Thu. Apr 25th, 2024
Procurement of grain at minimum support price in Chhattisgarh

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 3,2021: సెంట్రల్‌ పూల్‌ కింద; డీసీపీ, డీసీపీయేతర రాష్ట్రాల్లో రైతుల నుంచి వరిధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. డీసీపీ రాష్ట్రానికి సంబంధించి, ఎంవోయూలోని 3వ నిబంధన ప్రకారం, “ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ, కనీస మద్దతు ధర కంటే ఎక్కువ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ లేదా ఆర్థిక ప్రోత్సాహకంగా అందిస్తున్న పరిస్థితుల్లో, టీపీడీఎస్‌/ఓడబ్ల్యూఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించినదానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పంటను సేకరిస్తే, అదనంగా ఉన్న మొత్తాన్ని సెంట్రల్‌ పూల్‌లో భాగంగా పరిగణించరు”.రాష్ట్రాలు నిర్ణయించిన అంచనాలనే ప్రారంభ లక్ష్యాలుగా గుర్తించారు. ప్రోత్సాహకాలు ఇస్తున్నాయా లేదా అని రాష్ట్రాలను కేంద్రం అడుగుతుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సహా కొన్ని రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు గుర్తించారు. కనుక, బోనస్/ప్రోత్సాహకం లేకుండా గతంలో సేకరించిన పరిమాణానికి కేంద్ర ప్రభుత్వ సేకరణను పరిమితం చేశారు. కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని అనుసరిస్తూ,  రైతులకు మద్దతునిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో సేకరణ విషయంలోనూ ఇదే అనుసరిస్తుంది.

Procurement of grain at minimum support price in Chhattisgarh
Procurement of grain at minimum support price in Chhattisgarh

    ఖరీఫ్‌ మార్కెట్‌ సీజన్‌ 2020-21లో భాగంగా, గతనెల 17వ తేదీన, రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజనపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కేఎంఎస్‌ 2020-21లో, ఎంఎస్‌పీని మించిన పరోక్ష ప్రోత్సాహకం రూపంలో ఎకరానికి రూ.10 వేలు చెల్లించడం ద్వారా, క్వింటాల్‌కు రూ.2,500 చొప్పున రైతుల నుండి వరిధాన్యాన్ని సేకరిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. బోనస్‌ తరహాలోనే ఇది మంచిదని ప్రకటనలో అభివర్ణించింది.ఆ ప్రకటన నేపథ్యంలో, సెంట్రల్ పూల్ కింద, కేఎంఎస్‌ 2020-21లో 24 ల.మె. టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసేందుకు అనుమతించాలని నిర్ణయించారు. గతంలో అనుమతించిన పరిమాణానికి ఇది సమానం.