జయేశ్‌భాయ్ జోర్‌దార్‌లో కొత్త పాట ఫైర్‌క్రాకర్‌లో రణ్‌వీర్ మనోహరమైన ఐటమ్ బాయ్‌గా మారాడు!

Business Cinema Entertainment Featured Posts Life Style National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,ఏప్రిల్ 22,2022:సూపర్ స్టార్ రణవీర్ సింగ్ యష్ రాజ్ ఫిలింస్ వారి జయేశ్‌భాయ్ జోర్‌దార్‌లో నటిస్తున్నారు. ఇది భారతీయ సినిమా తెరపై అరుదైన హీరో,హీరోయిజాల కొత్త బ్రాండ్‌ను ప్రదర్శించే పెద్ద స్క్రీన్ ఎంటర్‌టైనర్. రణవీర్ మళ్లీ తన రూపాన్న మార్చుకుని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా ఇందులో కనిపిస్తారు. ఆయన తన పదునైన మాటలు,తెలివితేటలతో మనల్ని అలరిస్తూ, మన హృదయాలను గెలుచుకుంటాడు.అలాగే, శక్తివంతమైన సందేశాన్ని కూడా అందిస్తాడు.

కొరియోగ్రఫీ లేకుండానే తన కొత్త పాట ఫైర్‌క్రాకర్ కోసం రణవీర్ ఈ సినిమాలో ఐటెం బాయ్‌గా మారాడు! రణవీర్ మాట్లాడుతూ, “ఫైర్‌క్రాకర్ ఒక ఊపు కలిగించే పాట. దీని గురించి మనీష్ చాలా స్పష్టంగా చెప్పారు. దివ్యాంగ్ కూడా చాలా ఇలాగే స్పష్టంగా చెప్పారు,చూడండి, మీరు ఇప్పుడు మొత్తం పాత్రను ప్రదర్శించారు; మీరు మొత్తం గ్రాఫ్‌ను,పాత్రకు సంబంధించిన ప్రయాణాన్ని పూర్తి చేసారు. ఇప్పుడు పాత్ర మీదే, మీరు దానిని మీ స్వంతం చేసుకున్నారు కాబట్టి మేము దానిని కొరియోగ్రాఫ్ చేయము ! క్యారెక్టర్‌లో జయేశ్‌లాగా మీరు ఫ్రీస్టైల్‌గా ఉన్నారు’’ అని ప్రశంసించారని తెలిపారు.

దీని గురించి మరింత వివరిస్తూ, “హుక్ స్టెప్ మినహా, నేను జయేశ్ డ్యాన్స్ చేసే
విధంగా డ్యాన్స్ చేస్తూ ఉండిపోయాను. పాత్రలో లీనమవడంతో కదలికలు బయటకు
వస్తాయి, నా నుంచి జరిగే పొరపాట్లను నేను నియంత్రించుకున్నాను. దానికి స్వంత
అప్పీల్ ఉంది. జయేశ్ ఒక మనోహరమైన పాత్ర,అతనిలోని ఆ కోణాన్నిఅతను పాటలో ప్రదర్శించాలని,చూపించాలని కోరుకున్నాను. అతను కలిగి ఉన్న గొప్ప జోయి డి వివ్రే, ఈ గొప్ప జీవిత ప్రేమ, ఈ సంతోషకరమైన, ప్రకాశిం చే కృతజ్ఞతతో కూడిన హృదయం’’ అని వివరించారు.ఈ పాట అందరినీ నవ్వించేలా ఉంటుందని రణవీర్ చాలా నమ్మకంతో ఉన్నారు! దాని గురంచి మాట్లాడుతూ, “నేను బాణసంచా కాల్చడం చూస్తున్న వారి సమక్షంలో ఉన్న ప్రతిసారీ, వారు మొదటి నుంచి చివరి వరకు వారి ముఖంపై చిరునవ్వు పులుముకుంటారు; అంటే ఆ పాట ,ఆ పాత్ర,ఆ ప్రదర్శన ఇవ్వడంలో కొంత ఆనందం ఉంది’’ అని అన్నారు.

దీని గురిచం మాట్లాడుతూ, “ఇది ప్రజలను నవ్విస్తుంది,ఇది నాకు చాలా సంతృప్తిని చ్చింది అని హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఇది భూమిపై నా లక్ష్యం, ప్రజలను నవ్వించడమే;నా క్రాఫ్ట్ ద్వారా నేను దానిని చేయగలిగితే, అది నాకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.సమాజంపై ఉల్లాసమైన సెటైర్- మనీష్ శర్మ నిర్మించిన జయేశ్‌భాయ్ జోర్‌దార్‌లో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కూడా నటించారు. ఆమె రణవీర్ సరసన బాలీవుడ్ పెద్ద తెరపైకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వం వహించారు,మే 13, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.