Fri. Mar 29th, 2024
arrest

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 21,2022: షాహినాయత్‌గంజ్ పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందం గురువారం సాయంత్రం హవాలా మనీ రాకెట్‌ను ఛేదించింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్న ఆరోపణలపై నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి లెక్కలో చూపని రూ.1.1 కోట్ల నగదు తోపాటు నాలుగు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది టాస్క్‌ఫోర్స్ బృందం.

అరెస్టయిన వారిలో కమలేష్ (47), అశోక్ కుమార్ (35), రాహుల్ అగర్వాల్ (28), రతన్ సింగ్ (25) గోషామహా, ఘాన్సీ బజార్ ,షాహినాయత్‌గంజ్‌లకు చెందిన వ్యాపారులు ఉన్నారు. బేగంబజార్‌లో ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్న ప్రధాన నిందితుడు కమలేష్ కుమార్ తన వ్యాపారంలో లాభాలు లేకపోవడంతో నగరంలో హవాలా వ్యవహారాలపై దృష్టి పెట్టాడని పోలీసులు తెలిపారు.

 arrest

“కమీషన్ ప్రాతిపదికన హవాలా రాకెట్‌ను నిర్వహించడంలో అతనికి సహాయం చేయడానికి అంగీకరించిన తన సహచరులతో అతను తన ప్రణాళికను పంచుకున్నాడు. వారు డబ్బు వసూలు చేయడంలో ,కస్టమర్లకు డెలివరీ చేయడంలో సహాయం చేసారు, ”అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

పక్కా సమాచారం మేరకు పోలీసులు జుమ్మెరత్ బజార్‌లోని ఎంజే బ్రిడ్జి వద్ద వాహన తనిఖీల్లో భాగంగా ఈ హవాలా ముఠాను పట్టుకున్నారు. వారిని ప్రశ్నించగా సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.