ల రెసిడెన్స్, మయూరి జంక్షన్ ఏరియా, ఘడి ఖానా, బాలాజీ నగర్ డిసెంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు

ఖమ్మం:బడ్జెట్ హోటల్, గాంధీ చౌక్ – గాంధీ విగ్రహం దగ్గర, రామచంద్ర నగర్ కాలనీ, మోతీ నగర్ డిసెంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకుఇంకా ఎందుకు ఆలస్యం, మీలో ప్రతిభ ఉండి, సంగీతం మీ నరనరాల్లో జీర్ణించుకొని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇదే మీకు సువర్ణావకాశం…జీ తెలుగు వారి స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్