కీర్తి సురేశ్‌, సెల్వరాఘవన్‌ నటించిన సాని కాయిదం చిత్ర ప్రపంచవ్యాప్త విడుదల తేదీని ప్రకటించిన ప్రైమ్ వీడియో

Business Cinema Entertainment Featured Posts Life Style National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్ 22,2022:అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ప్రతీకారం,యాక్షన్-డ్రామా సాని కాయిదం చిత్ర ప్రపంచవ్యాప్త విడుదల తేదీని ప్రైమ్‌ వీడియో నేడు ప్రకటించింది.స్క్రీన్ సీన్ మీడియా బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. పొన్ని (కీర్తి సురేష్ పోషించిన పాత్ర) ఆమె కుటుంబానికి తరతరాలుగా వస్తున్న శాపం నిజమవుతూ ఉంటుంది. టీజర్ ప్రోమోలో చూసినట్లుగా ఆమె చేదు గతాన్ని పంచుకున్న సంగయ్య (సెల్వరాఘవన్ పోషించిన)తో కలిసి ప్రతీకారం తీర్చుకుంటుంది.

తమిళ చిత్రం May 6 నుంచి ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమ వుతుంది. తెలుగులో చిన్నిగా, మలయాళంలో సాని కాయిదంగా కూడా దీనిని వీక్షించవచ్చు.“ప్రైమ్ వీడియోలో భాష, భౌగోళిక సరిహద్దులు దాటి ప్రయాణించే అవకాశం ఉన్న కథల కోసం మేము ఎప్పుడూ వెతుకుతూ ఉంటాం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాని కాయిధామ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధార్థ్ రావిపాటి, అరుణ్ మాథేశ్వరన్‌తో కలిసి పనిచేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది” అన్నారు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇండియా కంటెంట్ లైసెన్సింగ్ హెడ్ మనీష్ మెంఘాని. “సాని కాయిదం బాగా ఆకట్టుకునే కథ, కట్టిపడేసే కథనం, అద్భుతమైన నటన, యాక్షన్, డ్రామా అభిమానులను చివరి వరకు కట్టిపడే స్తాయి.”

“సాంప్రదాయ కథలను సంప్రదాయేతర విధానంలో చెప్పడం, మొరటు, పదునైన అంశాలు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. ప్రతీకార నేపథ్యం చుట్టూ అల్లిన క్లిష్టమైన యాక్షన్ చిత్రం ఇది. ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఒక మహిళకు సంబంధించిన కథ ఇది” అని దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ అన్నారు. “ప్రతి కథకు ప్రేక్షకులు ఉంటారు, అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు,ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రేక్షకుల ముందుకు సాని కాయిదాంను తీసుకు వెళ్తుండటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది.”“సాని కాయిదమ్ ఆకట్టుకునే కథే కాదు, మనస్సులను కదిలిస్తుంది కూడా.

న్యాయం కోసం పోరాడుతున్న ఒక మహిళ శక్తిని చూపడంలో అరుణ్‌ మాతేశ్వరన్‌ అద్భుతంగా వ్యవహరించారు. కీర్తి సురేష్, సెల్వరాఘవన్ ఇద్దరూ ఈ చిత్రంతో తన చక్కని నటనతో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అందించారు.అది కథను మరింత ఆకట్టు కునేలా చేస్తుంది” అని చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రావిపాటి అన్నారు. “May 6న వేర్వేరు భాషల్లో ప్రైమ్ వీడియోలో విడుదలయ్యే ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను .”