Fri. Mar 29th, 2024
RPF_

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 26, 2023: ఆపరేషన్ “రైల్ సురక్ష” : ఈ ఆపరేషన్ కింద, రైల్వే ఆస్తిని కాపాడటం , రైల్వే ఆస్తికి సంబంధించిన నేరంపై ఆర్ పి ఎఫ్ చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఏడాది కాలంలో రైల్వే సొత్తు చోరీకి సంబంధించి 6492 కేసులను ఆర్ పి ఎఫ్ నమోదు చేసింది, ఇందులో చోరీకి కాబడ్డ రైల్వే ఆస్తుల విలువ రూ. 7.37 కోట్లు కాగా 11268 మంది నేరస్తులను అరెస్టు చేయడం జరిగింది

ఆపరేషన్ “రైల్ సురక్ష” ఈ ఆపరేషన్ కింద, రైల్వే ఆస్తిని కాపాడటం వాటి పరిరక్షణ కోసం RPF చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఏడాది కాలంలో RPF రై చోరీకి కాబడ్డ రైల్వే సొత్తుకు సంబంధించి 6492 కేసులను నమోదు చేసి 11268 మంది నేరస్తులను అరెస్టు చేయడంతో 7.37 కోట్లు విలువ ఆస్తలను స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ “ఉపలబ్ద్” కింద టౌట్‌లపై (టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు వాటిని లాభంతో తిరిగి అమ్ముకునే ) వారిపై చర్యలు : రిజర్వ్ చేసిన రైల్వే టిక్కెట్లను కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా కష్టమైన పని, ఎందుకంటే టోట్‌లు టిక్కెట్లు పెద్దమొత్తంలో మూలన పడుతున్నాయి.

ఆన్‌లైన్‌లో ధృవీకరించబడిన రైల్వే రిజర్వేషన్‌లను చట్టవిరుద్ధమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం సామాన్యులకు ధృవీకరించబడిన టిక్కెట్ల లభ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా టౌటింగ్ వ్యాపారాన్ని అనధికారికంగా నిర్వహించే వ్యక్తులపై ఆర్పి ఎఫ్ఫై కఠినంగా,నిరంతర నిఘా చర్యలను చేపడుతోంది.

RPF_

ఈ ఆపరేషన్ కింద 5179 మందిని అరెస్టు చేసి 4884 కేసులు నమోదు చేశారు. ఇందులో ఐ ఆర్ సి టి సి కి చెందిన 1021 అధీకృత ఏజెంట్లు రిజర్వ్ చేసిన టిక్కెట్లను మూలన పడేయడంలో అక్రమ మార్గాలను ఉపయోగిస్తున్నారు.

140 కంటే ఎక్కువ చట్టవిరుద్ధ సాఫ్ట్‌వేర్‌లు అటువంటి చట్టవిరుద్ధ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్న వాటి డెవలపర్‌లు, సూపర్ సెల్లర్‌లు, విక్రేతలు & రిటైలర్‌లను అరెస్టు చేయడం జరిగింది

ఆపరేషన్ NanheFaristey కింద పిల్లల రక్షించడం: వివిధ కారణాల వల్ల వారి కుటుంబం నుండి తప్పిపోయిన,పారిపోయి సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వీరిని రక్షించే గొప్ప కార్యక్రమాన్ని ఆర్పిఎఫ్ చేపట్టింది.

రైల్వేలో ప్రయాణించే పిల్లలకు సంరక్షణ వీరిని కాపాడేందుకు సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రైల్వే మంత్రిత్వ శాఖ డిసెంబరు 2021లో విడుదల చేసింది, ఇది 2022లో ప్రారంభించబడింది.

SOP ప్రకారం, ప్రస్తుతం CHDలు 143 రైల్వే స్టేషన్లలో పనిచేస్తున్నాయి. కుటుంబం నుండి అనేక కారణాల వల్ల కోల్పోయిన, విడిపోయిన పిల్లలను తిరిగి కలపడంలో RPF ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతీయ రైల్వేలతో సంబంధం ఉన్న సంరక్షణ & కాపాడి వారిని రక్షించింది.

ఈ విషయంలో ఇంటెన్సివ్ డ్రైవ్ అంటే. రైళ్లు, రైల్వే స్టేషన్లలో సంరక్షణ ,రక్షణ అవసరమైన పిల్లలను రక్షించడానికి భారతీయ రైల్వేలో ‘NanheFaristey’ ప్రారంభించబడింది. ఇది అద్భుతమైన ఫలితాలను చూపుతోంది. సంవత్సరంలో17,756 మంది పిల్లలను RPF సిబ్బంది రక్షించారు.

RPF_

ఆపరేషన్ AAHT -RPF కింద :మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా “ఆపరేషన్ AAHT” పేరుతో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ దళం కార్యాకలాపాలను ప్రారంభించింది.

మానవ అక్రమ రవాణాదారుల ప్రయత్నాలను అరికట్టడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని కలిగి ఉండటానికి, 2022లో జారీ చేయబడిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ప్రకారం, మానవ అక్రమ రవాణాకు నిరోధించే క్రమంలో భారతదేశంలోని 740 కంటే ఎక్కువ ప్రదేశాలలోRPF యూనిట్లు పనిచేశాయి.

రైల్వేలు సంవత్సరంలో 194 మంది మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులను అరెస్టు చేయడంతో 559 మంది అక్రమార్కుల నుండి రక్షించబడ్డారు.

మిషన్ “జీవన్ రక్ష”: – కదులుతున్న రైలులో ప్రయాణీకులు ఎక్కేందుకు/దించేయడానికి ప్రయత్నించి, రైలు చక్రాల కిందకు వచ్చే ప్రమాదంతో జారిపడి పడిపోయే సంఘటనలు ఉన్నాయి.

బాధలో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రయాణిస్తున్న రైలు ముందుకి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇతర సందర్భాలు ఉన్నాయి.

ఈ ఆపరేషన్ కింద RPF సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అలంటి వారిని ప్రాణాలను కాపాడేందుకు ప్రయతించడం జరిగింది. ఇలా సంవత్సరంలో, 852 విలువైన ప్రాణాలను RPF సిబ్బంది రక్షించారు.

ఆపరేషన్ “నార్కోస్” :మాదకద్రవ్యాలు యువత ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను, శ్రేయస్సును కూడా దెబ్బతీస్తాయి. ఆర్ ఫై ఎఫ్ కు వున్న వివిధ అధికారాలు, చట్టాలను అనుసరించి రైళ్లలో అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణా చేసే వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడానికి, ఆర్పిఎఫ్ ఆపరేషన్ నార్కోస్ను ప్రారంభించింది.

ఈ చర్యలలో భాగంగా 1081 నేరస్థులను అదుపులోకి తీసుకొని రూ 80 కోట్లు విలువ గల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది .

మర్చిపోయిన సామాను తిరిగి పొందడం: ఆపరేషన్ “అమానత్” కింద వాటిని అప్పగించడం : చాలా మంది ప్రయాణీకులు రైలు ఎక్కడానికి లేదా రైలు,స్టేషన్ నుండి బయలుదేరడానికి తమ వస్తువులను హడావిడిగా తీసుకెళ్లడం మర్చిపోతారు.

RPF_

ఈ ఆపరేషన్ కింద RPF సిబ్బంది అటువంటి వస్తువులను భద్రపరచడంలో , వాటిని అసలు యజమానికి తిరిగి అందించడం లాంటి సహాయం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ కింద 25500 లగేజీని తిరిగి పొందిండం వీటి విలువ దాదాపు రూ 46.5 కోట్లు.ఉంటుంది.

ఆపరేషన్ ‘WILEP’:-వన్యప్రాణులు, జంతువుల మరియు అటవీ ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేయడం ప్రకృతికి విరుద్ధం,నేరం. RPF ఈ సమస్యకు రైల్వేల ద్వారా వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో పాల్గొన్న స్మగ్లర్లపై ఈ ఆపరేషన్ కింద కఠినమైన చర్యలు తీసుకుంది.

సంవత్సరంలో 129 నిషేధిత వన్యప్రాణుల అక్రమ వ్యాపారానికి సంబంధించిన కేసులు నమోదు చేసింది .ఇందులో 75 మందిని అరెస్ట్ చేసారు. RPF , WCCB ఇతర వాటాదారులతో కలిసి నిరంతరం పని చేస్తోంది.

ఆపరేషన్ ‘యాత్రి సురక్ష’ : ప్రయాణీకులు వారి వస్తువులను సురక్షితంగా ఉంచడానికి RPF కట్టుబడి వుంది. ఈ దిశలో RPF దృష్టి సారించి 2022లో ఆపరేషన్ యాత్రి సురక్ష ప్రారంభించబడింది.

ప్రయాణీకుల భద్రత సంబంధిత ఫిర్యాదులను అత్యవసర పరిస్థితుల్లో స్పందిస్తూ వాస్తవిక సమయంలో పరిష్కరించడమే కాకుండా, ప్రయాణీకులకు సంబంధించిన నేరాలను నియంత్రించేందు కోసం GRPతో కలిసి పని చేస్తుంది.

అత్యవసర పరిస్థితుల్లో స్పందన :రైల్వేల ద్వారా ప్రయాణీకుల భద్రత మరియు సురక్షిత ప్రయాణం కోసం RPF ప్రత్యేక శ్రద్ధను కల్గి వుంది. టోల్ ఫ్రీ నంబర్ 139 (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నం. 112తో అనుసంధానం చేయబడింది).

RPF_

ఇతర సోషల్ మీడియా ఫోరమ్లు అంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కూ మొదలైనవి) ద్వారా భద్రత.. ఇతర ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు పరిష్కరించడానికి 24 గంటలూ RPF అందుబాటులో ఉంటుంది.

ప్రయాణీకులు. RPF వారి ప్రయాణ సమయంలో సంబంధిత సహాయం ప్రయాణికుల నుండి దాదాపు 2లక్షల కంటే పైగా ఫోన్ కాల్స్ కు స్పందించడం జరిగింది.

ప్రయాణం సమయంలో నేరాలకు పాల్పడే వారిని గుర్తింపు మరియు నివారించడం : ఈ ఆపరేషన్ కింద, రైల్వేల ద్వారా ప్రయాణీకుల భద్రత మరియు సురక్షిత ప్రయాణం పట్ల RPF ప్రత్యేక శ్రద్ధను అందిస్తుంది.

RPF ద్వారా IPC కింద ప్రయాణీకులకు సంబంధించిన వివిధ కేసుల్లో గుర్తించబడిన కేసులు అరెస్టు చేయబడిన వ్యక్తులు తదుపరి చట్టపరమైన చర్యల కోసం GRP/పోలీసులకు అప్పగించబడతారు.

సంవత్సరంలో RPF వివిధ రకాల ప్రయాణీకులకు సంబంధించిన నేరాలకు పాల్పడిన 5749 మంది నేరస్థులను IPC కింద అరెస్టు చేసి GRP/పోలీసులకు అప్పగించింది.

ఇందులో 82 మంది మాదకద్రవ్యాలు, 30 మంది దోపిడీదారులు , 380 మంది బందిపోటు దొంగలు, 2628 మంది దొంగలు, 1016 మంది చైన్ స్నాచర్లు, మహిళలపై నేరాలకు పాల్పడ్డ 93 మందిని అరెస్ట్ చేయడం జరిగింది

అక్టోబర్ 2020 నుండి భారతీయ రైల్వే నెట్వర్క్లో ప్రారంభించబడిన ఆపరేషన్ మహిళా సురక్ష : ‘మేరీ సహేలీ కింద మహిళల భద్రత మరింత పటిష్టం చేసింది దీని ప్రధాన లక్ష్యం మహిళా ప్రయాణీకులకు, ఒంటరిగా లేదా మైనర్లతో సుదూర రైళ్లలో ప్రయాణించే స్టేషన్ వచ్చే వారికీ అలాగే స్టేషన్స్టే నుండి బయలు దేరే మహిళలకు భద్రత కల్పించడం దీని అమలు కోసం అన్ని జోనల్ రైల్వేలలో మహిళా RPF సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు.

RPF_

ప్రస్తుతం భారతీయ రైల్వేలలో సగటున రోజుకు 640 కంటే ఎక్కువ రైళ్లను కవర్ చేస్తూ సగటున 243 బృందాలు మహిళల రక్షణకోసం ఆయా స్టేషన్లలో మోహరించివున్నాయి.

ఈ మేరీ సహేలీ బృందాలకు సాధికారత కల్పించడానికి, భద్రత, భరోసా అవసరమయ్యే మహిళా ప్రయాణీకులను గుర్తించడం అలాగే ఈ బృందాలకు సహాయపడటానికి 2022లో మేరీ సహేలీ IT మాడ్యూల్ ప్రారంభించబడింది.

భారతీయ రైల్వేల ప్రధాన లక్ష్యం మహిళా ప్రయాణీకుల భద్రత కల్పించడానికి వారిని ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై చర్యలు తీసుకునే విదంగా మిశ్రమ సిబ్బందితో ( పురుషులు -మహిళా RPF సిబ్బంది) రైలులో ఎస్కార్టింగ్, అలాగే 861 స్టేషన్లలో CCTV నిఘాను ఏర్పాటు మహిళా ప్రత్యేక సబర్బన్ రైళ్లలో 6368 కోచ్లలలో మహిళా ఎస్కార్ట్లు విధులు నిర్వహిస్తున్నారు. మహిళల కోచ్లలో అనధికారికంగా వారి కోచ్ లలో ప్రవేశించకుండా నిరోధించడం వంటి చర్యలు మొదలైనవి.

ఆపరేషన్ “మాతృశక్తి” కింద ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకు సహాయం అందించడం: RPF సిబ్బంది, ముఖ్యంగా మహిళా RPF సిబ్బంది, మాతృశక్తి ఆపరేషన్ కింద ప్రసవ సమయంలో రైలులో ప్రయాణం సాగించే గర్భిణీ స్త్రీలకు సహాయం చేయడానికి మహిళా RPF ముందువరుసలో వుంటూ సేవలందిస్తున్నారు సంవత్సరంలో RPF మహిళా సిబ్బంది 209 శిశు జననాలలో సహాయం చేసారు.

ఆపరేషన్ “SEWA” క్రింద అనారోగ్యంతో, గాయపడిన, ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులకు సహాయం: ఈ ఆపరేషన్ కింద RPF సిబ్బంది వృద్ధ పౌరులు, మహిళలు, శారీరక వికలాంగులు, జబ్బుపడిన, గాయపడిన వ్యక్తులకు రైళ్లలో ప్రయాణించే వారికీ కావాల్సిన సేవలు అందిస్తూ వారికీ సహాయం చేస్తారు.

వీల్ చైర్స్, స్ట్రెచర్, వైద్య సహాయం, అంబులెన్స్, ఔషధం, శిశువులకు ఆహారం అందించడం వంటి ఇతర సౌకర్యాలను అందించడం. ఇలా సంవత్సరంలో, 37000 కంటే ఎక్కువ మందికి RPF సహాయం అందించింది.

ఆపరేషన్ “సాటార్క్” కింద నిషిద్ధ వస్తువులు,చట్టవిరుద్ధమైన వస్తువుల రవాణాపై చర్య: రైళ్లలో నిషిద్ధ వస్తువులను రవాణా చేయడం పన్ను ఎగవేతదారులకు, చట్టాన్ని ఉల్లంఘించేవారికి ప్రధాన మార్గంగా మారింది.

పొగాకు ఉత్పత్తులు, మద్యం, ఎఫ్ఐసిఎన్ లెక్కల్లో చూపని బంగారం , లెక్కలోకి రాని నగదు ,లెక్కలోకి రాని ఇతర విలువైన లోహం, అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులు,ఆయుధాలు వంటి నిషిద్ధ వస్తువులను RPF , ఇతర LEA సహాయం తో రికవరీ చేయడందీని లక్ష్యం.

మందు గుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, నిషేధిత మందులు. ఈ సంవత్సరంలో ఇటువంటి వస్తువులను తీసుకెళ్లే వారిని గుర్తించి RPF 2331 మంది వ్యక్తులను అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత LEAలకు వారిని అప్పగించింది.

ఈ తనిఖీల్లో పొగాకు ఉత్పత్తుల విలువ రూ. 7.47 కోట్లు; మద్యం విలువ రూ. 3.32 కోట్లు క్రింద పేర్కొన్న ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


ఆపరేషన్ ‘సంరక్ష’ కింద రైలు కార్యకలాపాల భద్రతను పెంచే ప్రయత్నాలు: ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు దీన్ని ప్రారంభించబడింది. ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లు రువ్వడం, రైలులో మండే లేదా టపాకాయలు తీసుకెళ్లడం మొదలైన నేరస్థులపై చర్యలు తీసుకుంటున్నారు.

నడుస్తున్న రైళ్లపై రాళ్లదాడికి సంబంధించి 1503 కేసులను RPF నమోదు చేసి 488 మందిని అరెస్టు చేసింది. రైల్వే ట్రాక్ సమీపంలోని నివాసితులకు అవగాహన కల్పించడానికి వివిధ మార్గాలను ఉపయోగించి RPF అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రైళ్లలో మండే/టపాకాయలు తీసుకెళ్తున్న 100 మందికి పైగా వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.

RPF_


అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆపరేషన్ ‘జనదేశ్’ ద్వారా సేవలు : హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్లో RPF బృందాలు మోహరించడం జరిగింది.

అసెంబ్లీ,పార్లమెంటరీ ఎన్నికల సమయంలో ఎన్నికలు స్వేచ్ఛగా ,నిష్పక్షపాతంగా నిర్వహించడంలో,ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించడంలో RPF సేవలను అందించడం జరిగింది.

ఆపరేషన్ ‘సాథి’ కింద పౌర కార్యాచరణ కార్యక్రమం: ఈ ఆపరేషన్ కింద, ప్రత్యేకించి రైల్వే ట్రాక్ల ప్రక్కన నివసించే ప్రాంతాలలో యువత నైపుణ్యాభివృద్ధికి ,వారి ఉపాధిని సులభతరం చేయడానికి అనేక ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా PSUలను అనుబంధించడం కోసం వారికి సరైన శిక్షణ అందించడం జరిగింది .సమాజంలో యువత ఒక విశ్వాస బంధాన్ని పెంపొందించుకోవడం అలాగే దుర్బలమైన యువతను నేరాల మార్గం నుండి దూరం చేస్తూ వారిని ఒకమంచి పౌరులుగా తీర్చిదిద్దెందుకు RPF కృషి చేస్తుంది.

ఆపరేషన్ డిగ్నిటీ కింద సంరక్షణ మరియు పెద్దలకు అవసరమైన రక్షణ: ఈ ఆపరేషన్ కింద, ఇళ్ళ నుండి పారిపోయిన, విడిచిపెట్టిన, మాదకద్రవ్యాలకు బానిసైన, నిరుపేద, అపహరణకు గురైన, వదిలివేయబడిన, తప్పిపోయిన, వైద్య సహాయం అవసరమైన,మానసికంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళల అలాగే పెద్దలను సంరక్షణ, రక్షణ అవసరమయ్యే చర్యలను RPF చేపట్టింది 2022లో అలంటి వారిని సుమారుగా. 3400 మందిని రక్షించారు.

‘ఆపరేషన్ రైల్ ప్రహారీ’ కింద : అనుమానితులు రైళ్లలో ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కకుండా వుండే వారిని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు, ఇతర చట్టబద్దమైన సంస్థలకు సహాయం అందించడం జరుగుతుంది.

RPF సిబ్బంది ప్రధాన స్టేషన్లలో వారి వ్యూహాత్మకముగా వ్యవహరించడం మూలాన అలాగే అత్యవసర పరిస్థితికి సత్వర ప్రతిస్పందిస్తూ USP విధానాన్ని అనుసరిస్తుంటారు.

ఒక రాష్ట్రానికి చెందిన రాష్ట్ర పోలీసులు తమ అనుమానితులను ప్రస్తుతం వేరే రాష్ట్రం గుండారైళ్ల లో ప్రయాణిస్తూ తప్పించుకుంటు తిరుగుతుంటారు .ఇలాంటి పరిస్థితుల్లో సాధారణముగా నిర్వహించే తనిఖీ సమయంలో RPF యొక్క వలలో చిక్కుకుంటారు.

RPF_

ఆపరేషన్ రైల్ ప్రహరీ కింద, రైళ్లలో పారిపోతున్న అనుమానితులను పట్టుకోవడంలో RPF దాని USPని ఉపయోగిస్తుంది. అలాగే ఇతర పోలీసు బలగాలు, చట్టబద్ధ ఏజెన్సీలు ఇచ్చినా సమాచారాన్ని బట్టి ఈ తనిఖీలు నిర్వహిస్తుంటారు.

ఇలా 2022లో, 151 మంది అనుమానితులను RPF పట్టుకుంది మరియు నేరాలకు సంబంధించి సంబంధిత ఏజెన్సీలకు నిందితులను అప్పగించడం జరిగింది .

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నేరస్థులు మరియు దేశానికి హాని కలిగించే శక్తుల నుండి రైల్వేలను సురక్షితంగా ఉంచడానికి తీవ్రంగా కృషి చేయడమే కాకుండా, “గౌరవాన్ని పొందడం ” అనే దాని నినాదాన్ని అవసరమైన వారికి సహాయపడే “సేవాహి సంకల్ప్” లక్ష్యం నెరవేర్చడానికి తీవ్రంగా కృషి చేస్తుంది.

దేశ పౌరుల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించే క్రమంలో కొత్త పద్దతులను సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలు, అభ్యాసాలను ఉపయోగిస్తూ ముందుకు వెళ్తుంది.