Fri. Apr 19th, 2024
Rangamarthanda_jpg

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి27, 2023: లెజెండరీ డైరెక్టర్ కృష్ణ వంశీ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం “రంగమార్తాండ” అమ్మానాన్నల కథగా చెప్పినప్పటికీ ఈ సినిమాలో ఏదొక సన్నివేశం ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఉంటుంది.

మనిషి పుట్టిన తర్వాత పాత్రలు మారుతుంటాయి.. ఒక కొడుకుగా ఆతర్వాత భర్తగా.. అనంతరం తండ్రిగా నెక్స్ట్ తాతగా ఇలా ఒకదానితర్వాత మరొక పాత్ర పోషించాల్సి వస్తుంది. అలాగే నాటకరంగంలో కూడా వేదిక పైకి వచ్చిన వ్యక్తి తనవంతు పాత్రలను పోషిస్తూ ఉంటాడు.

ఆయా పాత్ర ముగియగానే వేదికనుంచి నిష్క్రమిస్తుంటాడు. నిజజీవితంలో వచ్చే పాత్రల్లో నటించడం చాలా కష్టం. కానీ రియల్ లైఫ్ లో అలాకాదు.. బాధగా అనిపించినా..సంతోషంగా అనిపించినా.. భరించాల్సిందే.. చప్పట్లు.. ఈలలు, ప్రశంసలు ఉండవు.

Rangamarthanda_jpg

పాత్ర అయిపోగానే వెళ్లిపోవాల్సిందే.. కాబట్టి బతికున్నంత కాలం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ హాయిగా జీవించండి. తల్లిదండ్రులే కని(పించే)పెంచే దైవాలు కాబట్టి..వారిని చంటిపిల్లల్లా చూసుకుందాం..ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులే కని(పించే)పెంచే దైవాలు అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది.

ఇదే జీవిత సత్యం..”రంగమార్తాండ” సినిమా సారాంశం. మనిషి తన అవసరాలకు అవకాశాలు సృష్టించుకునే క్రమంలో కొత్త కొత్త అవతారాలు ఎత్తుతాడు. అదే సమయంలో ఎదుటివారిని మోసం చేస్తూ తననుతానే మోసం చేసుకుంటూ చివరికి జనారణ్యంలో ఒంటరిగా మిగిలిపోతాడు.

జగమంత కుటుంబంలో కలిసి ఉండలేక ఒక్కరిగా బతకలేక.. ఏకాకిలా ఉండలేక.. ఉండాలా వద్దా అనే ఊగిసిలాటలో ఉసూరు మంటూ బతుకుతుంటాడు. ఈ ప్రయత్నంలో లేనిదానికోసం పోరాటం చేస్తూ ఉన్నది పోగొట్టుకుంటున్నాడు మనిషి… ”రంగమార్తాండ” సినిమా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు వర్తించే సినిమా..

Director-Krishnavamsi_365

ఈ చిత్రం ప్రశంసలు పొందిన మరాఠీ చిత్రం, నటసామ్రాట్ కు రీమేక్. ఐనాకానీ మన తెలుగు నేటివిటీకి తగినట్లు తీశారు డైరెక్టర్ కృష్ణ వంశీ. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ , లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఈ ఎమోషనల్ ఫ్యామిలీమూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.