మే 3 నుంచి 5వ తేదీ వరకు భగవద్‌ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు

AP News Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మే2,2022: టీటీడీ ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 3 నుంచి 5 వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవా లు జరగనున్నాయి.ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

మే 3వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి అనుగ్రహభాషణంతో అవతార మహోత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం తిరుప‌తికి చెందిన ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగనాథన్‌ శ్రీ రామానుజ వైభవంపై ఉపన్యాసిస్తారు. త‌రువాత తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి రేవ‌తి బృందం చే భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.