ప్రతీకారం, డ్రామాతో కూడిన తమిళ చిత్రం సాని కాయిదాం ట్రైలర్‌ విడుదల చేసిన ప్రైమ్‌ వీడియో

Business Celebrity Life Cinema Entertainment Featured Posts National Technology Trending TV Shows
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా ,26 ఏప్రిల్,2022:అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ ప్రతీకార చిత్రం సాని కాయిదాం ట్రైలర్‌ను ప్రైమ్‌ వీడియో నేడు విడుదల చేసింది. స్క్రీన్‌ సీన్ మీడియా పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 6 May నుంచి సాని కాయిదాం చిత్రం ప్రైమ్‌ వీడియోలో చూడవచ్చు. ఈ చిత్రం తెలుగులో చిన్ని, మలయాళంలో సాని కాయిదంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది.

ఐదేళ్ల కుమార్తె ధన్నా, రైస్ మిల్లులో కూలీగా పనిచేసే భర్త మారితో కలిసి జీవిస్తుంది కానిస్టేబుల్‌గా పని చేసే పొన్ని (కీర్తి సురేశ్‌). ఆమె జీవితం ఎలా సాగిందో హృదయాలు మెలిపెట్టేలా చూపే చిత్రం చిన్ని. ఒక దురదృష్టకరమైన రాత్రి ఆమె తన సర్వస్వాన్ని కోల్పోతుంది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె తన చేదు గతాన్ని సంగయ్యకు (సెల్వరాఘవన్) చెప్పి అతను మద్దతు
తీసుకుంటుంది.

తన పాత్ర గురించి కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ, “ నేను గతంలో చేసిన పాత్ర్లకు పూర్తిగా భిన్నమైనది సాని కాయిదం. ఈ చిత్రంలో నా పాత్ర తీవ్రంగా, మొరటుగా ఉంటుంది. అది నా పాత్ర. దర్శకుడు అరుణ్ కథ చెప్పే విధానం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది, ఆయన దార్శనికత నచ్చి ఈ క్లిష్టతరమైన చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపాను. అంతే కాదు దర్శకుడు సెల్వ రాఘవన్‌ ఈ చిత్రంలో నటించడానికి మించినది ఇంకేమైనా ఉందా! పూర్తి మనస్సు పెట్టి నేను ఈ చిత్రంలో నటించాను, ప్రపంచవ్యా ప్తంగా ఉన్న నా అభిమానులు ప్రైమ్‌ వీడియోలో సాయి కాయుదాం చూడగలగటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. May 6న ప్రేక్షకుల స్పందన చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

దర్శకుడిగా మారిన నటుడిగా మారిన సెల్వరాఘవన్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందు నిల్చోవడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిం చింది. ఇంత శక్తిమంతమైన పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం లబించింది. ప్రతిభావంతురాలైన కీర్తి సురేశ్‌ కలిసి నటించడం గొప్ప అనుభవం. ఆమె ఈ చిత్రంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దర్శకుడు, అరుణ్ మాథేశ్వరన్‌కు
దర్శకత్వ కళలో ఎంతో నైపుణ్యం ఉంది, ఆయన కథ నుంచే కాదు నటీనటుల నుంచి కూడా ది బెస్ట్ వెలికిశారు. ప్రైమ్ వీడియోలో సాని కాయిదామ్ విడుదల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా యామిని యజ్ఞమూర్తి, సంగీత దర్శకుడిగా సామ్ సిఎస్, ఆర్ట్ డైరెక్టర్‌గా రాము తంగరాజ్, ఎడిటర్‌గా నాగూరన్ రామచంద్రన్, స్టంట్స్ డైరెక్టర్‌గా దిలీప్ సుబ్బరాయ న్,క్రియేటివ్‌గా సిద్ధార్థ్ రావిపాటి ఉన్నారు
నిర్మాత.


Telugu – https://youtu.be/5CeTBvToggE
Tamil – https://youtu.be/Ri_4HlFQHU4

ప్రైమ్‌ వీడియో క్యాటలాగ్‌లో ఉన్న వేలాది హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు, టీవీ షోల సరసన సాని కాయిదాం చేరనుంది. ఇందులో గెహరాయియా, షేర్‌ షా, సర్దార్‌ ఉధమ్‌, జై భీమ్, గులాబో సీతాబో, శకుంతలా దేవి, కూలీ నెం. 1. దుర్గామతి, ఛలాంగ్‌, సూరారై పొట్రు, వి. సీ యూ సూన్‌. నిశ్శబ్ధం, హాలాల్‌ లవ్‌ స్టోరీ, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌, మారా, భీమసేన నలమహారాజా, మానే నెం.13, పెంగ్విన్‌, లా, సూఫీయుం సుజాతయుం, పొన్మగల్‌ వందల్‌, ఫ్రెంచ్‌ బిరియాని వంటి భారతీయ చిత్రాలు ఉన్నాయి. భారతదేశపు ఈ నెంబర్‌ వన్‌ వినోద గమ్యస్థానం భారత్‌లో నిర్మించిన అమెజాన్‌ ఒరిజిన్‌ సిరీస్‌ బెస్ట్‌ సెల్లర్‌, ఇన్‌సైడ్‌ ది ఎడ్జ్ సీజన్‌ 3, ముంబయి డైరీస్‌, ది ఫ్యామిలీ మ్యాన్‌, కామికిస్థాన్‌ సెమ్మ కామెడీ పా, బ్రీథ్‌: ఇంటూ ది షాడోస్‌, పాతాళ్‌ లోక్‌, మీర్జాపూర్‌ సీజన్‌ 1 & 2, ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ- ఆజాదీ కే లియే, సన్స్‌ ఆఫ్‌ ది సాయిల్‌: జైపూర్‌ పింక్‌ పాంథర్స్, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ ఎస్‌ 1 అండ్‌ 2, మేడిన్‌ ఇన్‌ హెవెన్‌ వంటివి ఉన్నాయి.

అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు పొందిన అమెజాన్‌ ఒరిజినల్స్‌ బొరాట్‌ సబ్‌సీక్వెంట్‌ మూవీ ఫిల్మ్‌, ది వీల్‌ ఆఫ్‌ టైమ్‌, టామ్‌ క్లాన్సీ నటించిన జాక్‌ రేయాన్‌, ది బాయ్స్‌, హంటర్స్‌, ఫ్లీబ్యాగ్‌, ది మార్వెలెస్‌ మిసెస్‌ మిషల్‌ వంటివి అందిస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు, నాణ్యమైన సమయాన్ని వినోదభరితంగా గడిపేందుకు అనేక ఛాయిస్‌లు అందిస్తోంది. ఇవన్నీ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు చూడవచ్చు. ఇందులో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్‌, తెలుగు, కన్నడ,మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషల చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రైమ్‌ సభ్యులు సాని కాయిదాం చిత్రాన్ని ప్రైమ్‌ వీడియో ఆప్‌ ద్వారా స్మార్ట్‌ టీవీలు, మొబైల్‌
డివైసులు, ఫైర్‌ టీవీ, ఫైర్‌ టీవీ స్టిక్‌, ఫైర్‌ ట్యాబ్లెట్లు, యాపిల్‌ టీవీ మొదలైన వాటిల్లో ఎప్పుడైనా,ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్‌ వీడియో యాప్‌లో ప్రైమ్‌ సభ్యులు ఎపిసోడ్లు డౌన్‌లోడ్‌ చేసుకొని తమ మొబైల్స్‌, ట్యాబ్లెట్లలోఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లోనూ చూడవచ్చు.₹1499 వార్షిక రుసుముతో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌తో పాటు ప్రైమ్ వీడియో పొందవచ్చు.